- తక్షణమే జీవో 2 ఉపసంహరించుకోవాలి
- అంగన్వాడీల కన్నీటిలో జగన్ రెడ్డి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం
అమరావతి: అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం జగన్ రెడ్డి నిరంకుశ పాలనకు, పెత్తందారీ పోకడలకు నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఎస్మా ప్రయోగించి సమ్మె లు నిషేధించడానికి రాష్ట్రమేమైనా జగన్ రెడ్డి జాగీరా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అంగన్వాడీలు సమ్మె చేస్తున్నదే జీతాల పెంపుపై అయినప్పుడు సమ్మె చేసిన కాలానికి వేతనాలు తగ్గించడడమేంటి జగన్ రెడ్డీ? ఉన్న వ్యవస్థ భరించలేనప్పుడు విప్లవం పుడుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతోంది అదే. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు. జీవోలతో అంగన్వాడీల న్యాయపోరాటాన్ని అడ్డుకోలేరు.. తక్షణమే జీవో నెంబర్ 2ను ఉపసంహరించుకోవాలి. అంగన్వాడీల పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతోంది. అంతిమ విజయం అంగన్వాడీలదే. ఒక్కో అంగన్వాడీ కార్యకర్త అపరకాళిగా మారి జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని భస్మంచేయడం ఖాయమని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.