విజయవాడ(చైతన్యరథం): వరద ప్రభావిత ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగస్వామ్యం అయ్యేందుకు పలువురు దాతలు తమ ఔదార్యాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం విజయవాడ కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబును కలిసి పలువురు విరాళాలు అందించారు. విరాళాలు అందించిన వారిలో….
1. నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.25 లక్షలు
2. కాకతీయ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ రూ.25 లక్షలు
3. ఎల్వీఆర్ సన్స్ క్లబ్ రీడిరగ్ కమిటీ సభ్యులు రూ.25 లక్షలు
4. చుక్కపల్లి రమేష్ రూ.25 లక్షలు
5. ఏపీ ఫౌల్ట్రీ అసోసియేషన్ రూ. 25 లక్షలు
6. గుంటూరు క్లబ్ రూ.10 లక్షలు
7. తెనాలి డబుల్ హార్స్ రూ.10 లక్షలు
8. ఐఏఎస్ ఆఫీసర్స్ వైవ్స్ అసోషియేషన్ రూ.5 లక్షలు(అందించిన వారు రేష్మా ప్రసాద్(ప్రెసిడెంట్), పద్మవల్లి(సెక్రటరీ), ప్రభా భాస్కర్, కృష్ణబాబు)
9. చిలకమర్రి శ్రీనివాసాచార్యులు రూ. 1,50,000(నగదు)
10. షేక్ బాజీ రూ.50,000
11. సీ.జగదీష్ సాయి రూ.21,000 (మంత్రి సవితమ్మ కుమారుడు, 6వ తరగతి, కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బులు) విరాళం అందించారు..
విజయనగరం జిల్లా సమాఖ్య తరఫున రూ.10 లక్షల విరాళం
బుడమేరు వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధుల సాధికారిత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా స్వయం సహాయక సంఘాల సమాఖ్య ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి పది లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. విజయనగరం జిల్లా సమాఖ్య నాయకులు రూ. 10 లక్షల చెక్కును రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకిస్వయంగా అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాఖ్య కార్యదర్శి కె వెంకట సత్యవతి, గంట్యాడ మండల సమాఖ్య అధ్యక్షురాలు పి జనని, జిల్లా సమాఖ్య మేనేజర్ పి సాయి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ఈ మేరకు సంబంధిత చెక్కులు, నగదును సీఎం చంద్రబాబుకు అందించారు. విపత్కర పరిస్థితుల్లో బాధితుల పక్షాన నిలిచేందుకు వస్తున్న ప్రతి ఒక్క దాతకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.