- మీడియా ప్రతినిధులపై మీ భాష అభ్యంతరకరం
- అధికారం పోయినా అహంకారం తగ్గలేదు
- విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ఖండిరచిన నారా లోకేష్
అమరావతి: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి మహిళా అధికారితో వివా హేతర సంబంధం వార్తల నేపథ్యంలో మీడియా ప్రతినిధులపై వాడిన భాషపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రెస్మీట్లో ప్రశ్నలు వేసిన మీడియా ప్రతినిధులను అరేయ్, ఒరేయ్ అంటూ పరుష పదజాలం వాడటంపై మంగళవారం మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. విజయసాయిరెడ్డి గారు… మీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు పెట్టిన ప్రెస్మీట్లో మీరు వాడిన భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. మీడియా ప్రతి నిధులను అసభ్య పదజాలంతో మీరు దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న మీకు తాను మంచీమర్యాదల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు అధికారం పోయినా అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదు. ఐదేళ్ల వైసీపీ పాలనలో మీ భాష, ప్రవర్తన, అవినీతి, అరాచకం చూసి ప్రజలు ఛీకొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలేదం టూ వ్యాఖ్యానించారు.