- ప్రజలచే ప్రజా ప్రభుత్వం ఏర్పడిరది
- ప్రజలు ఎప్పుడూ విగ్నతతో ఆలోచిస్తారు
- సమయానికి అనుగుణంగా వ్యవహరిస్తారు
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగిన అరాచక పాలనకు ప్రజలు ముగింపు పలికారని టీడీపీ అధినేత కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా జగన్‌రెడ్డి సృష్టించిన అరాచకానికి ఈ రోజు వచ్చిన ఫలితాలే నిదర్శనం అన్నారు. జగన్ ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో వైసీపీకి వచ్చిన ఓట్లను బట్టే తెలుస్తోందన్నారు. ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ఈ రోజు కూటమికి వచ్చిన అఖండ విజయమే చెబుతోంది. రౌడీలతో, గూండాలతో పాలన సాగించి.. పేద ప్రజలను ఆర్థికంగా, మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టారనేది ఎన్నికల ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయి. అది చేశాం, ఇది చేశామని చెప్పుకుంటూ పేపర్లో బూటకపు ప్రకటనలు ఇస్తే సరిపోదు.. క్షేత్రస్థాయిలో వాటి అమలు తీరును కూడా ప్రజలు గమనిస్తారు. వాలంటరు వ్యవస్థను పెట్టి అరాచకాలు చేశారు. దీని ప్రతిఫలమే ఈ రోజు ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం. ఆరాచక పాలనకు స్వస్తి పలికి ప్రజలచే ప్రజా ప్రభుత్వం ఏర్పడిరదని అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు..