.తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని నాడు లక్షకోట్ల దోపిడీ
.సిబిఐ, ఈడి కేసులతో 16 నెలలు చిప్పకూడుతిన్న ఎ1
.పాతవాసనలు వీడకుండా మళ్లీ అవే స్కామ్ లు రిపీట్
.లేపాక్షి భూములతో మరో 20వేల కోట్ల దోపిడీకి స్కెచ్!
.ఓబులాపురం మైన్స్ ద్వారా మరో దోపిడీకి మాస్టర్ ప్లాన్
.జగన్ వత్తిడికి తలొగ్గి గతంలో జైలుపాలైన అయ్యాఎస్ లు!
.ఈసారి ఎవరికి మూడుద్దోనని సీనియర్ అధికారుల్లో వణుకు
(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
నాడు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షకోట్లు దోచుకుని సిబిఐ, ఈడి కేసులతో తన సహనిందితుడు ఎ2తో కలిసి ఖైదీనెం.6093గా 16నెలలు చంచల్ గూడా జైలులో చిప్పకూడు తిన్న ఎ1 జగన్మోహన్ రెడ్డి.. కల్లబొల్లి మాటలతో రాష్ట్రప్రజలను వంచించి ముఖ్యమంత్రి అయినప్పటికీ చేతివాటాన్ని మాత్రం వదలడం లేదు. మూడేళ్లుగా ప్రజలను సమస్యల సుడిగుండంలో దింపి కంటిమీద కునుకులేకుండా చేస్తున్న జగన్ రెడ్డి.. జనాన్ని ఏమార్చి గతంలో చేసిన అడ్డగోలు దోపిడీ పర్వాన్ని అధికార ముసుగుతో ఈసారి సరికొత్తగా రిపీట్ చేస్తున్నారు. దొంగచేతికి తాళాలిచ్చిన పాపానికి కంచే చేనుమేస్తోందని తెలిసినా చేష్టలుడిగి చూడటం తప్ప మరేమీ చేయలేని నిస్సహాయస్థితిలో జనం చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతున్నారు. నాడు ఏ అధికారిక పదవి లేకపోయినా తన దోపిడీ పర్వానికి 10మందికి పైగా ఐఎఎస్ అధికారులను బలిపశువులను చేసిన జగన్ రెడ్డి.. ఈసారి ఎంతమందని బలితీసుకుంటారోనని అధికార యంత్ర్రాంగం ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఎప్పుడు ఏ తప్పుడు ఫైలుపై తమతో సంతకం చేయిస్తారోనని బిక్కుబిక్కుమంటూ ఉద్యోగ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం చేసే తప్పుడు పనులకు తలొగ్గి గత మూడేళ్లుగా చాలామంది సీనియర్ ఐఎఎస్ అధికారులు కోర్టుముందు దోషులుగా నిలబడి కొందరు శిక్షలకు కూడా గురయ్యారు.
లేపాక్షి భూములతో రూ.20వేల కోట్లదోపిడీకి స్కెచ్
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2004-09 నడుమ లేపాక్షి నాలెడ్జి హబ్ పేరుతో 8,844 ఎకరాలను అనంతపురం జిల్లా చిల మత్తూరులో కేవలం ఎకరా 50వేల రూపాయలు ఇచ్చి రైతులనుంచి కారుచౌకగా భూములను సేకరించారు. వైఎస్ కుటుం బానికి అత్యంత దగ్గర సంస్థ అయిన ఐ. శ్యాంప్రసాద్‌రెడ్డికి చెందిన ఇందూ ప్రాజెక్ట్‌కు ఈ భూము లను కట్టబెట్టారు. యూనివర్సిటీ క్లస్టర్లు, సైన్స్, టెక్నాలజీ పార్కులు, ఏవియేషన్, ఏరోస్పేస్, ఐటి కంపెనీలు, లాజిస్టిక్, ఎకనమిక్ జోన్ అంటూ ఊదరగొట్టి రైతులను మోసగించిన ఆ భూములను సేకరించారు. తర్వాత అక్కడ ఎటువంటి పెట్టుబడులు పెట్టకపోగా ఆ భూము లను తాకట్టుపెట్టి బ్యాంకులనుంచి రుణాలరూపంలో 4వేల కోట్లకుపైగా కొట్టేశారు. మార్చి 2019నాటికి ఈ సంస్థ రూ.4,531కోట్ల రూపాయలు బ్యాంకులకు బకాయి పడటంతో కొన్నాళ్ల క్రితం ఇందూప్రాజెక్ట్ దివాలా తీసింది. ఈ కేసు హైదరాబాద్ ఎన్ సిఎల్ టి (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)లో పడిరది. రుణదాతలకు కేవలం రూ.500 కోట్లు చెల్లిస్తే మొత్తాన్ని మాఫీచేసేలా ఎర్తిన్ ప్రాజక్ట్స్ అనే కంపెనీ ప్రతిపాదించడం,బ్యాంకర్ల ఆమో దించడం చకచకా జరిగిపోయాయి.ఈ కంపెనీలో ముఖ్య మంత్రి జగన్ రెడ్డి మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడైన పి.నరేన్ రామానుజుల రెడ్డి డైరక్టర్‌గా చేరడంతో 20వేల కోట్లరూపాయల విలు వైన భూములుకొట్టేసేందుకు జగన్‌రెడ్డి మరోభారీ స్కామ్ కు తెరలేపినట్లు బట్టబయలైంది. బెంగుళూరు ఎయిర్ పోర్టుకు సమీపంలో ఉన్న ఈ భూముల విలువ ప్రస్తుతం ఎకరాకు 3కోట్లరూపాయలకు పైగానే ఉంది. 500 కోట్లతో మొత్తం 8,844 ఎకరాలను కొట్టేసేందుకు జగన్ రెడ్డి సర్వం సిద్ధం చేసుకున్నారు. గతంలో ఇందూ స్కాంకు సహకరించి క్విడ్ ప్రోకో ద్వారా రూ.70 కోట్ల రూపాయలను సొంత కంపెనీల్లోకి తరలించుకున్నారు. ఇప్పుడు మరో క్విడ్ ప్రోకో -2 కు తెరలేపారు.
ఓబులాపురం మైన్స్‌తో మరో భారీదోపిడీకి స్కెచ్
గతంలో తన అక్రమాస్తుల కేసులో సహనింది తుడిగా ఉన్న గాలి జనార్దనరెడ్డికి చెందిన ఓబులాపురం మైన్స్ ద్వారా ఐరన్ ఓర్ తవ్వకాలకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని జగన్‌రెడ్డి ప్రభుత్వం నిర్లజ్జగా, నిస్సి గ్గుగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలుచేసింది. గతంలో కర్నాటక-ఎపి సరిహద్దుల్లో అటవీ, పర్యావరణ చట్టాల ను ఉల్లంఘించి గాలి జనార్థనరెడ్డికి చెందిన ఓబులాపు రం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, ఓబులాపురం మైనింగ్ కంపెనీ, అనంతపురం మైనింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, వై.మహాబలేశ్వరప్ప అండ్ సన్స్, బళ్లారి ఐరన్ ఓర్ ప్రైవేటు లిమిటెడ్ ల పేరుతో మొత్తం ఆరులీజుల్లో గాలి బ్రదర్స్ సుమారు 6 వేల కోట్ల రూపాయలకు పైగా అక్రమాలకు పాల్పడ్డారు. దీనిపై గతంలోనే కేంద్ర సాధి కార సంస్థ నివేదిక సమర్పించగా, ఆ నివేదికను దృష్టిలో ఉంచుకునే తదుపరి ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టుచే నియమితులైన అమికస్ క్యూరీ తాజాగా సుఫ్రీంకు విజ్జప్తి చేసింది. దారుణమైన ఉల్లంఘటనలు జరిగినట్లు స్పష్ట మైన నివేదికలు ఉన్నప్పటికీ ఆ వ్యవహారం తేలకుండానే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం ఓబులాపురం మైన్స్ ప్రాంతంలో ఇనుప ఖనిజం తవ్వకాల కు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అఫిడవిడ్ దాఖలుచేయడం జగన్ రెడ్డి బరితెగింపునకు నిదర్శనంగా చెప్పొచ్చు. పైగా సిబిఐ కోర్టులో ఈ కేసు పెండిరగ్ లో ఉంది. ఈ కేసు విషయంలో గతంలో సీనియర్ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి, ఓ.రాజగోపాల్ జైలుకుకూడా వెళ్లారు. అటువంటి కీలకమైన ఓబులాపురం మైన్స్‌తో మరోమారు దోపిడీ పర్వానికి జగన్ రెడ్డి తెరలేపారు. ఈసారి గోపాలకృష్ణ ద్వివేది, మైన్స్ డైరక్టర్ వెంకటరెడ్డిని జగన్ రెడ్డి పావులుగా ఉపయోగిస్తున్నారు.
