(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
గుడివాడలో ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా మూడురోజులపాటు జరిగిన క్యాసినో లో వందలకోట్ల రూపాయలు చేతులు మారిన అంశంపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బ్రోకర్లు కొడాలి నాని, వల్లభనేని వంశీలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే చట్టవ్యతిరేక క్యాసినో వ్యవహారంలో ప్రవీణ్ చికోటి, మాధవరెడ్డి ఇళ్లపై దాడులు నిర్వహించిన ఈడి అధికారులు వారి ఫోన్ కాంటాక్టుల ద్వారా ఉభయరాష్ట్రాల్లోని పలువురు రాజకీయ ప్రముఖుల పేర్లను గుర్తించారు. ఆ కాంటాక్టుల ద్వారా రేపో, మాపో ఈడి అధికారులు రాష్ట్రానికి వచ్చి తనిఖీలు నిర్వహించనున్నారు. ఇదిలావండగా చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి వ్యవహారంలో ముగ్గురు హవాలా ఆపరేటర్లను ఈడీ అధికారులు గురువారం గుర్తించారు. హైదరాబాద్‌లోని బేగంబజార్, బోయినపల్లి, సరూర్ నగర్ కేంద్రంగా హవాలా దందా గత కొంతకాలంగా కొనసాగుతోంది. ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయనే దానిపై ఈడి విచారణ కొనసాగుతోంది. రూపీ కన్వర్షన్ ఆపరేషన్ లో ముగ్గురు హవాలా ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించారు. చెన్నైకి చెందిన ఓ బంగారం వ్యాపారి హవాలా ఏజెంట్ గా చికోటి ప్రవీణ్ ఉన్నారు. చికోటి ప్రవీణ్ క్యాసినో జాబితాలో రాష్ట్రానికి చెందిన జగన్ రెడ్డి బ్రోకర్లు కొడాలి నాని, వల్లభనేని వంశీలతో పాటు ప్రకాశం జిల్లాలో హవాలామంత్రిగా పేరొందిన బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన డీసీసీబీ చైర్మన్, హైదరాబాద్‌కు చెందిన ఓ మంత్రి, వైజాగ్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ, ముగ్గురు ఎమ్మెల్యేలు, నెల్లూరుకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలావుండగా ప్రవీణ్ నివాసంలో 18 గంటల పాటు ఈడి నిరంతరాయంగా సోదాలు నిర్వహించింది. సోదాల్లో పలు కీలక పత్రాలు, ల్యాప్టాఉప్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్ నివాసం, ఫామ్హౌలస్లో తనిఖీలు కొనసాగాయి. ప్రవీణ్ పార్ట్ నర్ మాధవరెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహించిన ఈడి… మనీలాండరింగ్ లావాదేవీలపై ఆరా తీసింది. చికోటి జాబితాలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ గుర్తించింది. కాగా, ప్రవీణ్ చికోటి కాంటాక్ట్ జాబితాలో జగన్ రెడ్డి బ్రోకర్లు, పలువురు వైసిపి ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయని సమాచారం అందడంతో తాడేపల్లి ప్యాలెస్ లో కలకలం మొదలైంది. ఇప్పటికే మానవమృగం కొడాలి మీడియా ముందుకు వచ్చి దమ్ముంటే అరెస్ట్ చేయించాలంటూ బీరాలు పలుకుతున్నారు. రేపో, మాపో ఈడి అధికారులు వచ్చేవరకు ఈ పిచ్చికుక్క ఇలా మొరుగుతూనే ఉంటుంది. తనపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినపుడు ప్రతిపక్షనేతలపై అడ్డగోలు ఆరోపణలుచేసి తప్పించుకోవడానికి గుడివాడ గడ్డం గ్యాంగ్ కు వెన్నతో పెట్టిన విద్యే.