- తెదేపా`జనసేన కూటమి అంటే అంత భయమెందుకు జగన్‌రెడ్డి?
- రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్‌పై దాడులెందుకు?
- చిరంజీవికి అవమానం జరిగినప్పుడు వైసీపీ కాపు నాయకులు ఏమైనారు?
- సామాజిక న్యాయమంటే జగన్‌రెడ్డి కుల పెత్తనమా?
- ముఖ్యమంత్రిని నిలదీసిన తెదేపా నేత వీరంకి గురుమూర్తి
అమరావతి, చైతన్యరథం: తెలుగుదేశం ` జనసేన పొత్తు సూపర్ లాంచ్‌తో తన ఓటమి తథ్యమని గ్రహిం చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వివిధకులాల మధ్య చిచ్చు పెట్టే నీచ స్థాయికి దిగజారారని టీడీపీ సీనియర్ నేత వీరంకి గురుమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పన్నాగాలు, కుట్రల పట్ల అప్రమత్తతతో ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. సోమవారం నాడు తెదేపా కేంద్ర కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో జగన్‌రెడ్డిలో నెలకొన్న నైరాశ్యం, తత్పరి ణామాలను ఆయన వివరించారు.
గత శనివారం నాడు తెదేపా, జనసేన పార్టీలు ఒకే విడతలో భారీగా 99 మంది అభ్యర్ధుల జాబితాను విడు దల చేయడంతో రెండు పార్టీలతోపాటు, రాష్ట్రవ్యాప్తం గా పూర్తి సానుకూల వాతావరణం వెల్లడికావడంతో ముఖ్యమంత్రికి నిద్రకరువై.. దుర్మార్గపు ఆలోచనలకు తెరతీశారని గురుమ్మూర్తి అన్నారు. అన్నివర్గాల ప్రజలు తెదేపా`జనసేన పొత్తును మనస్ఫూర్తిగా ఆహ్వానించ డంతో జగన్‌రెడ్డి మైండ్ బ్లాక్ అయ్యిందని, అట్టి వాతా వరణాన్ని చెడగొట్టే దురుద్ధేశ్యంతో ముఖ్యమంత్రి వివిధ కులాల మధ్య విబేధాలు సృష్టించడానికి పాల్పడుతున్నా రని ఆయన ఆరోపించారు.
రాష్ట్ర భవిత కోసం, ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షల మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుకు సిద్ధమైతే ఆయనపై అవాకులు,చవాకులు మాట్లాడుతూ జగన్ బృందం పొత్తు విజయానికి అడ్డంకులు సృష్టిం చాలని ఆరాటపడుతున్నారని, ఈ కుటిల ప్రయత్నాలు తప్పక విఫలమౌతాయని గురుమూర్తి స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్‌కు అన్ని వర్గాల ప్రజల్లో మద్దతు దారులు ఉన్నప్పటికీ, ఆయనకు కులాన్ని ఆపాదించి కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇది సహేతుకం కాదని ఆయన హెచ్చరించారు. పొత్తుతో పవన్ కళ్యాణ్ కు, కాపులకు అన్యాయం జరిగిందని కపట ప్రేమ ఒలికిస్తున్న వైసీపీ నాయకులు పేర్ని నాని, అంబటి రాంబాబు వంటి వారు.. కాపులకు చంద్రబాబు ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్‌ను ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రద్దు చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అగ్ర నటుడు చిరంజీవిని ఒక సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి ఎదుట చేతులు కట్టుకొని నిలబడేలా చేసి నప్పుడు ఈనాయకుల నోళ్లు ఎందుకు మూతపడ్డాయ ని గురుమూర్తి ధ్వజమెత్తారు.
విన్నింగ్ టీమ్`కన్నింగ్ టీమ్
తెదేపా`జనసేన కూటమి విన్నింగ్ టీమ్ అని, జగన్‌రెడ్డి బృందం కన్నింగ్ టీమ్ అని గురుమూర్తి స్పష్టం చేశారు. వైనాట్ 175అంటూ పదే పదే డాంబి కాలు పలికే ముఖ్యమంత్రి ఈ కూటమి అంటే ఎందుకు అంతలా భయపడుతున్నారని ఆయన నిలదీశారు. శాండ్, ల్యాండ్, మైన్, వైన్‌లకు సంబంధించిన నిరం తర అక్రమాలు, దోపిడీ ప్రత్యక్షంగా చూసిన రాష్ట్ర ప్రజ లు జగన్ పాలన అంటే భయపడుతున్నారని, ఆయన్ను మార్చాలనే నిర్ణయానికి ఇప్పటికే వచ్చారని గురుమూర్తి వివరించారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో చెప్పలేని స్థాయిలో ఉన్నారని వైసీపీ వారు మాట్లాడుతున్నారని, ఇంతవరకు జగన్‌రెడ్డి ఎక్కడినుంచి పోటీ చేస్తారో చెప్ప లేని స్థితిలో ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.
కానరాని సామాజిక న్యాయం
పదే పదే సామాజిక న్యాయం గురించి మాట్లాడే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తన పాలనంతా రెడ్లమయంగా చేశారని, బడుగు బలహీన వర్గాలకు అధికారంలో ఏ మాత్రం స్థానం లేకుండా చేశారని, రాష్ట్రాన్ని మొత్తం తన కులానికి చెందిన ఐదుగురి చేతుల్లో పెట్టింది వాస్త వం కాదా అని గురుమూర్తి ప్రశ్నించారు. సలహాదారు లు, ఇతర ఉన్నత నియమాకాల్లో అంతా ఒక వర్గం వారినే పెట్టుకొని, దళితులపై నిరంతర దాడులు జరు గుతున్నా ఒక్కసారైనా ఖండిరచకపోవడం,కోడికత్తి కేసు లో కోర్టులో హాజరుకాకుండా ఒక దళిత యువకుణ్ని ఐదు సంవత్సరాలు జైల్లో ఉండేలా చేయడం, రాయల సీమ మరియు నెల్లూరు,ప్రకాశం జిల్లాల్లోని 74 శాసన సభ స్థానాల్లో ఒక్కటి కూడా బలిజలకు ఇవ్వకపోవడం, రాజంపేట లోక్‌సభ స్థానాన్ని మిధున్‌రెడ్డికి ఇవ్వడం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కులపిచ్చికి తార్కాణమని గురుమూర్తి ధ్వజమెత్తారు.