చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

2,63,411 మందికి ఉద్యోగ ఉపాధి

‘ఎస్‌ఐపీబీ’లో ప్రాజెక్టులను ఆమోదించిన సీఎం చంద్రబాబు

by చైతన్యరధం
Dec 31, 2024 at 6:25am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
2,63,411 మందికి ఉద్యోగ ఉపాధి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రాష్ట్రానికి మరో రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు
  • క్లీన్‌ ఎనర్జీ పాలసీతో క్యూ కడుతున్న సంస్థలు
  • ‘ఎస్‌ఐపీబీ’లో ప్రాజెక్టులను ఆమోదించిన సీఎం చంద్రబాబు

అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో 2,63,411మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా రాష్ట్రానికి రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈమేరకు సచివాలయంలో జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం జరిగింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే పలు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిపై ఎస్‌ఐపీబీ సమావేశంలో చర్చించారు. దరఖాస్తు చేసుకున్న ప్రాజెక్టుల్లో 9 కీలక ప్రాజెక్టుల స్థాపనకు సీఎం ఆమోదముద్ర వేశారు. ఈ 9 ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. దాదాపు 2,63,411కు పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని అధికారులు సీఎంకు వివరించారు.
రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పెద్దఎత్తున వస్తున్న సంస్థలకు భూకేటాయింపులతో సహా మౌలిక వసతులను శరవేగంగా కల్పించాలని, అదేవిధంగా ఒప్పందం ప్రకారం నిర్ధిష్ట సమయంలోనే ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాల ద్వారా మరింతగా పెట్టుబడులను ఆకర్షించాలని సూచించారు.
బీపీసీఎల్‌ సహా ప్రతిష్టాత్మక సంస్థల రాక
భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో ఆరు వేల ఎకరాల్లో రూ. 96,862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ఏర్పాటు చేయనుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. దీంతో 2,400 మందికి ఉపాధి కలుగనుందని చెప్పారు. మొత్తం 9 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు సామర్ధ్యంతో ఐదు బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టులో టౌన్‌షిప్‌, లెర్నింగ్‌ సెంటర్‌, రిఫైనరీ, పెట్రోకెమికల్స్‌ యూనిట్స్‌, క్రూడ్‌ ఆయిల్‌ టెర్మినల్‌, గ్రీన్‌ హెచ్‌2, అడ్మినిస్ట్రేషన్‌ బ్లాకులు నిర్మిస్తారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వచ్చే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి రూ.88,747 కోట్ల ఆదాయం రానుందని తెలిపారు. అయితే 2029లోగా మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు.
విశాఖకు టీసీఎస్‌
విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) రూ.80 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో 2 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి.
గుడిపల్లిలో ఆజాద్‌ మొబిలిటీ ఇండియా లిమిటెడ్‌
శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్‌ మొబిలిటీ ఇండియా లిమిటెడ్‌ 70.71 ఎకరాల్లో మూడు దశల్లో వచ్చే ఆరేళ్లలో పూర్తయ్యేలా ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల గ్రీన్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఈ సంస్థ రూ.1,046 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 2,381 మందికి ఉపాధి కలుగుతుంది.
రాంబిల్లిలో బాలాజీ యాక్షన్‌ బిల్డ్‌వెల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో రూ.1,174 కోట్లతో 1,500 మందికి ఉపాధి కలిగేలా బాలాజీ యాక్షన్‌ బిల్డ్‌వెల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఎండీఎఫ్‌/ పర్టికల్‌ బోర్డు ప్లాంట్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ నెలకొల్పనుంది.
క్లీన్‌ ఎనర్జీ పాలసీ సూపర్‌ సక్సెస్‌
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన క్లీన్‌ ఎనర్జీ పాలసీతో పలు సంస్థలు భారీ పెట్టుబడులతో రాష్ట్రానికి వస్తున్నాయి. కొత్తగా ఐదు సంస్థలు రూ.83 వేల కోట్ల పెట్టుబడితో వివిధ ప్రాజెక్టులను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నాయి. దీంతో కేవలం క్లీన్‌ ఎనర్జీ రంగంలోనే రెండున్నల లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి.
ఏఎం గ్రీన్‌ అమ్మోనియా (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌
ఏఎం గ్రీన్‌ అమ్మోనియా (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ కాకినాడలో 592 ఎకరాల్లో మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యంతో గ్రీన్‌ హైడ్రోజన్‌ ఆధారిత అమ్మోనియా మాన్యుఫాక్చరింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తోంది. రూ.12,000 కోట్ల పెట్టుబడితో నెలకొల్పుతున్న సంస్థలో 2,600 మందికి ఉపాధి లభించనుంది.
జాన్‌ కోకిరిల్‌ గ్రీన్‌కో హైడ్రోజన్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
జాన్‌ కోకిరిల్‌ గ్రీన్‌కో హైడ్రోజన్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కాకినాడలో 40 ఎకరాల్లో 2 గిగావాట్ల సామర్ధ్యం కలిగిన ఎలక్ట్రోలైజర్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ను రూ.2,000 వేల కోట్లతో స్థాపించనుంది. దీంతో 500 మందికి ఉపాధి కలుగుతుంది.
టాటా పవర్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌
400 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టును టాటా పవర్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ కర్నూలు జిల్లాలోని హోసూరు, పెద్ద హుల్తిలో 1,800 ఎకరాల్లో ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ. 2,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 1,380 మందికి ఉపాధి కలుగుతుంది.
క్లీన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ హైబ్రిడ్‌ త్రీ ప్రైవేట్‌ లిమిటెడ్‌
వైఎస్సాఆర్‌ జిల్లాలోని మైలవరం, కొండాపురం అలాగే నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్లలో మొత్తం 1,080 ఎకరాల్లో 119 మెగావాట్ల విండ్‌ పవర్‌, 130 మెగావాట్ల సోలార్‌ హైబ్రీడ్‌, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ ప్లాంట్ల ఏర్పాటుకు క్లీన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ హైబ్రిడ్‌ త్రీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. 650 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయి.
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ రాష్ట్రంలో తాజాగా 65 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్రమంతటా 5 లక్షల ఎకరాల్లో రెండున్నర లక్షల మందికి ఉపాధి కలిగేలా 11 వేల మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యంతో 500 కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు మొత్తం 2028 కల్లా పూర్తికానుంది. దీని ద్వారా రాష్ట్రానికి రూ.4,095 కోట్ల ఆదాయం రానుంది. నవంబర్‌ 19న జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన వివిధ ప్రాజెక్టుల పురోగతి గురించి కూడా ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

రూ.119 కోట్లతో టీసీసీ!

అన్నదాతకు కూటమి భరోసా!

Previous Post

వర్ధెల్లి మురళి అబద్ధాల కుతంత్రం – 8

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 31-12-2024

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

కార్యకర్త
@ March 14, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!
ఆంధ్రప్రదేశ్

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!
ఆంధ్రప్రదేశ్

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం
ఆంధ్రప్రదేశ్

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌రంగ వెలుగులకు ఇదే సాక్ష్యం

చైతన్యరధం
@ March 14, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

హెచ్‌సీలకు ప్రత్యేక పదోన్నతులు

చైతన్యరధం
@ March 14, 2026
ఇదీ.. బిట్స్ ప్లాన్!
ఆంధ్రప్రదేశ్

ఇదీ.. బిట్స్ ప్లాన్!

చైతన్యరధం
@ March 14, 2026
Load More

ముఖ్య వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్దిదారులకు సంక్షేమ లేఖలు

చైతన్యరధం
@ March 13, 2026
మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

చైతన్యరధం
@ March 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist