- రూ.203.3 కోట్లు ఖర్చు చేస్తే రూ.534 కోట్లు మింగేశామని రోత రాతలా?
- భోజన ప్యాకెట్లకు రూ.54.5 కోట్లయితే రూ.368 కోట్లని ప్రచారం చేస్తారా?
- మంచినీళ్ల బాటిళ్లకు రూ.11.22 కోట్లు ఖర్చయితే రూ.26 కోట్లు అంటారా?
- శానిటేషన్‌లో రూ.18 కోట్లు ఖర్చయితే రూ.51 కోట్లు అని చెప్పడం సిగ్గుచేటు
- మీ ప్రభుత్వంలో ఎగ్ పఫ్‌ల పేరుతో రూ.3.5 కోట్లు మింగేసింది నిజం కాదా?
- సర్వే రాళ్లపై బొమ్మకు రూ.700 కోట్లు, రంగులకు రూ.3 వేల కోట్లు సిగ్గుందా?
- సొంత పత్రిక ప్రకటనలకు రూ.500 కోట్లు దుర్వినియోగం చేయటం నీచం
- రూ.5 వేల కోట్లు విలాసాలకు, ప్రచార పిచ్చికి దుబారా చేసి భ్రష్టు పటించారు
- ఒక్క వాటర్ బాటిల్ ఇవ్వని జగన్‌రెడ్డి నేడు ఏ మొఖం పెట్టుకుని ప్రశ్నిస్తున్నాడు
- వరద బాధితులకు కోటి సాయం ప్రకటించి ఇవ్వని నీచమైన చరిత్ర నీదికాదా?
- తాడేపల్లి ప్యాలెస్‌లో వరద సాయం పేరుతో అందినంత దండుకోలేదా?
- చిన్నపిల్లల కిడ్డీ బ్యాంకులను వదలకుండా దోచుకున్నది వాస్తవం కాదా?
- నేడు ప్రతి ఇంటికి రూ.25 వేలు ఇస్తే…నీ హయాంలో రూ.2 వేలే ఇచ్చారు
- ఊరికో ప్యాలెస్ ఉన్న నీ చరిత్ర ఎక్కడ..చంద్రబాబు చరిత్ర ఎక్కడ?
మంగళగిరి(చైతన్యరథం): వరద సాయంపై జగన్ ముఠా, రోత పత్రిక విషప్రచారంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో వైసీపీ నేతల తప్పుడు ప్రచా రంపై మండిపడ్డారు. వరదల్లో రేయింబవళ్లు బాధితులకు అండగా ఉండి ఏ విధంగా కష్టప డ్డారో ప్రపంచం మొత్తం చూసింది..దటీజ్ చంద్రబాబు. ప్రజలు కష్టాల్లో ఉంటే ఆయనకు కంటి మీద నిద్ర ఉండదు. కష్టాల్లో ఉన్న లక్షల మందికి అన్ని రకాలుగా భోజనం, మంచి నీళ్లు, పాలు, పండ్లు, నిత్యావసరాలు అందించి వారు కోలుకునేదాకా శ్రమించారు. కానీ గత ఐదేళ్లలో ప్రజలు కష్టాల్లో ఉంటే తాడేపల్లి కొంప దాటి ఎన్నడూ బయటకు రాని జగన్ రెడ్డి గాల్లోనే పర్యటిస్తూ చక్కర్లు కొట్టారు. నేడు రోత పత్రికలో నీచమైన రాతలతో నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాయిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
వరద బాధితులకు ఏం చేశావ్?
వరద బాధితులకు సొంతంగా వారు ఒక్క వాటర్ బాటిల్ కూడా ఇవ్వని జగన్ రెడ్డి మీడియా ముందు షో చేసి వెళ్లాడు. వైసీపీ నాయకులు ఎవరైనా బాధితుల ఇంటికి వెళ్లి సాయం చేశారా? అని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నా ఆ రోజున చార్‌థామ్ యాత్రలో చిక్కుకుపోయిన వారిని క్షేమంగా ఇంటికి తీసు కొచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. గోదావరి వరద లొచ్చినప్పుడు జగన్‌రెడ్డి ఏమైనా వరదల్లో తిరగలేదు..కానీ చంద్రబాబు స్వయంగా వెళ్లారు. అన్నమయ్య ప్రాజెక్టు కట్టు తెగినప్పుడు జగన్‌రెడ్డి పట్టించు కోలేదు..అందరికంటే ముందుగా వెళ్లింది చంద్రబాబే. సాయమందించింది ఎన్టీఆర్ ట్రస్టు. చంద్రబాబు అలా అన్ని రకాలుగా ముందున్నారు. ఏ సాయం చేయకపోగా జగన్‌రెడ్డి చేసిన వాళ్లపై విషపు రాతలు రాయిస్తూ దుష్ప్రచారానికి తెగబడ్డాడు. వాస్తవాలు ప్రజలకు తెలియజేయడానికి మీడియా ముందుకు వచ్చాం. ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది.. ఎంతసాయం చేసింది అంకెలతో చెబుతున్నాం.
