అమరావతి,చైతన్యరథం: హత్యాయత్నం కేసులో గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర సహా ఇతరులకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురానికి చెందిన కొందరు రైతులు అక్కడ సంగం డెయిరీ ఆధ్వర్యంలోని పాల కేంద్రానికి పాలు సరఫరా చేశారు. దాని బకాయిలు అడిగేందుకు వారు ఇటీవల చేబ్రోలు మండలం వడ్లమూడిలోని డెయిరీ వద్దకు రాగా ఘర్షణ జరిగిందని, బాధితుల్లో ఒకరైన రాము ఫిర్యాదు మేరకు 15 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చేబ్రోలు సీఐ తెలిపారు. ఈకేసులో 14వ నిందితుడిగా ధూళిపాళ్ల నరేంద్రకుమార్, 15వ నిందితుడిగా జానకిరామయ్య పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. విచారణ చేపట్టిన హైకోర్టు ధూళిపాళ్ల నరేంద్ర సహా ఇతరులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
సంగం డెయిరీ వద్ద పోలీసుల మోహరింపు… అడ్డుకున్న సిబ్బంది, కార్యకర్తలు
వడ్లమూడిలోని సంగం డెయిరీ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రపై హత్యయత్నం కేసులో అరెస్టుకు పోలీసులు యత్నించారు. అక్రమకేసులో ధూళిపాళ్లపై హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం విచారణ ఉండడంతో ముందుగానే చర్యలకు ప్రభుత్వం యత్నించింది. ఆ ప్రాంతంలో పోలీసులు ఆంక్షలు అమలు చేశారు. డెయిరీ లోపలకు వెళ్లేందుకు పోలీసులు యత్నించగా.. అనుమతి లేకుండా వెళ్లనీయబోమంటూ డెయిరీ సిబ్బంది పోలీసులను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెల కొంది. ఈనెల 15న ఏలూరు జిల్లాకు చెం దిన రామ్మోహన్ అనే వ్యక్తి తనపై సంగం డెయిరీ సిబ్బంది దాడి చేశారం టూ చేబ్రోలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు 14 మందిపై హత్యాయత్నం కేసు నమో దు చేశారు. అందులో సంగం డెయిరీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పేరు చేర్చ డంతో రాజకీయ వివాదానికి దారితీసింది. అయితే పోలీసు లు తనపై తప్పుడు కేసు నమోదు చేశారంటూ ధూళి పాళ్ల ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం పిల్ దాఖలు చేశారు.