- మూడు రాజధానులంటూ రాజధాని లేని రాష్ట్రం చేశారు
- మహిళలకు భద్రత కరువు
- రాష్ట్రం కోసం నిరంతరం తపనపడిన చంద్రబాబు
- నేటి పాలకుల తీరుతో ఆయన కష్టం బుగ్గిపాలు
- వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలి
- రాష్ట్ర భవిష్యత్ కోసం టీడీపీని గెలిపించాలి
డోన్(చైతన్యరథం): వైసీపీ ఐదేళ్ల పాలనలో విధ్వం సం తప్ప అభివృద్ధి శూన్యమని టీడీపీ అధినేత చంద్ర బాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం బేతంచర్ల మండలం హెచ్. కొట్టాల, గొరుమానుకొండ గ్రామాల్లో గురువారం పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరా మర్శించిన అనంతరం తనకు సంఫీుభావం తెలిపేందుకు పెద్దసంఖ్యలో వచ్చి న మహిళలు, కార్యకర్తలనుద్దేశించి భువనేశ్వరి మాట్లా డుతూ మన దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఏపీ ఒక్కటే… రాష్ట్ర ప్రజలంతా సిగ్గుతో తలదించుకునే పరి స్థితిని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని దుయ్య బట్టారు. మూడు రాజధానులు నిర్మిస్తానని చెప్పిన వాళ్లు కనీసం ఒక్క రాజధానిని కూడా కట్టకుండా రాష్ట్ర పరువును మంటగలిపారన్నారు. వైసీపీ నాయకులు ప్రభుత్వ,ప్రైవేటు భూములను యథేచ్ఛగా కబ్జాలు చేస్తు న్నారన్నారు. ఓటర్ల జాబితాలో విచ్చలవిడిగా అక్రమా లకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజలంతా ప్రతి రోజు మీ ఓటు ఉందో, లేదో పరిశీలించు కోవడంతో పాటు మీ భూములు ఉన్నాయో, లేదో కూడా పరిశీలిం చుకోవాలని సూచించారు.
వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం
మద్య నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి న వైసీపీ ప్రభుత్వం మాట తప్పి, రాష్ట్ర ప్రజలకు కల్తీ మద్యం అమ్ముతూ వారి జేబులు ఖాళీ చేయటంతో పాటు, ఆరోగ్యాలను కూడా దెబ్బతీస్తోంది. దీనివల్ల అమాయక ప్రజలు చిన్నవయస్సులోనే ప్రాణాలు కోల్పో తున్నారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అందించడంలో పక్కనున్న రాష్ట్రాలతో పోటీపడిన చంద్రబాబు… నేడు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని వైసీపీ ప్రభు త్వం దుష్ప్రచారం చేస్తోంది. వైసీపీ చేయలేని ప్రతి పనిని చంద్రబాబు అడ్డుకుంటున్నా రంటూ ఆరోపణలు చేసి చేతులు దులుపుకుంటు న్నారు. ఎలక్షన్ కమిషన్ వలంటీర్ల సేవలను నిలిపేస్తే…దాన్ని కూడా వక్రీకరిం చి చంద్రబాబే వలంటీర్ల సేవలను ఆపేశారని దుష్ప్ర చారం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సకాలంలో డబ్బులు ఇవ్వలేక.. ఆ వైఫల్యాన్ని చంద్ర బాబుకు అంటగడుతోందని భువనేశ్వరి తప్పుబట్టారు.
పోరాడిన మహిళలు
డోన్ నియోజకవర్గ మహిళలకు, కార్యకర్తలకు నా నమస్కారాలు. మండుటెండను సైతం లెక్కచేయకుండా నాకోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. 53 రోజులు చంద్రబాబును అక్రమంగా జైల్లో నిర్బంధించి న సమయంలో కార్యకర్తలు తట్టుకోలేక విలవిల్లాడా రు.. కొంతమంది మృతిచెందారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో ఏనాడూ రోడ్డు మీదకు రాని మహిళలు కూడా రోడ్డు మీదకు వచ్చి పోరాడారు.. చంద్రబాబుకు పెద్దఎత్తున మహిళలను మద్దతుగా నిలి చారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమకేసుల్లో ఒక్క ఆధా రాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం నిరూపించలేకపోయిం ది. అమరావతి ఉద్యమంలో పాల్గొన్న మహిళలను వైసీపీ పాలనలో పోలీసులు చాలా వేధించారు.. అయి నా వాళ్లు పట్టు విడువకుండా 1,600రోజులుగా పోరా టం కొనసాగిస్తూనే ఉన్నారని భువనేశ్వరి అన్నారు.
పరిశ్రమలను తరిమేశారు
ఉమ్మడి ఏపీలో సైబరాబాద్ నిర్మాణం చేసే సమ యంలో చంద్రబాబును అనేక మంది విమర్శించారు. కానీ అక్కడ వచ్చిన ఐటీ పరిశ్రమలే నేడు తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెడుతున్నాయి. ఏపీని కూడా తెలంగాణ మాదిరి అభివృద్ధి చేయాలని చంద్రబాబు ప్రయత్నిం చారు. దురదృష్టవశాత్తు 2019లో వైసీపీ గెలిచింది. ఏపీ కోసం చంద్రబాబు పడిన కష్టాన్ని దగ్గరుండి నేను చూశాను. కొన్నిసార్లు రోజుకు కేవలం 3గంటలు మాత్రమే నిద్రపోయేవారు. ఏపీకి పెట్టుబడులు, పరి శ్రమలు తీసుకురావాలనే ఉద్దేశంతో రాత్రింబవళ్లు చంద్రబాబు కష్టపడ్డారు. చంద్రబాబు తెచ్చిన ఒక్కో పరిశ్రమను వైసీపీ ప్రభుత్వ పెద్దలు కమీషన్ల కోసం వేధించి పక్కనున్న రాష్ట్రాలకు తరిమేశారు. అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ తెలంగాణ వెళ్లి అక్కడ వేలాది మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. అన్న దాతలను దృష్టిలో పెట్టుకుని పోలవరాన్ని చంద్రబాబు 72శాతం పనులు వేగంగా పూర్తిచేస్తే… వైసీపీ వచ్చాక దాన్ని పట్టించుకోకుండా వదిలేసింది. నదుల అను సంధానంతో రాయలసీమకు కూడా గోదావరి నీళ్లు తెచ్చిన ఘనత చంద్రబాబుది. ఏ వర్గానికి ఏం చేస్తే వారు బాగుంటారు.. ఆర్థికంగా స్థిరపడతారు.. అని ఆలోచించి చంద్రబాబు అనేక కార్యక్రమాలు ప్రారంభించి అమలు చేశారని భువనేశ్వరి తెలిపారు.
సూపర్ సిక్స్‌తో అందరికీ మేలు
టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తారు. నిరుద్యోగ యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తారు. ఉద్యోగం వచ్చేవరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేలు నిరు ద్యోగ భృతి అందిస్తారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతిఏటా రూ.20వేలు ఇస్తారు. 18 ఏళ్లు నిండి న ప్రతి మహిళకు ప్రతినెల రూ.1,500 ఆర్థికసాయం చేస్తారు. చదువుకునే ప్రతి పిల్లవాడికి.. ఇంట్లో ఎందరు పిల్లలున్నా అందరికీ సంవత్సరానికి రూ.15,000 అం దిస్తారు.పేదవాళ్లకు సంవత్సరానికి 3ఉచితగ్యాస్ సిలిం డర్లు అందిస్తారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణసౌకర్యం కల్పిస్తారని భువనేశ్వరి తెలిపారు.