- గత ప్రభుత్వం ఆపిన బిల్లుల మంజూరు
- జగన్‌రెడ్డి కాంట్రాక్టర్ల నోట్లో మట్టికొట్టారు
- కేంద్రం నిధులు ఇచ్చినా దారిమళ్లించారు
- గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి
మంగళగిరి(చైతన్యరథం): ఉపాధి హామీ పథకం పెండిరగ్ బిల్లులు చెల్లిస్తూ అటు కాంట్రాక్టర్లకు, ఇటు కూలీలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటోందని గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో శనివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014-19లో నరేగా పథకం కింద చేసిన పనులకు నేడు కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేయడం హర్షణీయమన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఉపాధి హామీ ద్వారా అనేక అభివృద్ధి పనులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందిందని, అయితే వైసీపీ హయాంలో 350 అడ్డగోలు జీవో తెచ్చి నరేగా పనులు చేసిన వారి నోట మన్ను కొట్టారని మండిపడ్డారు. పనులు చేసిన వారు ఐదేళ్ల పాటు బిల్లులు రాకపోవ డంతో 50 మంది వరకు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. అనేకమంది అప్పులు తీర్చలేక పొలాలు, ఇళ్లు అమ్ముకుని నానా ఇబ్బందులు పడ్డారు..వారి చావుకు, ప్రజల కష్టాలకు జగన్‌రెడ్డి, వైసీపీ ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఉపాధి హామీ నిధులను సెంటు పట్టా పేరుతో వైసీపీ మంత్రులు, ఎంపీలు, వైసీపీ ముఠా దోచుకు తిన్నారని, ఏపీలో నరేగా నిధులు దుర్వినియోగమయ్యాయని స్వయంగా పార్లమెంటు సాక్షిగా చెప్పడం సిగ్గుచేటన్నారు. 2014-19లో ఎన్‌ఆర్‌ఈజీ ఎస్ పనులకు కేంద్రం రూ.2,200 కోట్లు విడుదల చేస్తే తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో ఆ నిధులు ఆగిపోయాయి.. తర్వాత సీఎం అయిన జగన్ వాటిని ఇతర పనులకు మళ్లించారని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఉపాధి హామీ పథ కం అటకెక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ హయాంలో పనులకు బిల్లులు ఇవ్వలేదు
2014-19 మధ్యలో లోకేష్ పంచాయతీరాజ్ మంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపారు.. ఒక్క సంవత్సరంలోనే 12 వేల కిమీ రోడ్లు వేయడమే కాకుండా ఐదేళ్లలో 6,194 కోట్లు ఖర్చు పెట్టారని గుర్తుచేశారు. దేశంలో మొదటిసారిగా లోకేష్ చేసినంత అభివృద్ధి ఎక్కడా జరగలేదు.. ఎల్‌ఈడీ సిస్టాన్ని తీసుకొచ్చిన రాష్ట్రం అప్పట్లో ఏపీనే..27 లక్షల ఎల్‌ఈడీ బల్బులు వేసి దేశంలోనే రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపారు. 2,627 కోట్లు ఖర్చు పెట్టి 2,823 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు వేశాం.. టీడీపీ హయాంలో జరిగిన పనులకు బిల్లులు చెల్లించకుండా వైసీపీ దురు ద్దేశంతో వ్యవహరించిందన్నారు. కూటమి వచ్చాక 7,700 పనులకు విజిలెన్స్ తనిఖీలు చేయించి వాటికి సంబంధించి జీవో నెంబర్ 646 ద్వారా రూ.331 కోట్లు విడుదల చేయించిన చంద్రబాబు, పవన్, లోకేష్, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ రూ.16,730 కోట్ల నిధులను ఇవాళ కేటాయించ డం పల్లె ప్రాంతాలపై ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తుందన్నారు. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసినా రోడ్లు గుంతలమ యమై చాలామంది ప్రమాదాల బారినపడి చనిపోయారన్నారు. నేడు కూటమి ప్రభు త్వం నిధులు కేటాయించి వాటి మరమ్మతులు చేయిస్తుందని చెప్పారు.
ఉపాధి హామీ నిధులు సాధించుకుంటాం
నరేగ ఫిర్యాదుల విభాగం సభ్యురాలు రేవతి మాట్లాడుతూ ఉపాధి హామీ పెం డిరగ్ నిధులు ప్రతి రూపాయి వచ్చే వరకు నరేగా గ్రీవెన్ సెల్ తరపున పనిచేస్తామని తెలిపారు. గతంలో లోకేష్ పంచాయతీరాజ్ మంత్రిగా అద్భుతమైన విజయాలు సాధించారు..అప్పట్లో రాష్ట్రం విడిపోయి లోటు బడ్జెట్‌లో ఉన్నా గ్రామాలను అభివృద్ధి చేయటంలో అద్భుతంగా పనిచేశారు.. వైసీపీ ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేసింది.. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తేవడంలో విఫలం అయింది. ఒక్క సిమెంటు రోడ్డు లేదు.. చెత్త నుంచి సంపద కేంద్రాలు లేవు.. ఎలాంటి అభివృద్ధి పనులు మనం చూడలేదు. రైతు భరోసా కేంద్రాలు, నవరత్నాలకు మాత్రమే వాటిని వినియోగించారు. అప్పట్లో ఉపాధి హామీలో తమిళనాడు ప్రథóమ స్థానంలో ఉంటే తర్వాత ఏపీ ద్వితీయ స్థానంలో నిలిచింది. వైసీపీ ప్రభుత్వ హయాం లో అతి తక్కువ నిధులను తీసుకున్న రాష్ట్రంగా ఏపీని నిలిపారు. పవన్‌కల్యాణ్ సారథó్యంలో తిరిగి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీ ద్వారా అత్యధిక నిధులు తెచ్చేలా కృషిచేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆకాంక్షించారు.