- వంచనకు మరోపేరు జగన్
- కష్టకాలంలో అండగా పవనన్న
- యువగళం స్ఫూర్తితోనే శంఖారావం
- ఇచ్ఛాపురం సభలో లోకేష్
ఇచ్ఛాపురం: జగన్‌రెడ్డి విధ్వంసపాలనకు చరమ గీతం పాడేందుకు పవనన్న కలసిరావడం అభినంద నీయమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అధికారంలోకి వచ్చాన ప్రతిఏటా డీఎస్జీ నోటిఫికేషన్ ఇచ్చి ఉపాధ్యాయ ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్నారు. కార్యకర్తల జయజయధ్వానాల నడుమ ఇచ్ఛాపురంలో శంఖారావానికి యువనేత నారా లోకేష్ ఆదివారం శ్రీకారం చుట్టారు. యువగళం స్పూర్తితోనే శంఖారావం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానన్నారు. జై చంద్రబాబు, జై లోకేష్ నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగింది.
శంఖారావం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్తరాంధ్ర నలుమూలలనుంచి ముఖ్య నేతలు తరలివచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాట నృత్యాలు, సాంప్రదాయ డ్యాన్సులతో ఇచ్చా పురం రాజావారి గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన సభా ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. శంఖా రావం సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఆధ్వర్యం లో విస్తృత ఏర్పాట్లు చేశారు. యువనేత లోకేష్‌ను చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన మహిళలు, యువకులు, అభిమానులు. భారీగా తరలివచ్చిన కార్య కర్తలతో ఇచ్చాపురంలో కోలాహలం నెలకొంది.
కార్య కర్తల నినాదాల హోరు నడుమ యువనేత లోకేష్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ శంఖారావంలో పాల్గొనేందు కు తరలివచ్చిన పసుపుసైనికులకు వందనాలు, కార్య క్రమానికి విచ్చేసిన ప్రతిఒక్కరికి, నా ధన్యవాదాలు తెలి పారు. ఇచ్ఛాపురం నుంచి శంఖారావం ప్రారంభంచ టం ఎంతోగర్వంగా ఉందన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే పరామర్శకు వస్తున్న పవన్ కల్యాణ్‌ను రాష్ట్రానికి రాకుండా అడ్డుకున్నారు. కష్టకాలంలో నాకు అండగా నిలబడిన వ్యక్తి పవన్‌కల్యాణ్. జగన్‌రెడ్డి విధ్వంసపాల నకు చరమగీతం పాడేందుకు పవనన్న కలసిరావడం అభినందనీయం. టీడీపీ-జనసేన మధ్య చిచ్చుపెట్టేం దుకు వైకాపా పేటీిఎం బ్యాచ్ ప్రయత్నిస్తారు, ఇరు పార్టీల కేడర్ అప్రమత్తంగా ఉండి వారి కుట్రలను తిప్పికొట్టాలని లోకేష్ పిలుపు ఇచ్చారు.
ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ జగన్ రెడ్డి కొత్త నాటకం మొదలుపెట్టారు.4 నెలల 10 నెలలు ఏం చేశారు? మోసానికి, వంచనకు, దగాకు ప్యాంట్ వేస్తే అది జగన్‌రెడ్డి. 23 వేల డీఎస్సీ పోస్ట్‌లు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి మోసంచేశారు. నేడు ఉపాధ్యాయ ఖాళీలను తగ్గించారు. యువతలో నిరసన గళం మొదలు కావడంతో కుప్పిగంతులు వేస్తున్నారు. వచ్చే టీడీపీ పాలనలో ప్రతి ఏడాది డీఎస్సీ ప్రకటించి ఖాళీలు భర్తీ చేస్తాం. జగన్ రెడ్డి ఏపీకి పట్టిన క్యాన్సర్ గడ్డ, సైకో సీఎంను పెట్టెలో పెట్టి తాళం వేద్దాం. రెడ్ బుక్ పేరు వింటే వైసీపీ సైకోలంతా భయపడుతున్నా రు.
