- హత్యలు చేయించి నిస్సిగ్గుగా అబద్ధాలు
- సునీతకు న్యాయం చేయకపోగా వేధిస్తావా?
- మద్యంపై మాటతప్పిన జగన్‌కు ఓటడిగే హక్కుందా?
- ఓటు వేసేటప్పుడు జగన్ బాదుడు జనానికి గుర్తుండాలి
- బహిరంగ సభలో పలువురు వైసీపీ నేతల చేరిక
వింజమూరు/ఉదయగిరి (చైతన్యరథం): తడిగుడ్డతో గొంతుకోసే ప్రభుత్వమేదో.. ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వమేదో ప్రజలు ఆలోచించుకోవాలని టీడీపీ అధి నేత చంద్రబాబు అన్నారు. హత్యలు చేయించి నిస్సిగ్గు గా అబద్ధాలు చెప్పే సీఎం ఉండటం రాష్ట్రం ప్రజలు దౌర్భాగ్యమన్నారు. ఒక దోపిడీదారుడు, విధ్వంసకా రుడు, అహంభావి రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే కాపాడు కునేందుకు అందరూ ఒకటికావాలని పిలుపు ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు లో శుక్రవారం రాత్రి జరిగిన ప్రజాగళం సభలో చంద్ర బాబు మాట్లాడుతూ జగన్ ఐదేళ్లు పాలించి రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడన్నారు. అసమర్థ, అరాచక పాలనలో అందరి బతుకులు అంధకారం అయ్యాయన్నారు. వింజమూరు సభ దద్దరిల్లిందన్నారు. ఉదయగిరిలో సైకిల్ దూసుకుపోతోంది. ఎవరన్నా అడ్డం వస్తే తొక్కు కుంటూ వెళ్లిపోండి. ప్రజల్ని చైతన్యం చేయడం కోసం మీ అందరిలో ఉండే ఆవేదన, బాధ అర్థం చేసుకుని కార్యోన్ముఖులను చేయడం కోసమే నేనువచ్చాను. వచ్చే ఎన్నికలు రాష్ట్ర దశ..దిశను మార్చబోతున్నాయి. ఫ్యాన్ ను తుక్కు, తుక్కు చేసి పడేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఇక 45 రోజులే..
బాదుడుకు గురైన ఆడబిడ్డల్లో తిరుగుబాటు కనిపి స్తోంది. తడిగుడ్డతో గొంతు కోసే ప్రభుత్వమేదో.. మీ కోసం ఆలోచించే ప్రభుత్వమేదో ఆలోచించాలి. ఐదేళ్ల జగన్ నరకానికి, సంక్షేమానికి ముగింపు పలికే రోజు మే 13. ఇక 45రోజులు మాత్రమేఉంది.టీడీపీ, జన సే, బీజేపీ ఆలోచన ఒక్కటే… వైసీపీ ఇంటికి పోవాలి… యువతకు ఉద్యోగాలు రావాలి. ఓటింగ్‌కు వెళ్లినప్పుడు పెరిగిన విద్యుత్ ఛార్జీలు గుర్తుకు రావాలి. ఈ ఐదేళ్లలో మీకు మంచి జరిగితే నేనేం మాట్లాడను..నష్టం జరిగితే చర్చించి జగన్‌ను ఇంటికి పంపడానికి కంకణం కట్టుకోవాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
ఓటడిగే హక్కుందా?
