- వృద్ధులకు అన్యాయం చేసిన మోసగాడు జగన్
- ఇంటి వద్దకు తెచ్చి పెన్షన్ ఇవ్వకపోవడం వెనక వైసీపీ కుట్ర
- పెన్షన్లకు ఇవ్వాల్సిన డబ్బును సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టాడు
- 15 రోజుల్లో రూ.13వేల కోట్లు మళ్లించి ఖజానా ఖాళీ చేశాడు
- రాజకీయ లబ్ధి కోసం టీడీపీ పెన్షన్లు ఆపిందంటూ జగన్ నీచమైన ప్రచారం
- సచివాలయ ఉద్యోగుల ద్వారా ఒక్కరోజులోనే పెన్షన్ అందించే అవకాశం ఉన్నా ఇవ్వలేదు
- అధికారంలోకి వచ్చాక పింఛన్ రూ.4 వేలు చేస్తాం
- పార్టీ నేతలు, బూత్ స్థాయి కార్యకర్తలతో అధినేత టెలీకాన్ఫరెన్స్
అమరావతి (చైతన్యరథం): అవ్వాతాత అంటూనే జగన్ వృద్ధులనూ మోసం చేశాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 1వ తేదీన ఇంటి వద్దకు తెచ్చి పెన్షన్ ఇవ్వకపోవడం వెనక వైసీపీ కుట్ర ఉందన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత 15 రోజుల్లోనే జగన్‌రెడ్డి రూ.13 వేల కోట్లను కాంట్రాక్టర్లకు దోచి పెట్టారని మండిపడ్డారు. ఖజానా ఖాళీ చేసి పెన్షన్ ఇవ్వలేకపోయిన జగన్… ఆ నెపాన్ని తమపై, ఎన్నికల సంఘంపై నెడుతున్నాడని దుయ్యబట్టారు. పార్టీ నేతలు, బూత్‌స్థాయి కార్యకర్తల తో చంద్రబాబు సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహిం చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… పెన్షన్లపై ప్రభుత్వ అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు జగన్ నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. జగన్‌కు వచ్చే ఎన్నికల్లో తన ఓటమి ఖాయమని అర్థం అయిం ది… అందుకే ఫేక్ ప్రచారాలు, కుట్ర రాజకీయాల్లో వేగం పెంచాడు. వృద్ధులు, వికలాంగులకు మానవీయ కోణంలో పెన్షన్ ఇంటి వద్దనే ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాలంటీర్లను ప్రభుత్వం రాజకీయ ప్రయోజనా లకు వాడుతున్న కారణంగానే వారిని కేంద్ర ఎన్నికల సంఘం విధులకు దూరం పెట్టిందన్నారు.
ఒక్కరోజులోనే పెన్షన్ అందించే అవకాశం ఉన్నా..
వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయనీయకూడదని టీడీపీ ఎవరినీ కోరలేదు. టీడీపీ కోరినట్లు కేంద్ర ఎన్ని కల సంఘం కూడా చెప్పలేదు. 1.35 లక్షల మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు… వారితో ఒక్క రోజు లోనే ఇంటింటికీ వెళ్లి పెన్షన్ ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వమే కావాలని ఇవ్వటంలేదు. ప్రభుత్వ పథకా లకు ఇవ్వాల్సిన డబ్బులు..సొంత కాంట్రాక్టర్లకు జగన్ ఇచ్చుకున్నాడు. వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ ఇచ్చే ఆవకాశం ఉన్నా, ఇవ్వకుండా జగన్ తన రాజకీయ లబ్ధి కోసం నడి వేసవిలో వారిని వేధిస్తున్నాడు. గ్రామ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులతో ఎందుకు ఇంటింటికీ పెన్షన్ ఇవ్వలేకపోతున్నారు.? ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ విషయంలో వైసీపీ ప్రభుత్వ కుట్రలు, వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి. తన రాజకీయ లబ్ధి కోసం బాబాయినే చంపేసిన జగన్‌కు…ఓట్ల కోసం ఇలాంటి కుట్రలు చాలా మామూలు విషయమే.
మనం వచ్చాక రూ.4వేల పెన్షన్ ఇంటికే తెచ్చి ఇస్తాం… రెండు మూడు నెలలు తీసుకోకపోయినా అన్నీ కలిపి ఇస్తాం. ఈ విషయాలన్నీ లబ్ధిదారులకు వివరించండి. ప్రభుత్వం గత 15 రోజుల్లో ఎవరెవరికి ఎంతెంత బిల్లులు చెల్లించిందో ప్రకటించాలి. మే 13 తరువాత ఇంటికి పోయే ప్రభుత్వం ఖజానాలో ఉన్న డబ్బునంతా సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టి…పేదలకు ఇచ్చే డబ్బుల విషయంలో మాత్రం నాటకాలు అడుతోంది. ఇంటింటికీ పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలి…ఎన్నికల సంఘం కూడా ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి. జిల్లా నేతలు..కలెక్టర్లను, మండల నేతలు.. తహశీల్దార్ల ను కలిసి ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పాలి. వాలంటీర్ల విషయంలో మనం స్పష్టంగా ఉన్నాం…వైసీపీకోసం పనిచేయకండి…మీ భవిష్యత్ ను చూసుకునే బాధ్యత మాది. వాలంటీర్లు ఎన్నికల వేళ తప్పులుచేస్తే వారిపైనా కేసులుపడే అవకాశం ఉంది… వాళ్లూ అప్రమత్తంగా ఉండాలి.జగన్ రాజకీయ క్రీడలో వాలంటీర్ల జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నాడని చంద్రబాబు దుయ్యబట్టారు.