అనంతపురం : సీఎం జగన్ నిర్ణయాలతో విద్యుత్ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. అన్నిరాష్ట్రాలు తిరస్కరించిన సెకీ టెండర్లను ఎపి మాత్రమే ఖరారు చేసిందన్నారు. ఎపిలో అందుబాటులో ఉన్న విండ్ ఎనర్జీని నిలిపివేసి, ప్రైవేట్ సంస్థల దగ్గర అధిక రేటుకు విద్యుత్ కొన్నారని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. జగన్ తప్పుడు నిర్ణయంతో ప్రజలు అధిక బిల్లులు చెల్లించాల్సి వచ్చిందన్నారు. జగన్ సన్నిహితులకు పంప్డ్ స్టోరేజ్ విధానంలో ఆస్తులు కట్టబెట్టారన్నారు. కేంద్రం ఆదేశాలకు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా పంప్డ్ స్టోరేజ్ ఒప్పందాలు, కేటాయింపులున్నాయన్నారు.