గతంలో సిఎం జగన్‌రెడ్డి దోపిడీ కారణంగా కేసుల్లో ఇరుక్కున్న సీనియర్ ఐఎఎస్ అధికారులు:
1.బి.పి.ఆచార్య 2. ఓ.రాజ గోపాల్ 3. వై.శ్రీలక్ష్మి 4.ఎల్ వి సుబ్రహ్మణ్యం 5.మురళీధర్ రెడ్డి 6. ధనుంజయ్ రెడ్డి
7. ఎం.శామ్యూల్ 8. రత్నప్రభ 9. ఆదిత్యనాథ్ దాస్
6093 గురించి న్యాయమూర్తి ఏమన్నారు?
మిషన్ బిల్ట్ ఎపి కింద ప్రభుత్వ ఆస్తుల విక్రయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కేసు విచారణ నుంచి వైదొలగాలంటూ ఆ సంస్థ డైరక్టర్ ప్రవీణ్ కుమార్ వేసిన పిటిషన్ ను 30-12-2020న కొట్టివేస్తూ జస్టిస్ రాకేష్ కుమార్ ఇచ్చిన తీర్పులో జగన్ రెడ్డి వ్యవహారంపై చేసిన కామెంట్లు జగన్ రెడ్డి వ్యవస్థీకృత నేరస్వభావానికి అద్దంపడతాయి. ‘‘ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలపై ఆరోపణలు చేస్తూ రాసిన లేఖ ప్రచురితమయ్యే వరకు ఆయన గురించి నాకు పెద్దగా తెలియదు. ఆ లేఖ తర్వాత ఆయన గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత పెరిగింది. గూగుల్ లోకి వెళ్లి ఖైదీనెం.6093 అని కొడితే చాలా సమాచారం వస్తుందని ఎవరో చెప్పారు. నేనే అలా చేసే సరికి దిగ్భ్రాంతికరమైన సమాచారం లభించింది. నేను డౌన్ లోడ్ చేసిన సమాచారంతో కొంత సాధికారిక సమాచారం తెప్పించుకున్నాను. జగన్ పై 11 సిబిఐ, 6 ఈడి కేసులతోపాటు మరో 18 ఐపిసి సెక్షన్ల కింద కేసులు ఉన్నట్లు తెలిసింది (ఆ జాబితా పొందుపరిచారు). ఆ కేసులన్నీ దీర్ఘకాలంగా పెండిరగ్ లో ఉండగా, సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఒకరోజు వాటిలో కొన్ని తప్పుడు కేసులని, వాస్తవాల నమోదులో పొరపాటు జరిగిందని, చర్యలు నిలిపివేశామన్న కారణంతో పోలీసులు వాటిని మూసేశారు. డీజీపీ సారధ్యంలోని పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఎలా పనిచేస్తున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనం’’ అని జస్టిస్ రాకేష్ కుమార్ పేర్కొన్నారు.