- వచ్చే ఐదేళ్లలో సాంకేతికలో విప్లవాత్మక మార్పులు
- సదస్సుతో తయారీదారుల్లో పెరిగిన విశ్వాసం
- పెట్టుబడులపరంగా సవాళ్లునా స్టార్టప్‌లతో భరోసా
- అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో వక్తల అభిప్రాయాలు
- విజయవంతంగా ముగిసిన రెండురోజుల సదస్సు
- రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారుల అభినందనలు
మంగళగిరి(చైతన్యరథం): డ్రోన్ టెక్నాలజీ రంగంలో దేశానికి దశ దిశను నిర్దేశించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతకు అనుగుణంగా రాష్ట్రాన్ని దేశ డ్రోన్ రాజధానిగా మార్చాలనే ఆయన ఆకాంక్షకు అనుగుణంగా మంగళగిరి సీకే కన్వెన్షన్స్‌లో రెండురోజుల పాటు నిర్వహించిన అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 బుధవారంతో విజయవంతంగా ముగిసింది. డ్రోన్ టెక్ నవ ఆవిష్కరణలకు ఈ సదస్సు గొప్ప ముందడుగు అని, వచ్చే ఐదేళ్లలో ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని సదస్సులో పాల్గొన్న పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. సదస్సుతో డ్రోన్ల తయారీదారుల్లో విశ్వా సం పెరిగిందని.. ఈ ఊపుతో పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ), వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగం తదితరాల్లో గణనీయ అభివృద్ధి సాధ్యపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యువ భారత్‌లో మేధస్సుకు కొదవలేదు.. అయితే పెట్టుబడుల పరంగా సవాళ్లు ఉన్నాయని చెబుతూనే వాటిని ఎదుర్కొనేలా స్టార్టప్‌లను ప్రోత్సహించేలా ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయన్న భరోసా ఈ సదస్సు ద్వారా లభించిందని వెల్లడిరచారు.
పెట్టుబడులపరంగా సవాళ్లపై మేధోమథనం
రెండోరోజు బుధవారం డ్రోన్ రంగ నిపుణులు, ప్రభుత్వ అధికారులతో కూడిన ప్యానళ్లు విస్తృతంగా చర్చించాయి. ఐఐటీ మద్రాస్ డిఫెన్స్ డ్రోన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ హెచ్.ఎస్. ఎన్.మూర్తి ఆధ్వర్యంలో వార్ఫేర్ విత్ ఇండీజినస్ డ్రోన్ అండ్ యాంటీ డ్రోన్ టెక్నాలజీ స్, అదేవిధంగా హంచ్ మొబిలిటీకి చెందిన అమిత్ దత్తా నేతృత్వంలో భారతీయ డ్రోన్ రంగంలో పెట్టుబడుల పరంగా ఉన్న సవాళ్లపై చర్చ జరిగింది. రెడ్వింగ్ ల్యాబ్స్ కో ఫౌండర్ అన్షుల్ శర్మ ఆధ్వర్యంలో ఆరోగ్య రంగంలో ఏరియల్ మెడికల్ సపోర్ట్, డ్రోన్ అంబులెన్సు లు తదితరాలపై చర్చ జరిగింది. రాష్ట్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జె.నివాస్, ఏపీఎం ఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ జి.లక్ష్మీషా చర్చల్లో పాల్గొన్నారు. డ్రోన్ టెక్నాలజీస్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరవేయడంలో, డ్రోన్ సాంకేతిక అభివృద్ధికి ప్రభుత్వం తీసు కుంటున్న చర్యలను వివరించారు. స్టార్టప్‌లకు ఫండిరగ్కు సంబంధించి అమలవుతున్న విధానాలను వివరించారు.
డ్రోన్ల వినియోగంపై కీలక ప్రసంగం
మారుమూల గ్రామా, గిరిజన ప్రాంతాల ప్రజలకు సైతం నాణ్యమైన వైద్యసేవలు అందిం చడంలో డ్రోన్ సాంకేతిక అనుసంధాన సాధ్యాసాధ్యాలపైనా చర్చించారు. డిజిటల్ భూ రికార్డుల రూపకల్పనలో డ్రోన్ల వినియోగంపై ప్రకాశం జిల్లా జేసీ రోణంకి గోపాలకృష్ణ కీలక ప్రసంగం చేశారు. డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ స్మిత్ షా నేతృత్వంలో డ్రోన్ రంగానికి అవసరమైన నైపుణ్యవంతులైన మానవ వనరుల అభివృద్ధిపై చర్చ జరిగిం ది. ఏపీ డ్రోన్ కార్పొరేషన్ చైర్మన్, ఎండీ కె.దినేష్‌కుమార్ ఇటీవల విజయవాడ వరదల సమయంలో డ్రోన్ల వినియోగం విజయవంతం కావడంపై కీలక పీపీటీని ప్రజెంట్ చేశారు. విపత్తుల నిర్వహణలో డ్రోన్ సాంకేతికతపై దార్శనికతను ఆవిష్కరించారు. వరద మ్యాపింగ్, పర్యవేక్షణ, ముంపు నష్టాల సత్వర అంచనా, ఆహారం, ఇతర సామగ్రి సరఫరా, పారిశుధ్య కార్యకలాపాల్లో డ్రోన్లను వినియోగించిన తీరును వివరించారు. 437 డ్రోన్లు, 846 మంది సిబ్బంది, 4,073 ట్రిప్పుల ద్వారా ప్రజలకు అందించిన సేవలను వివరించారు. ముఖ్యమం త్రి మార్గనిర్దేశనంతో అమరావతి డ్రోన్ సదస్సు-2024ను విజయవంతం కావడంలో భాగస్వాములైన ప్రతిఒక్కరికీ రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.దినేష్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కార్యక్రమంలో భాగస్వాము లైన వారిని ఘనంగా సత్కరించారు.