రూ.60 ఉన్న క్వార్టర్ ధర ఇప్పుడు రూ.200 అయింది. మిగతా రూ.140 ఎక్కడిపోతోంది.? జగన్ జేబులోకి వెళ్తోంది. ఈ మద్యం తాగితే ఆరోగ్యం నాశ నం అవుతుంది.. జేబులన్నీ గుల్ల్లవుతాయి. నాసిరకం మద్యం అమ్ముతూ రేట్లు ఎందుకు పెంచారో చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా? ఎన్నికల ముందు మద్య నిషే ధం చేశాకే ఓట్లు అడుగుతా అన్నాడు…చేయలేదు. మరి ఓటుఅడిగే హక్కు ఉందా? పైపెచ్చు మద్యం ఆదా యాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడు. క్వార్టర్ బాటి ల్ చూస్తే గుర్తుకువచ్చేది జగన్‌రెడ్డి దోపిడీ. 60 రూపా యలు ఉన్న క్వార్టర్ బాటిల్ రూ.200 అయింది. రూ.140 తాడేపల్లి కొంపకు పోతున్నాయి. జనం రక్తం తాగే జలగ జగన్‌రెడ్డి. ప్రజల ఆరోగ్యం పాడుచేశారు. రాష్ట్రాన్ని గంజాయిమయం చేశారు. వింజమూరులో కూడా గంజాయి ఉంది.గంజాయిలేని ప్రాంతమే లేదు. విశాఖ పోర్టు ద్వారా డ్రగ్స్ దిగుమతి చేశారు… యువ తను సర్వనాశనం చేయడానికి 25వేల కేజీల డ్రగ్స్ తెచ్చారు. మత్తుకు ఒకసారి అలవాటు పడితే ఆ తరు వాత ఇక మన చేతుల్లో ఉండదు. ఈ మత్తులో యువత భవిష్యత్ నాశనం అవుతోంది. జగన్‌రెడ్డి ధనదాహమే దీనంతటికీ కారణమని చంద్రబాబు ధ్వజమెత్తారు.
సునీతకు జవాబు చెప్పాలి
వివేకా కూతురు సునీతారెడ్డికి జరిగిన అన్యాయం చూశారా? ఐదేళ్ల క్రితం వివేకాను గొడ్డలితో చంపి సానుభూతి తెచ్చుకుని గెలిచారు.. కోడికత్తి డ్రామాలా డాడు. నీ బతుకు భయంకరంగా ఉంటుంది జగన్… ఎల్లప్పుడూ జనాన్ని మోసం చేయలేవు. తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతుంటే ఆమెపైనే కేసు లు పెడుతున్నారు. చంపిన వ్యక్తే ఎవరు చంపించారో చెప్పాడు…హంతకుడిని పక్కన పెట్టుకుని ఓటేయాలని అడగటానికి మనసెలా ఒప్పిందని జగన్‌ను సునీత సూటిగా అడిగింది. దానికి జవాబు చెప్పకుండా జగన్ చెల్లెళ్లను నేను మ్యానేజ్ చేశానని తప్పించుకుంటున్నా డు. బాబాయిని ఎవరు చంపారో చెప్పి జగన్ ఓట్లు అడగాలి. వివేకాను ఎవరుచంపారో అందరికీ తెలుసు. హత్య చేయించిన వారిని అరెస్టు చేయడానికి సీబీఐ వస్తే అడ్డుకున్నారు. ఎదుటి వారిపై విమర్శలు చేసి బత కాలని చూస్తున్నారు.జగన్ కొత్తగా కలియుగం అంటూ ఏవేవో కబుర్లు చెబుతున్నాడు. గొడ్డలితో నరికిన వాడిని కాపాడి… బాధితులపై నేరం మోపుతున్నావు చూడు అదే కలియుగం. చెల్లికి న్యాయం చేయకపోగా వేధిస్తు న్నావు చూడు అది కలియుగం. హత్య చేసిన వారిని అరెస్టు చేయడానికి వచ్చిన సీబీఐపై కేసు పెడితే కోర్టు కు వెళ్లి స్టే తెచ్చుకున్నారు చూడు అది కలియుగం. హత్యలు చేసి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పేవాళ్లు సీఎంగా ఉండటమే కలియుగం. ఆయనకు ఎవరూ లేరంట.. పేపరు, టీవీ లేవు అంట. ఒంటరి వాడంట..అందరూ కలిసి దాడి చేస్తున్నారంట. నువ్వు చేసిన పాపానికి, చేస్తున్న దాడికి అందరూ ఒకటయ్యారు జగన్. ఇంట్లో దొంగపడితే ఏం చేస్తాం.. అందరూ కలిసి కర్రతీసుకు ని దొంగను తరుముతారు. ఇక్కడ కులం,మతం చూసు కుంటారా అని చంద్రబాబు ప్రశ్నించారు.
