- బనచకర్ల ప్రాజెక్ట్ జగన్ ప్లానే అంటూ వైసీపీ ప్రచారం
- చంద్రబాబు కాపీ కొట్టారంటూ అంబటి అబద్ధాలు
- విజన్ డాక్యుమెంట్‌పై వైసీపీ పొంతనలేని విమర్శలు
- ఐదేళ్ల పాటు ప్రాజెక్టులను పట్టించుకోని జగన్‌రెడ్డి
- ఒక్క దానినీ పూర్తి చేయకపోగా విషప్రచారం
- కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, పనులు
- తమ ఘనతేనని చెప్పుకుంటూ నవ్వులపాలు
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా జగన్‌రెడ్డి అండ్ కో కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు, కార్యక్రమాలు తమ ఘనతేనని చెప్పుకుంటూ నవ్వులపాలవు తున్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్‌రెడ్డి అంతకుముందు చంద్రబాబు పాలనపై విమర్శలు చేస్తూ రాష్ట్రాన్ని లూటీ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ప్రజలు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చొబెట్టినా ఇంకా అదే పంథాలో కూటమి ప్రభుత్వం ఏ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా అది మా ప్లాన్, మా విజన్, మేము చేయాలని అనుకున్నాం అంటూ మీడియా ముందుకొచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారు. జగన్‌రెడ్డి పాలనలో నీటి పారు దల శాఖ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు అప్పట్లో చంద్రబాబు శ్రీకారం చుట్టిన నదుల అనుసంధానంపై సుదీర్ఘంగా మీడియా సమావేశం నిర్వహించారు. పట్టిసీమ ప్రాజెక్ట్ నిర్మిస్తుంటే అది ఒట్టిసీమ ఉపయోగం లేదన్నారు. నిర్మించిన అనంతరం ఫలితా లు చూశాక మొఖాలు మాడ్చుకున్నారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై తప్పుడు ప్రచారం
పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు 45.72 మీటర్లు అయితే కేసులకు భయపడి జగన్‌రెడ్డి 41.15 మీటర్లకు తగ్గించి నిధులు కావాలంటూ కేంద్రానికి సిఫార్సు చేస్తారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు ఎత్తుకు కట్టుబడి మొదటి దశలో భాగంగా 41.15 మీటర్ల వరకు పోలవరం ప్రాజెక్ట్ పనులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు షెడ్యూల్ ప్రకటిస్తే… పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారంటూ తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టా రు. గత టీడీపీ హయాంలో నీటి ప్రాజెక్ట్‌ల కోసం రూ.68,300 కోట్లు కేటాయించి పనులు చేస్తే వైసీపీ వచ్చాక ఐదేళ్లలో రూ.22 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, కాలువలు, ప్రాజెక్టుల నిర్వహణ గాలికొదిలేశాడు. నీటి సంఘాల ఎన్నికలు రద్దు చేశాడు. అక్రమ ఇసుక తవ్వకాల కోసం ప్రాజెక్టుల మరమ్మతులను పట్టిం చుకోలేదు. జగన్ నిర్లక్ష్యానికి ప్రాజెక్టులు కొట్టుకుపోయి గ్రామాల్లో ఇళ్లు నేలమట్టమై ప్రాణాలు పోయినా మొద్దు నిద్రలో ఉన్నాడే తప్ప అయ్యో పాపం అని కరుణ కూడా చూపలేదు.
జన్ డాక్యుమెంట్‌పైనా తప్పుడు ప్రచారం
రాష్ట్ర ప్రగతి కోసం..భావితరాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్‌ను ప్రజల ముందు పెడితే దానిపైనా వైసీపీ సైకో బ్యాచ్ బురదచల్లిం ది. విజన్ డాక్యుమెంట్‌లో ఒక అంశమైన నదుల అనుసంధానానికి సంబంధించి తెలు గు తల్లికి జలహారతి పేరుతో గోదావరి`బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తి వివరాలను చంద్రబాబు ప్రజలకు వెల్లడిరచారు. ఇంతటి మహోన్నతమైన ఆలోచనతో ముందుచూపుతో వెళ్తుంటే..ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చి ఇది జగన్ విజన్.. 2019 డిసెంబర్‌లోనే గోదా వరి`బనకచర్ల ప్రాజెక్ట్‌ను మేము ప్లాన్ చేశాం.. చంద్రబాబు మా ప్లాన్ కాపీ కొట్టా డంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పడం చూస్తే ప్రజలు నవ్విపోతున్నారు. గత ఐదేళ్ల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. సాగునీటి రంగాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లి సరైన సమయంలో పూర్తి చేయక అధికంగా ఆర్థిక భారం పడేలా చర్యలు చేపట్టిన జగన్ రెడ్డికి ఇలాంటి విజన్ ఎందుకు ఉంటుంది. విజన్ డాక్యుమెంట్‌పై నిందలు వేసిన జగన్… అందులో ఒక అం శంపై క్లియర్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పగానే ఇది నా ఆలోచన… నువ్వు కాపీ కొట్టావని చిన్నపిల్లాడికి మల్లే వ్యవహరించడం వైసీపీ నేతలకే సిగ్గు సిగ్గు.
