- కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ధైర్యం చెప్పిన భువనేశ్వరి
- నాలుగు కుటుంబాలకు పరామర్శ
- ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల ఆర్థికసాయం అందజేత
కాకినాడ : నిజం గెలవాలి కార్యక్రమానికి వచ్చిన భువనేశ్వరిని కలిసేందుకు పార్టీ కార్యకర్తలు ఆయా నియోజకవర్గా ల్లో పెద్దఎత్తున తరలివచ్చారు. నిజం గెలవాలి కార్యక్రమానికి సంఫీుభావం తెలిపేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భువనమ్మా… మీకు మేము న్నాం… ధైర్యంగా ఉండండి అంటూ మహిళలు పెద్ద ఎత్తున స్పందించడం గమనార్హం. పురుషులను పక్కకు నెట్టి మరీ మహిళలు ముందు వరుసలోకి వచ్చి భువ నమ్మతో కరచాలనం చేసి సంఫీుభావం తెలిపేందుకు పోటీపడ్డారు. తనను చూసేందుకు వచ్చిన మహిళలను భువనేశ్వరి ఆప్యాయంగా పలకరించారు. తనకు ధైర్యం చెప్పిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ముందుకు సాగారు. జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎత్తు పీటపై నిలబడి అందరికీ అభివాదం చేసి ధన్యవాదాలు తెలియజేశారు.