అందరూ జగన్ బాధితులే
ఉదయగిరి నుండి బయటకు వెళ్లిన వారు బాగు పడ్డారు. ఇక్కడున్న వాళ్లు బాధపడుతున్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ బాధితులే. కార్మికులకు ఉపాధి కల్పించే చిన్న కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించక పోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాంట్రాక్టర్లకు లక్ష కోట్లు బకాయిలు పెట్టారు. సాక్షి పత్రికకు మాత్రం ప్రక టనలకు కోట్లలో డబ్బులు ఇస్తున్నారు. అప్పుల బాధతో 43మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకుని చనిపో యారు. మీ జీవితాల్లో వెలుగులు నింపాలని టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయి. కేంద్రంలో ఉండే ప్రభుత్వం తో కలిసిపని వస్తే నిధులు వస్తాయి. పనులకు అను మతులు వస్తాయి. ప్రజలకోసమే పొత్తు…వైసీపీని చిత్తు చేయడం కోసం నిండు మనసుతో దీవించాలి. రాష్ట్రం విడిపోయాక పోలవరం, అమరావతి కోసం పని చేస్తే వాటిని విధ్వంసం చేశాడు జగన్. జనం చిన్న పనికి కూడా పక్కరాష్ట్రాలకు వెళ్తున్నారు. పోలవరం పూర్తి చేస్తే గోదావరి నీళ్లతో నదుల అనుసంధానం జరిగి సీమకు, ఉదయగిరికి నీళ్లు వచ్చేవి… సస్యశ్యామలం అయ్యేది. అప్పులుచేసి బటన్ నొక్కుతున్నావ్.. ట్యాంకు లో నీళ్లు ఉంటేనే వస్తాయి… లేకుండా కుళాయి తిప్పితే బురద వస్తుంది…కాసేపు ఆగితే అది కూడా రాదని చంద్రబాబు దుయ్యబట్టారు.
ఫ్లోరైడ్ సమస్య పరిష్కరిస్తా
ఉదయగిరిలో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించేందుకు కుళాయి ద్వారా మంచినీళ్లు అందిస్తాం. కిడ్నీ బాధితు లను ఆదుకునేందుకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. తాగు,సాగు నీరు అందించేందుకు వెలుగొండ ప్రాజెక్టు, సోమశిల నార్త్ కెనాల్, పెద్దిరెడ్డి పల్లె రిజర్వాయర్ పను లు పూర్తి చేస్తాం. పాలిటెక్నిక్ కాలేజీ నిర్మాణం, షాదీ మంజిల్ అభివృద్ధికి, ఉదయగిరి కోట అభివృద్ధికి నిధు లు మంజూరు చేస్తాం. వింజమూరులో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు ఏర్పాటుచేస్తాం.ఉదయగిరికి పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు ఇస్తాం. మాకు ఓటేస్తే పెట్టుబడులు వస్తా యి.. మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి.. మీ పంట లకు గిట్టుబాటు ధర వస్తుంది… మీ పొలాలకు నీళ్లు వస్తాయి.. ఉపాధి దొరుకుతుంది..మీ గ్రామాలకు మం చి రోడ్లు వస్తాయి.. మహిళలకు భద్రత ఉంటుంది.. ఉద్యోగులకు ప్రతినెలా జీతాలు వస్తాయి… ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని చంద్రబాబు స్పష్టం చేశారు.
గతం కంటే మిన్నగా..
