- అభ్యంతరకరంగా తిరుపతి కలెక్టర్ లక్ష్మీషా ప్రవర్తన
- ఎన్నికల కోసమే ప్రకాశం జిల్లా ఎస్పీగా పరమేశ్వర్‌రెడ్డి బదిలీ
- బలమైన టీడీపీ స్థానాల్లో ఎస్‌డిపివోలుగా సిఎం స్వంత అధికారులు
- ఎన్నికల సంఘానికి కె.అచ్ఛెన్నాయుడు లేఖలు
అమరావతి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొందరు అధికారులు అధికార పార్టీ వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని, వీరిని ఉపయోగించుకొని వైసీపీ ప్రభు త్వం ఎన్నికల ప్రక్రియలో అధికార దుర్వినియోగం చేస్తోందని టీడీపీ రాష్ట్రఅధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు లేఖలు రాశారు. గతంలో తమ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌తో కూడా కలిసి రాష్ట్రం లో ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అక్రమాల గురిం చి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చిన విష యాన్ని ఆ లేఖల్లో ప్రస్తావించారు. ప్రధానంగా మూడు అంశాలకు సంబంధించి అచ్చెన్నాయుడు శనివారం నాడు కేంద్ర ఎన్నికల సంఘానికి మూడు లేఖలు రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారులను అడ్డం పెట్టుకొని ఎన్నికల ప్రక్రియను ఎలా అపహస్యం చేసిందో వివరిస్తూ తాజాగా జరుగుతున్న పరిణా మాలను ఈ లేఖల్లో వివరించారు.
తిరుపతి జిల్లా కలెక్టర్‌ను విధుల నుంచి తప్పించాలి
తిరుపతి జిల్లా కలెక్టర్ పదవీ బాధ్యతలు చేపట్టిన లక్ష్మీషా ప్రొటోకాల్ రూల్స్‌ను అతిక్రమించి, సంప్రదాయాలను పక్కన పెట్టి స్థానిక ఎమ్మెల్యే, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లి కలిశారని, ఆయన్ను శాలువ, పుష్ఫగుచ్ఛంతో సత్క రించారని, ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమేనని అచ్చెన్నాయుడు లేఖలో తెలిపారు. కరుణాకర్‌రెడ్డి కుమారుడు అభినయ్‌రెడ్డి తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గంలో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేయబోతున్నారని, లక్ష్మీషా ప్రవర్తన వైసీపీ నేతలతో ఆయనకున్న దగ్గరి బంధాన్ని తెలుపుతోందని, రానున్న ఎన్నికల్లో అభినయ్‌రెడ్డికి అనుకూలంగా లక్ష్మీషా పనిచేసే అవకాశం ఉందని ఆయన ఆందో ళన వ్యక్తం చేశారు. తిరుపతి సెగ్మెంట్ ఎన్నికల కోణంలో చాలా సమస్యాత్మక ప్రాంతమని, 2019 ఎన్నికల్లోనూ వైసీపీ అనేక దుర్మార్గాలకు పాల్పడంతో చాలా తక్కువ మార్జిన్ టీడీపీ ఆ సీటులో ఓడిపోయి కరుణాకర్‌రెడ్డి గెలిచాడని గుర్తు చేశారు.
ఇటీవల తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ అధికారుల అండతో వైసీపీ చాలా అవకతవకాలకు పాల్పడిరదని ఫిర్యాదులు వచ్చాయని, వీటిపైన విచారణ జరిపిన ఎన్నికల సంఘం అప్పట్లో ఈఆర్‌ఓగా పని చేసిన అన్నమయ్య జిల్లా కలెక్టర్‌పైన చర్యలు కూడా తీసుకుందని చెప్పారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలతో అంటకాగుతున్న తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాను అక్కడి విధుల నుంచి తప్పించాలని అచ్ఛెన్నాయుడు లేఖలో కోరారు.
ఆ 42 మంది ఎస్‌డిపివోలను మార్చండి
ఇటీవలే వైసీపీ ప్రభుత్వం 42మంది సబ్ డివిజ నల్ పోలీసు అధికారుల(ఎస్‌డిపివో)ను బదిలీ చేశా రని, రానున్న ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూ లంగా పనిచేయాలని వారందరికీ డీజీపీ ఆదేశాలు ఇచ్చారని, వారు అదే స్థానాల్లో కొనసాగితే అక్కడ స్వేచ్ఛగా ఎన్నికలు జరిగే అవకాశమే లేదని కేంద్ర ఎన్నికల సంఘానికి అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లేఖ రాశారు.
కొత్తగా బదిలీ చేసిన ఎస్‌డిపివోలలో పది మంది అధికారులు సీఎం సామాజిక వర్గానికి చెందిన వారని, వీరంతా వారు పనిచేసిన స్థానాల్లో టీడీపీ నేతలను వేధించారని, తప్పుడు కేసుల్లో ఇరికించా రని తెలిపారు. ఈ కొత్త బదిలీలన్నీ కూడా టీడీపీకి సంప్రదాయంగా గట్టి పట్టు ఉన్న ప్రాంతాల్లో జరిగాయని, ఇది కచ్చితంగా ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు చేసిన బదిలీ లేనని, వెనువెంటనే వీరిని అక్కడ నుండి బదిలీ చేసి, ఆ ప్రాంతాల్లో నిజాయితీగల అధికారులను నియమించాలని అచ్చెన్నాయుడు కోరారు.
ఎన్నికల కోసమే ప్రకాశం జిల్లా ఎస్పీగా పరమేశ్వర్‌రెడ్డి బదిలీ
వైసీపీ అనుకూల అధికారిగా గుర్తింపు పొందిన తిరుపతి ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డిని రానున్న ఎన్నికల్లో ఆపార్టీకి లబ్ధి చేకూర్చేందుకే ప్రకాశం జిల్లా ఎస్పీగా బదిలీ చేశారని, వెనువెంటనే ఆయన్ను ఆ స్థానం నుండి తప్పించి, నిజాయితీ గల అధికారిని నియ మించాలని ఎన్నికల సంఘానికి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. గతంలో సీఎం జగన్‌కు వ్యక్తిగత భద్రతాధి కారిగా పని చేసిన పరమేశ్వర్‌రెడ్డి తిరుపతి ఎస్పీగా పనిచేసినప్పుడు పూర్తిగా వైసీపీ కార్యకర్తలా పని చేశారని, వైసీపీ ఎమ్మెల్యేల అవినీతికి అండగా నిలిచి ప్రతిపక్ష నేతలపైన తప్పుడు కేసులు పెట్టారని చెప్పారు.
ప్రతిపక్ష నేతలు ప్రజాసమస్యలను లేవ నెత్తినప్పు డల్లా పరమేశ్వర్‌రెడ్డి వారికి వ్యతిరేకంగా హెచ్చ రించినట్లు మాట్లాడిన ఉదంతాలను గుర్తుచేశారు. తిరుపతి ఎస్పీగా ఉన్నప్పుడు ఎన్నికల అక్రమాలకు సంబంధించి ఎన్ని ఫిర్యాదులు చేసినా ఒక్క దానిపై కూడా చర్యలు తీసుకోలేదని తెలిపారు. మరోవైపు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఒంగోలు ఎంపీ స్థానానికి పోటీ చేయబోతున్నా రని, ఒంగోలు ఎంపీ స్థానం ప్రకాశం జిల్లా పరిధిలో ఉందని, రానున్న ