- ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
- మొత్తం ఓటర్లు 3 కోట్ల 26 లక్షల మంది
- కొత్త ఓటర్లు దాదాపు పది లక్షల మంది
- విధి నిర్వహణలో 2.5 లక్షల మంది పోలింగ్ సిబ్బంది
- 13 సమస్యాత్మక నియోజకవర్గాలు గుర్తింపు
హైదరాబాద్: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భాగంగా చివరి రాష్ట్రమైన తెలంగాణలో గురువారం (ఈరోజు) పోలింగ్ జరగనుంది. సింగిల్ ఫేజ్‌లో జరగ నున్న ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా వచ్చేనెల మూడో తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. గురువారం నాటి ఎన్నికలకు ఎన్నికల సంఘం పూర్తి ఏర్పాట్లను చేసింది. మొత్తం 35,655 పోలింగ్ కేంద్రా లను ఏర్పాటు చేశారు. అందులో 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలం గాణా వ్యాప్తంగా మూడు కోట్ల 26 లక్షల రెండు వేల 799 మంది ఓటర్లు ఉండగా అందులో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్న యువ ఓటర్లు 9 లక్షల 99 వేల 667 మంది ఉన్నారు. ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదుగంటల వరకు పోలిం గ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం ఒక గంట ముందుగానే పోలింగ్‌ను ముగించనున్నారు. దాదాపు 600మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నా యి. 13 నియోజకవర్గాలను సమస్యాత్మకం అని గుర్తిం చారు. రాష్ట్ర వ్యాప్తంగా 12వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో నాలుగు గంట లకే పోలింగ్ ముగుస్తుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో మూడెంచల భద్రత ఏర్పాటు చేయనున్నారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఐదెంచల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.పోలింగ్‌పక్రియను పరిశీలించేందుకు 22వేల మంది అబ్జర్వర్లను, స్క్వాడ్లను నియమించారు.
తెలంగాణా పోలింగ్ లెక్కలు
తెలంగాణలో 3కోట్ల 26లక్షల 2799మంది ఓటర్లు
పురుషులు:1కోటి 62లక్షల 98వేల 418ఓట్లు
మహిళలు: 1కోటి 63లక్షల 1705 ఓట్లు
రాష్ట్ర వ్యాప్తంగా 2676 ట్రాన్స్జెండర్ ఓట్లు
కొత్తగా యంగ్ ఓటర్లు (18-19): 9లక్షల 99వేల 667 మంది
అబ్బాయిలు: 570274
అమ్మాయిలు: 429273
ట్రాన్స్ జెండర్స్: 120 మంది
సీనియర్ సిటిజన్ ఓటర్లు( 80ఏళ్ల పైబడి): 4,40,371 మంది
పురుషులు: 1,89,519
మహిళలు: 2,50,840
ట్రాన్స్ జెండర్లు: 12 మంది
ఎన్‌ఐఆర్ ఓటర్లు: 2933
దివ్యాంగులు:5లక్షల 6వేల921 మంది
రాష్ట్రవ్యాప్తంగా 12వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
గ్రేటర్ హైదరాబాద్‌లో 1800
పోలింగ్ విధుల్లో 2.5 లక్షల మంది సిబ్బంది
సమస్యాత్మక నియోజకవర్గాలు
సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం