- ‘డే విత్ సీబీఎన్’లో సీఎంను కలిసిన ఎన్ఆర్ఐ నవీన్
- పార్టీ ఎంపికతో ఇంటికి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
- సార్వత్రిక ఎన్నికలలో పార్టీకి విస్తృత సేవలందించిన సైనికుడు
- తెదేపా గెలుపు కాంక్షిస్తూ స్వీడన్ నుంచి వచ్చిన వైనం
- సీపంకు దగ్గరగావున్న క్షణాలు.. మర్చిపోలేను: నవీన్
అమరావతి (చైతన్య రథం): సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి అత్యుత్తమ సేవలందించిన శ్రేణులు ముఖ్యమంత్రితో ఒక రోజంతా ఉండే అవకాశాన్ని పార్టీ కల్పించింది. ఈ కాన్సెప్ట్‌తో రూపొందించిన ‘డే విత్ సీబీఎన్’ కార్యక్రమంలో భాగంగా స్వీడన్‌కు చెందిన ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్‌కుమార్‌ను సీపం తన ఇంటికి ఆహ్వానించారు. ఉదయంనుంచి సాయంత్రం వరకు సీఎంతో ఉండే అవకాశాన్ని కల్పించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో స్వీడన్‌నుంచి వచ్చిన నవీన్‌కుమార్ ఐదు నెలలపాటు తెలుగుదేశం పార్టీ విజయం కోసం పని చేశారు. ఆ సమయంలో చంద్రబాబు పిలుపు మేరకు వందల సంఖ్యలో ఎన్ఆర్ఐలు సొంత రాష్ట్రానికి వచ్చి చంద్రబాబును సీఎం చేసుకుంటే కలిగే లాభాలపై ప్రజలను చైతన్య పరిచారు. అలా నాడు విదేశాలనుంచి వచ్చి ఎన్నికల్లో పనిచేసిన వారికి గౌరవించుకునే కార్యక్రమంలో భాగంగా.. నాటి సేవల్లో టాప్లోవున్న వారిని పిలిచి గౌరవించాలని సీఎం భావించారు. ఎన్నికల సమయంలో కుప్పం సహా శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, చంద్రగిరి సెగ్మెంట్లలో తెలుగుదేశం అభ్యర్థుల విజయానికి నవీన్ కృషి చేశారు. ఈక్రమంలో నాడు ప్రకటించినట్టు నవీన్‌ను సీఎం ఇంటికి పిలిచి మాట్లాడారు.
రోజంతా సీఎం నివాసంలో ఉన్న నవీన్ ముఖ్యమంత్రి రోజూవారీ రివ్యూలు, పనితీరును సవివరంగా తెలుసుకున్నారు. రాష్ట్రం, రాష్ట్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐలు వివిధ దేశాల నుంచి ఎన్నికల సమయంలో సొంతూళ్లకు వచ్చి పని చేయడం ఎంతో స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా రాష్ట్రం బాగుండాలనే బాధ్యతతో పని చేసిన ఎన్ఆర్ఐలందరినీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఎన్ఆర్ఐ మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవి వేమూరు నేతృత్వంలో ఏపీకి వచ్చి పనిచేసిన ఎన్ఆర్ఐలలో నవీన్ ముందు వరుసలో నిలిచారు. దీంతో ఈ రోజు ముఖ్యమంత్రితో ‘డే విత్ సీబిఎన్’ కార్యక్రమానికి నవీన్‌కు అవకాశం కల్పించారు. దేశంలో ప్రముఖ నేత అయిన చంద్రబాబు నాయుడుతో కలిసి ఒక రోజంతా ఉండడంపై నవీన్ సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబును అభిమానించే వారికి, నేడు తనకిచ్చిన అవకాశం మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని నవీన్ అన్నారు. స్వయంగా సీఎం ఒక రోజు పనితీరును దగ్గరుండి చూసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి నవీన్ ధన్యవాదాలు తెలిపారు.