- నేరస్థులు నేరాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం
- కోర్టు మెట్లెక్కి వాటి పవిత్రతను పోగొడుతున్నారు
- కరకట్ట కమలహాసన్‌తో చేసిన కుట్రలు విఫలం
- చంద్రబాబుపై బురద జల్లడం మానుకోవాలి
- మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ హితవు
మంగళగిరి(చైతన్యరథం): జగన్‌రెడ్డి వేయించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు చెంపదెబ్బల తో ఇప్పటికైనా కళ్లు తెరవాలని డిమాండ్ చేస్తున్నానని మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీ అవసరాల కోసం మమ్మల్ని వాడుకోవద్దు అని సుప్రీంకోర్టు జగన్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో ఆయన నేరచరిత్ర వెల్లడైందన్నారు. జగన్‌రెడ్డికి హైకోర్టు మొట్టికాయలు వేస్తే అవి చాలవన్నట్లు చెంపదెబ్బలు కావాలని సుప్రీంకోర్టుకు వెళ్లాడు. ఓటుకు నోటు కేసు విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లి చంద్రబాబుపై జగన్ బురద జల్లాలని ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడ్డారని వ్యాఖ్యానించారు. 2019-24 మధ్య చంద్ర బాబుపై 12 కేసులు పెట్టి వేధించారు.. 15 సభాసంఘాలు, 2 మంత్రివర్గ సంఘాలు, 4 న్యాయ విచారణ సంఘాలు, సీబీసీఐడీ వంటి ఉన్నతాధికారులతో విచారణ చేయించి కొండను తవ్వి ఎలుకను పట్టాలని జగన్ ప్రయత్నాలు చేశాడన్నారు. చివరకు కొండ లేదు, ఎలుకా లేని పరిస్థితి అయిందని ఎద్దేవా చేశారు.
ప్రజాప్రభుత్వంపై అడుగడుగునా కుట్రలు
జగన్మోహన్ రెడ్డి అనుంగ శిష్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓ కరకట్ట కమల హాసన్. జగన్, కరకట్ట కమలహాసన్ ఇద్దరూ కలిసి చంద్రబాబుపై బురదజల్లడానికి పూనుకున్నా రు. జగన్ ఆలోచనలను కరకట్ట కమలహాసన్ ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో ఉన్నాడు. ఈ కరకట్ట కమలహాసన్ 2024 ఎన్నికల్లో నారా లోకేష్‌పై గెలవలేక వైసీపీ నుంచి పారిపోయి షర్మిల కాళ్లమీద పడ్డాడు. మళ్లీ జగన్మోహన్‌రెడ్డి వద్దకు వచ్చి దొంగలు దొంగలు కలిసి గూడు పుఠాణి చేయడం మొదలుపెట్టారు. మనిషికొక మాట, పశువుకొక దెబ్బ అనే నాను డికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి మనిషి, పశువు కాకుండా మరేదో వింత జీవిలా ప్రవర్తిస్తు న్నాడని వ్యాఖ్యానించారు. ప్రజా ప్రభుత్వాన్ని చంద్రబాబు ముందుకు నడపడాన్ని జీర్ణించు కోలేక అడుగడుగునా అడ్డుపడాలని జగన్ చూస్తున్నాడని మండిపడ్డారు.
జగన్‌రెడ్డి, ఆళ్లకు కోర్టు మెట్లెక్కే అర్హత ఉందా?
జగన్మోహన్‌రెడ్డికి జైలు, 34 కేసులు ఓ బ్రాండ్ అయితే చంద్రబాబు అంటే అభివృద్ధి, హైటెక్ సిటీ, సాగునీటి ప్రాజెక్టులు, నదుల అనుసంధానం ఓ బ్రాండ్. జగన్ తనకున్న క్రైం బ్రాండ్‌ను చంద్రబాబుకు కూడా అంటించాలని ప్రయత్నాలు చేస్తూ ప్రతి సందర్భంలోనూ విఫలం అవుతున్నాడు. గతేడాది చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో సరైన పద్ధతిని జగన్ అనుసరించలేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తులకు కోర్టు మెట్లు ఎక్కే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. నేరాలు చేసేవాళ్లు నేరాలు గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు ఆలో చిస్తుంటే..వాటిని చెడగొట్టాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం అని చెప్పి చివరకు మద్యంపైనే అప్పులు తెచ్చాడు.
అత్యధిక రేట్లకు మద్యాన్ని అమ్ముకున్నాడు.. ఆ డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లిందా? అని ప్రశ్నిం చారు. జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికైనా చౌకబారు రాజకీయాలు మానేయాలని హితవుపలి కా రు. తన కూతురుని చూసుకోవడానికి విదేశాలకు వెళ్లాలన్నా కోర్టు అనుమతి తీసుకోవా ల్సిన పరిస్థితి..ఇలాంటి వ్యక్తి చంద్రబాబుపై ఆరోపణలు చేయడం దుర్మార్గమని మండిపడ్డా రు. చంద్రబాబుపై జగన్‌రెడ్డి పెట్టిన ఏ కేసూ నిలబడిన దాఖలాలు లేవన్నారు. కోర్టు మెట్లు ఎక్కితే ఆ కోర్టు మెట్లు కూడా పవిత్రతను కోల్పోతాయని, ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకోవాలని హితవుపలికారు.