- చివరిఘడియల్లో బరితెగిస్తున్న వైసీపీ డ్రగ్స్ మాఫియా
- బద్దలవుతున్న జగన్ గ్యాంగ్ పాపాల పుట్టలు
- విశాఖను డ్రగ్స్ క్యాపిటల్‌గా మార్చిన జగన్
- విశాఖలో భారీగా డ్రగ్స్ స్వాధీనంపై స్పందించిన యువనేత లోకేష్
అమరావతి(చైతన్యరథం):విశాఖతీరంలో భారీ గా డ్రగ్స్ పట్టుబడటంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జగన్ ముఠా పాపాల పుట్ట ఒక్కొక్కటిగా బద్దలవుతోందన్నారు. ఇక ఎలాగూ అధికారంలోకి రావడం అసాధ్యమని తేలిపోవడం తో ఆఖరి ఘడియల్లో వైసీపీ చీకటి మాఫియాలు జాక్పాట్లు కొట్టే పనిలో నిమగ్నమయ్యాయని ధ్వజమెత్తారు. విశాఖ తీరంలో బ్రెజిల్ నుంచి తరలిస్తున్న 25వేల కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయన్న వార్త తనను కలవరానికి గురిచేసిందన్నారు. విశా ఖలోని ఓ ప్రైవేట్ కంపెనీ పేరుతో ఈ డ్రగ్స్ దిగు మతి చేసుకున్నారంటే జె-గ్యాంగ్ ఎంత బరితెగి స్తోందో అర్థంచేసుకోవచ్చు అన్నారు.ఈభారీ డ్రగ్స్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్ నూటికి నూరుపాళ్లు తాడేపల్లి ప్యాలెస్.
గతంలో కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి బినామీకి చెందిన ఓడబ్బా కంపెనీ (ఆషీ ట్రేడిరగ్ కంపెనీ, విజయవాడ) పేరుతో వచ్చిన రూ.21వేలకోట్ల విలువైన డ్రగ్స్‌ను ముం ద్రా పోర్టులో స్వాధీనం చేసుకోగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాడే పల్లి ప్యాలెస్ కనుసన్నల్లోనే డ్రగ్స్,గంజాయి మాఫి యాలు చెలరేగిపోతున్నాయని తెలుగుదేశం పార్టీ ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఈ చీక టి వ్యవహారాలను బయటపెట్టామన్న అక్కసుతోనే గతంలో వైసీపీ మూకలు టీడీపీ కేంద్ర కార్యాల యంపై కూడా దాడికితెగబడ్డాయి. విశాఖను రాజ ధాని చేయడం దేవుడెరుగు… డ్రగ్స్ క్యాపిటల్‌గా మార్చావు కదా జగన్ అని లోకేష్ దుయ్యబట్టారు.
రెండేళ్ల కిందటే చెప్పా:
బ్రెజిల్లో వైసీపీ నేతల చీకటివ్యాపారాలు గురించి తాను రెండేళ్ల కిందటే చెప్పానని లోకేష్ అన్నారు. ఇప్పుడు అదేనిజమయిందన్నారు. ఆప్పుడు తాను మాట్లాడిన వీడియోను లోకేష్ విడుదల చేశారు.