ఉత్తరాంధ్ర నాకు అమ్మ లాంటింది. ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్‌రెడ్డి. మూడు రాజధానులు అని విశా ఖలో ఒక్క ఇటుకైనా వేశాడా? విశాఖలో ప్రజాధనం లూటీ చేసి రూ.500కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడు తప్పితే ఏం చేయలేదు. విశాఖ రైల్వే జోన్ కు కనీసం భూమి కూడా ఇవ్వలేదు. మూతపడిన చక్కెర కర్మా గారాలను తెరిపిస్తామని చెప్పి మాటతప్పారు. విశాఖ ఉక్కు భూములనుకాజేసేందుకు కుట్రపన్నారు. పెండిర గ్ ప్రాజెక్టులుపూర్తిచేస్తామని చెప్పి రైతులను వంచిం చారు. ఉత్తరాంధ్ర అంటేనే తెలుగుదేశం పార్టీ కంచు కోట,పౌరుషాలకు, పోరాటాలకు పురిటిగడ్డ శ్రీకాకుళం జిల్లా. జగన్‌రెడ్డి ఉత్తరాంధ్రను గంజాయి కేంద్రంగా మార్చారని లోకేష్ దుయ్యబట్టారు.
ఇచ్ఛాపురం టీడీపీ అడ్డా
ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. వంశధార, నాగావళి అనుసంధానానికి కృషిచేశాం. ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు ఎన్టీఆర్ సుజల ద్వారా మినరల్‌వాటర్ ప్లాంట్లు ఏర్పాటుచేశాం. ఉద్దా నంలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటుచేశాం. హుద్ హుద్, తిత్లీ తుఫాన్ల సమయంలో చంద్రబాబు వేగంగా స్పందించారు. మండలానికి ఓ మంత్రిని బాధ్యుడిగా నియమించి ప్రజలను ఆదుకున్న వ్యక్తి చంద్రబాబు. ఇచ్ఛాపురం అంటే తెలుగుదేశం పార్టీ అడ్డా. ఒక్కసారి మాత్రమే ఇక్కడ టీడీపీ ఓడిపోయింది. టీడీపీ పాలనలో రూ.1500 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం.
గత ఐదేళ్లలో జగన్‌రెడ్డి ఇచ్చాపురం నియోజక వర్గానికి చేసింది ఏమీ లేదు. కోకోనట్ పార్క్ ఏర్పాటు చేస్తానని మోసం చేశారు. మహేంద్ర తనయ, బహుద నది ఆధునీకరణ పనులు చేపట్టలేదు. టీడీపీ అధికారం లోకి వస్తే పెండిరగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తాం. జీడిపిక్క రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం, పరిశ్రమలను కూడా ఆదుకుంటాం. కొబ్బరి రైతులు, మత్స్యకారులను ఆదుకుంటాం. రెండు నెలలు ఓపికపడితే జగన్ ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పునఃప్రారంభిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
ప్రతి గడప తొక్కాలి
టీడీపీకి కార్యకర్తలే బలం. ఎంతోమంది నాయకుల ను మంత్రులు, ఉపముఖ్యమంత్రులను చేసిన పార్టీ మనది. అన్న ఎన్టీఆర్ ఆవిష్కరించిన పసుపు జెండాను చూస్తే అందరికీ ఉత్సాహం వస్తుంది. ప్రజలకు అన్న ఎన్టీఆర్ దేవుడు, చంద్రబాబురాముడు, వైకాపా నాయ కులకు ఈ లోకేష్ మూర్ఖుడు. అధికారంలోకి వచ్చాక వైసీపీ సైకోలకు వడ్డీతో సహా చెల్లిస్తాం. పార్టీ పటిష్టత కోసం పనిచేసిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తాం. శంఖారావం ద్వారా మళ్లీ మనం ప్రతిగడప తొక్కాలి. బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాలను ప్రతిఇం టికీ తీసుకెళ్లాలి. కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముం దుకు తీసుకెళ్లిన వెళ్లిన వారికి పనితీరు ఆధారంగా పదవులు ఇస్తాం. క్లస్టర్, యూనిట్, బూత్ బాధ్యులకు కిట్లు ఇస్తున్నాం. ఇందులో ఉన్న క్యాలెండర్‌లో మేని ఫెస్టో అంశాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై ఉందని లోకేష్ అన్నారు.