తోలుకొచ్చిన జనంతో రోజుకో మీటింగ్ పెడుతు న్నాడు జగన్… కానీ నేను నేరుగా మీ ముందుకే వస్తు న్నా. కేంద్రంలో 400 పైగా ఎంపీ సీట్లు వస్తే రాష్ట్రంలో 160కి పైగా అసెంబ్లీ సీట్లు వస్తాయి. ఉదయగిరి ఎమ్మె ల్యేగా సురేష్‌ను, నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర రెడ్డిని గెలిపించాలి. నన్ను ఎన్ని విధాలా బూతులు తిట్టి ఇబ్బంది పెట్టినా మీకోసం పనిచేస్తున్నా. రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అన్ని రాష్ట్రాలకంటే ముందు వరుసలో నిలబెడతాం. 14 ఏళ్లలో సీఎంగా ఉన్నప్పుడు ఎంత చేశానో…రాబోయే 5 ఏళ్లలో అంతకంటే మిన్నుగా పని చేసి చూపిస్తానని చంద్రబాబు ఉద్ఘాటించారు. ఈ సభ లో పలువురు వైసీపీ నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.
తెలుగుదేశం ఏ43 జిందాబాద్
42 వసంతాలు పూర్తి చేసుకొని 43వ పడిలోకి అడుగు పెట్టిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినో త్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు, శ్రేణులు, అభిమానులు, ప్రజలు శుక్రవారం నాడు ఘనంగా జరుపుకున్నారు. పార్టీని స్థాపించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయా లు, ఆలోచనలు, తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన అపూర్వ విజయం, అనంతర సుదీర్ఘ ప్రయా ణం, తెదేపా ప్రభుత్వాలు చేపట్టిన పలు విప్లవాత్మక చర్యలు, పార్టీ తీసుకొచ్చిన సామాజిక, రాజకీయ మార్పులను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా బనగానపల్లి ‘ప్రజాగళం’ సభలో ఎన్టీఆర్‌కు పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఘన నివాళులు అర్పించారు. పార్టీ ఏర్పాటుతో తెలుగు జాతి చరత్రలో ‘తెలుగు దేశానికి ముందు ` తెలుగుదేశం పార్టీ తరువాత’ అన్న రెండు యుగాలు అవతరించాయని ఆయన అన్నారు. పేదలందరికీ కూడు, గుడ్డ, ఇల్లు ఉండా లన్న లక్ష్యంతో స్వర్గీయ ఎన్టీఆర్ ఒక స్వర్ణాధ్యాయా నికి శ్రీకారం చుట్టారని చంద్రబాబు గుర్తు చేశారు.
రాయలసీమ దుర్భిక్షాన్ని దూరం చేయటానికి సీమకు కృష్ణా జలాలు ఇవ్వాలన్న సంకల్పంతో స్వర్గీయ ఎన్టీఆర్ పలు సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించారని, ఆయన ఆశలకు అనుగుణంగా గత తెదేపా ప్రభుత్వం సీమ ప్రాజెక్టులపై భారీగా ఖర్చు చేసిందని ఆయన తెలిపారు.
ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ భావాలతో దేశ రాజకీయాలలో తెదేపా క్రియాశీలక పాత్ర పోషించి, తెలుగు జాతి గౌరవాన్ని ఇనుమడిరప జేసిందని చంద్రబాబు చెప్పారు. యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్,ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వా మిగా రాష్ట్ర, దేశాభివృద్ధికి తెదేపా కృషి చేసిందని.. భారీ ఎత్తున జాతీయ రహదారుల నిర్మాణం, కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగాల్లో, విద్యుత్ రంగ సంస్కరణలు ప్రవేశపెట్టటంలో తెదేపా కీలక పాత్ర వహించిందని చంద్రబాబు గుర్తు చేశారు. సంపద సృష్టించి, రాష్ట్ర ఆదాయాన్ని పెంచి పేదలకు పంచటం తమ సంకల్పమని.. ఈ దిశగా సంక్షేమం, అభివృద్ధిలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని చంద్రబాబు తెలిపారు.