రూ.534 కోట్లు బొక్కేశారని సిగ్గులేని రాతలా?
నష్టపోయిన కుటుంబాలకు జిల్లా యంత్రాంగం ద్వారా ఖర్చు చేసిన మొత్తం వరద సాయం విలువ రూ.139.75 కోట్లు. దీనికి సివిల్ సప్లయీస్ వారు అదనంగా రూ.63.60 కోట్ల విలువైన బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు. మొత్తంగా కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ. 203.3 కోట్లు(రూ.139.75 కోట్లు, రూ.63.60 కోట్లు) వరదసాయంగా ఖర్చు చేయడం జరిగింది. కానీ రోత పత్రికలో మాత్రం రూ.534 కోట్లు బొక్కేశారంటూ విష ప్రచారం చేశారు. ఫుడ్ ప్యాకెట్ల కోసం రూ.57.45 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కొక్క ప్యాకెట్‌కు రూ.50 చొప్పున 1,14,90,410 ప్యాకెట్లకు ప్రభుత్వం చెల్లించింది. అయితే తప్పుడు పత్రిక సాక్షిలో రూ.368 కోట్లు అని రోత రాతలు రాశారు. తాగునీటి బాటిళ్ల కోసం 500 ఎంఎల్ బాటిల్స్ 80 లక్షలు సరఫరా చేశాం.. ఒక్కొక్క బాటిల్ రూ.7 చొప్పున రూ.5.60 కోట్లు ఖర్చు పెట్టారు. లీటర్ వాటర్ బాటిళ్లు మొత్తం 43,25,796 పంపిణీ చేయగా ఒక్కొక్క వాటర్ బాటిల్ ఖర్చు రూ.13లు చొప్పున రూ.5.62 కోట్లు ఖర్చయింది. 500 ఎంఎల్, లీటర్ వాటర్ బాటిళ్లకు ఖర్చు పెట్టింది రూ.11.22 కోట్లయితే..నీలి మిడియాలో రూ.26 కోట్లు మింగేశారంటూ రాశారు. అలాగే శానిటేషన్‌కు అసలు ఖర్చు చేసింది రూ.18.34 కోట్లు అయితే రూ.51 కోట్లు దోచేశారని విష ప్రచారం చేయడం సిగ్గుచేటు. అగ్గిపెట్టెలకు, కొవ్వొత్తులకు నయా పైసా ఖర్చు చేయలేదు. కానీ రూ.23 కోట్లు అవినీతి చేశారని రోత పత్రిక, జగన్‌రెడ్డి ముఠా దుష్పప్రచారం చేసిందని ధ్వజమెత్తారు.
డ్రోన్లతో సాయం దేశ చరిత్రలో ఎక్కడైనా చూశారా?
దేశ చరిత్రలో డ్రోన్ల సాయంతో వరద సాయం అందించడం ఎక్కడైనా చూశామా? సీఎం మొట్టమొదటిసారి డ్రోన్లు ఉపయోగించి 1,23,751 ప్యాకెట్లు (బిస్కెట్లు, వాటర్, మిల్క్) పంపిణీ చేశాం. ఇళ్లలో సామగ్రి నష్టపోయిన ప్రజలకు అర్బన్ కంపెనీలతో జత కట్టి ఉచిత సర్వీసు అందించారు. మీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నీటమునిగిన ఇళ్లకు సుమారుగా రూ.2 వేల నుంచి రూ.4 వేలు ఇచ్చి మమ అనిపించావు. అదే చంద్రబాబు ప్రభుత్వం నీట మునిగిన ఇళ్లకు రూ.25 వేలు..నువ్వు ఇచ్చిన దాని కంటే ఐదారు రేట్లు అదనంగా ఇచ్చా రు. 25 కిలోల బియ్యం, లీటర్ పామాయిల్, కిలో కందిపప్పు ఇలా ఆరు రకాల నిత్యావసరాలు ఇచ్చారు. మీ లాగా నాలుగు బంగాళదుంపలు, నాలుగు టామోటాలు కాదు. అదేవిధంగా ఎంఎస్‌ఎంఈలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష ఇచ్చాం.. నువ్వు పైసా కూడా ఇవ్వలేదు. చేనేతలకు రూ.10 వేలు మీరు ఇస్తే…మా ప్రభుత్వం రూ.25 వేలు ఇచ్చింది. తోపుడు బండ్లకు నువ్వు ఎటువంటి పరిహారం ఇవ్వలేదు.. మేము కొత్త వాటిని ఇచ్చాం. దెబ్బతిన్న ప్రతి ద్విచక్ర వాహనానికి కూడా రూ.3 వేలు, ఆటోలకు రూ.10 వేలు ఇచ్చాం.. నువ్వు ఒక పైసా ఇచ్చావా? ఈ విధంగా చూస్తే నువ్వు చేసిన దానికి చంద్రబాబు 10 రేట్లు ఎక్కువ చేస్తున్నారు. అందుకే ప్రజలు ఇంటికి పిలిచి మరి ధన్యవాదాలు తెలుపుతున్నారని వ్యాఖ్యానించారు.
