అమరావతి(చైతన్యరథం): జగన్ ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత తారస్థాయికి చేరిందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటికి కిలో బంగారం ఇచ్చినా సైకో జగన్‌కు ఓటమి తప్పదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అయిదేళ్ల అరాచకపాలనతో విసిగిపోయిన జనం… జగన్‌ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్‌లో బంధిం చాలని నిర్ణయానికొచ్చిన నేపథ్యంలో ప్రలోభాల ఎరవేసి, చౌకబారు వేషాలతో ప్రజాభీష్టాన్ని తారు మారు చేసేందుకు యత్నిస్తున్నారని లోకేష్ విమ ర్శించారు. ఎన్నికల్లో గెలవడం ఎలాగూ సాధ్యం కాదని తేలిపోవడంతో తాయిలాలతో ఓటర్లను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు.
రేణిగుంటలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి చెందిన గోడౌన్ లో రాష్ట్రవ్యాప్తంగా పంపకానికి సిద్ధంగా ఉన్న చేతి గడియారాలు, స్పీకర్లు, విసనకర్రలతో పాటు మొత్తం 52 రకాల వస్తువుల డంప్‌ను అధికారులు పట్టుకున్నారు. టీడీపీ ఫిర్యాదు చేస్తే వైసీపీ తాయిలాల డంప్ నైతే పట్టుకున్నారు…మరి ఇసుక, లిక్కర్ లో జగన్ దోచుకొని ఎన్నికల్లో పంచడానికి సిద్ధంచేసిన డబ్బుల డంప్ ను ఎప్పుడు పట్టుకుంటారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటికి కేజీ బంగారం ఇచ్చినా ప్రజల్లో మీపై నెలకొన్న ఆగ్రహజ్వాలలను అడ్డుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని జగన్ గుర్తించాలని ఒక ప్రకటనలో లోకేష్ స్పష్టం చేశారు.