- లలితా జ్యూయలర్స్ అధినేత కిరణ్ ప్రశంస
- వరద బాధితులకు రూ.కోటి విరాళం
విజయవాడ(చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు 74 ఏళ్ల వయసులోనూ వరద బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలను నిర్విరామంగా పర్యవేక్షిస్తూ ఎంతో కష్టపడుతున్నారని లలితా జ్యూయలర్స్ అధినేత కిరణ్ ప్రశంసించారు. విజయవాడ వరద బాధితుల కోసం కిరణ్ రూ.కోటి విరాళం ఇచ్చారు. సోమవారం సీఎం చంద్రబాబును కలిసి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ వరద బాధితుల కోసం రూ. కోటి విరాళం ఇస్తున్నాను.. అందరూ కూడా తోచిన సాయం చేయాలని కోరారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోందన్నారు. ఇది ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం అన్నారు. డబ్బులు ఊరికే రావు.. కానీ సంపాదించిన సొమ్మును దానం చేసినప్పుడే దానికి ఒక సార్ధకత ఉంటుందన్నారు. రూ.10, రూ. 100 ఎంతైనా సరే ఎవరి స్థోమతను బట్టి వారు వరద బాధితుల కోసం సాయం చేసేందుకు ముందుకు రావాలన్నారు.