ఎగ పఫ్‌లకే రూ.3.5 కోట్లు మింగేశారు
జగన్‌రెడ్డీ..మీ ప్రభుత్వంలో ఎగ్ పఫ్‌లకు రూ.3.5 కోట్లు మింగావు. సచివాలయాలకు, బిల్డింగ్‌లకు రంగులు అంటూ రూ.3 వేల కోట్లు, సర్వే రాళ్లపై జగన్‌రెడ్డి బొమ్మలంటూ రూ.700 కోట్లు, రుషికొండపై ప్యాలెస్‌లో టబ్బులకు, కమోడ్లకు రూ.600 కోట్లు, నీ రోత పత్రికలో ప్రకటనలకు రూ.500 కోట్లు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు పాస్ పుస్తకాలపై మీ బొమ్మలు వేసుకోవడానికి రూ.13 కోట్లు, తాడేపల్లిలో నీ లగ్జరీ కోసం రూ.15 కోట్లు, మద్యం షాపులో ఎలుకలు పట్టడానికి కోటిన్నర, జగన్‌రెడ్డి వ్యక్తిగత పర్యటనలు, విలాసా లకు ఇలా మొత్తం ఖర్చు రూ.4,878 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశా రు. ఈ రోజు మేం నిజాయితీగా పారదర్శకంగా మంచి చేస్తుంటే మాపై తప్పుడు రాతలు రాయిస్తూ నిందలు వేస్తారా? అని ప్రశ్నించారు. ప్రజలను మభ్య పెట్టి మోసం చేసే ప్రయ త్నం చేస్తావా అంటూ నిలదీశారు.
వరద సాయం అంటూ వసూళ్లు చేసి మింగుతుంది నువ్వేగా
ఎప్పుడైనా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్లావా నువ్వు.. నీ చేతితో ఏమైనా పరిహారం అందించావా? మొన్న వరదలప్పుడు జగన్‌రెడ్డి కోటి సాయం ప్రకటించి కనీసం వెయ్యి రూపాయలన్నా ఇచ్చారా? వేల కోట్లు దిగమింగి ఊరుకో ప్యాలెస్ కట్టుకున్న నువ్వు కోటి రూపాయలు వ్యక్తిగతంగా కాకుండా పార్టీ తరపున ఇస్తానన్నావ్.. మళ్లీ తాడేపల్లిలో చెక్కులు తీసుకున్నావు..వచ్చిన డబ్బంతా ఏమి చేస్తున్నావు? అని ప్రశ్నించారు. వరద సాయం పేరుతో కూడా వసూళ్లు చేస్తున్నావు. చిన్న పిల్లల కిడ్డీ బ్యాంకు కూడా వదలట్లేదని ధ్వజమె త్తారు. చంద్రబాబు చెంతకు వచ్చిన ప్రతి రూపాయి ప్రతిరోజూ పత్రికలకు ప్రకటన ద్వారా తెలియజేస్తున్నాం. నువ్వు ఏమి చేస్తున్నావ్ జగన్‌రెడ్డి? తమరు ప్రకటించిన కోటి రూపా యలకే దిక్కు లేదు.. మళ్లీ కలెక్షన్ కింగ్‌లాగా కలెక్షన్లు మొదలు పెట్టావు. దీనిని బట్టి నువ్వు వరద సాయం పేరుతో ఇంకా మింగుతున్నావ్ అని అర్థమవుతుందన్నారు.
ఏమీ చేయని మీకు అడిగే హక్కు ఎక్కడిది?
నిత్యావసరాలు కాకుండా 139.75 కోట్లు ఖర్చు పెడితే దానికి తప్పుడు రాతలా..? రేషన్ సరుకులు కోసం రూ.63 కోట్లు ఖర్చు చేశాం. అన్ని కలిపి కూడా రూ.203.3 కోట్లు అయితే.. రూ.536 కోట్లు మింగేశారని రాతలు రాయించావు. మనం కొంత చేసి అడిగితే న్యాయం..వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వలేని మీకు అడిగే హక్కు ఎక్కడిది? ఊరికొక ప్యాలెస్ కట్టుకుని స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్న మీరు పేదవాడు కష్టాల్లో ఉంటే ఒక రూపాయి ఖర్చు పెట్టలేరా? ఎన్టీఆర్ పేరుతో ఆయన బిడ్డలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నువ్వు నీ తండ్రి పేరు మీద ఒక్క రూపాయి అయినా ఖర్చు చేసి ఎలాంటి సేవ కార్యక్రమాలు చేసిన దాఖలాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. రోత పత్రిక పిచ్చ రాతలు.. జగన్ రెడ్డి ముఠా చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. 11 సీట్లు ఇచ్చినా బుద్ధి తెచ్చుకోని జగన్‌రెడ్డి.. ఇప్పటికైనా వరద బాధితుల కోసం ప్రకటించిన కోటి రూపాయలు అందజేసేలా చూడాలని డిమాండ్ చేశారు.