ప్రాజెక్టులు అర్థం కాని వ్యక్తికి నీటిపారుదల శాఖ మంత్రి
2019 డిసెంబర్ 20న డీపీఆర్‌పై అప్పటి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి సమీక్షించారని మాజీ మంత్రి అంబటి రాంబాబు సెలవిచ్చారు. మా విజన్‌ను చంద్రబాబు కాపీ కొట్టేశా డని తప్పుడు కూతలు కూస్తున్నాడు. నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు తన రెండున్నరేళ్ల పదవి కాలంలో పోలవరం ప్రాజెక్ట్‌కు చేసింది ఏంట్రా అంటే రెండేళ్లు కరోనా వచ్చింది..వరదలు వచ్చాయి..మూడేళ్లు కూలీలు దొరకలేదు. కట్టేంత సమయం ఎక్కడుందంటూ తప్పించుకునే సమాధానాలే చెప్పాడే తప్ప మీ ఐదేళ్ల పాలన లో ఏం చేశారయ్యా అంటే మొఖం నేలకేసుకుంటాడు. పైగా పోలవరం ప్రాజెక్ట్ పనుల గురించి ప్రశ్నిస్తే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి ఆ ప్రాజెక్టు నాకే అర్థం కాలేదు నేను ప్రజల ఏమని సమాధానం చెప్పాలంటూ అందరి ముందు మంత్రిగా నవ్వుల పాలైనా సిగ్గులేకుండా గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ డినైన్ చేసింది జగన్ అని చెప్పడం విడ్డూరంగా ఉంది.
రెండేళ్లు కాదు… ఐదేళ్ల పాలనలో చేసింది శూన్యమే
అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్ట్‌ను రివర్స్ టెండరింగ్ పేరుతో 15 నెలల పాటు పనులు కాకుండా గద్దలా అప్పటి ముఖ్యమంత్రి జగన్ అడ్డుపడ్డాడు. ఇది కాకుండా మొదటి పర్యటనలోనే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి నీరు ఇస్తా మని అప్పటి మంత్రి అనిల్‌కుమార్ సెలవిచ్చారు. పైగా రెండేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని… టీడీపీని మూసేస్తారా అని సవాల్ విసిరాడు. రెండేళ్లు కాదు కదా ఐదేళ్లలో కనీసం 4 శాతం పనులు కూడా చేపట్టలేదు. ఐదు సార్లు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ప్రకటనలు చేశారే తప్ప ప్రాజెక్టుల స్థితిగతులపై ఏనాడూ సమీక్ష నిర్వహించలేదు. కమీషన్ల కక్కుర్తితో నీటి పారుదల రంగాన్నే నిర్వీర్యం చేసి రైతుల ఉసురు తీశాడు.
కూటమి ప్రభుత్వంలో పరుగులు పెడుతున్న నీటి రంగం
అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు జూన్ 17న మొదటగా పోలవరం పర్యటన చేశారు. వైసీపీ హయాంలో నిర్వీర్యం అయినా పనులపై సమీక్ష చేశారు. బడ్జెట్‌లో రూ.16,700 కోట్లు జలవనరుల రంగానికే కేటాయించారు. పోలవ రం పనులకు సంబంధించి రెండోసారి పర్యటన చేసి షెడ్యూల్ విడుదల చేశారు. 2026 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ విధంగానే పోలవరం పనులు వడివడిగా సాగుతున్నాయి. నదులు అనుసంధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. తెలుగు తల్లికి హారతి పేరుతో గోదా వరి బనకచర్ల ప్రాజెక్ట్‌ను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా క్లుప్తంగా రాష్ట్ర ప్రజలకు వివరించారు. మూడు నెలల్లో డీపీఆర్ పూర్తి చేసి మూడేళ్లల్లో ప్రాజెక్టు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించామని వివరించారు. ఎక్కడ ప్రజల్లో చంద్రబాబు మరింత మంచి పేరు వస్తుందో వైసీపీ బ్యాచ్ నిద్రలేచి… అది జగన్ విజన్ అంటూ తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గత ఐదేళ్లు చేసింది ఏం లేదని తెలిస్తే 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చొబెట్టారు. మళ్లీ ఇలాగే అబద్ధపు ప్రచారాలతో విజన్‌తో పనిచేస్తున్న ప్రభు త్వంపై నిందలు వేస్తే ఈసారి ఆ 11 కూడా మిగలవని జగన్ గ్రహించాలి.
ప్రవీణ్ బోయ,
అనలిస్ట్