టిడిపి అధికారంలోకి రాగానే ప్రభుత్వ, ప్రయివేటు, స్వయం ఉపాధి రంగంలో యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా తాడిపత్రి నియోజకవర్గం కమ్మవారిపల్లి లో నిరుద్యోగులు లోకేష్ ను కలిసి వారి సమస్యలపై విన్నవించారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. టిడిపి హయాంలో యువతకు అమలుచేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తామని లోకేష్ తెలిపారు.
పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయిన యువతను రాష్ట్రానికి వచ్చే విధంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. టిడిపి పాలనలో యువతకు అన్నీ రంగాల్లో పెద్దపీట వేసామన్నారు. టిడిపి హయాంలో 6లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. ప్రతిఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఓట్లు వేయించుకొని యువతను జగన్ మోసం చేశాడని విమర్శించారు.