- 25వేల కిలోల నిషిద్ధ మాదకద్రవ్యాలు పట్టివేత
- బ్రెజిల్ నుంచి జర్మనీ మీదుగా భారత్ వచ్చిన కంటైనర్
- సీబీఐకి సమాచారం అందించిన ఇంటర్ పోల్
విశాఖపట్టణం: విశాఖపట్నం తీరంలో డ్రగ్స్ కలకలం రేగింది. విశాఖపట్టణం షిప్పింగ్ యార్డ్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 25 వేల కిలోల డ్రగ్స్‌ను కస్టమ్స్, సీబీఐ అధికారులు కలిసి సీజ్ చేశారు. వారి నుంచి వెయ్యి బ్యాగులను సీజ్ చేశారు. ఒక్కో బ్యాగుల్లో 25 కిలోల డ్రగ్స్ ఉన్నాయి. ఈ డ్రగ్స్ విలువ కొన్ని వేల కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ కంటైనర్ జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా ఈ నెల 16న విశాఖ వచ్చినట్టు గుర్తించారు. ఈ కంటైనర్ భారత్ చేరుకున్న నేపథ్యంలో, ఇంటర్ పోల్ నుంచి ఢల్లీి సీబీఐ కార్యాలయానికి సమాచారం అందింది. వెంటనే ఢల్లీి సీబీఐ కార్యాలయం.. విశాఖ సీబీఐ, కస్టమ్స్ అధికారుల ను అప్రమత్తం చేసింది. ఈ నెల 19న నార్కొటిక్స్ అధికారులతో వచ్చి కంటైనర్ ను పరీక్షించిన సీబీఐ… అందులో ఉన్నది నిషిద్ధ మాదకద్రవ్యాలు అని నిర్ధారించు కుంది. 25కిలోల చొప్పున వెయ్యి బ్యాగులు ఉన్న ట్టు గుర్తించారు. ఆపరేషన్ గరుడ పేరిట నిర్వహిం చిన స్పెషల్ ఆపరేషన్‌లో ఈ డ్రగ్స్ పట్టుకున్నారు. కాగా, ఈ డ్రగ్స్ ఓ ప్రైవేట్ ఆక్వా కంపెనీ పేరిట భారత్ కు వచ్చినట్టు సమాచారం అందుతోంది.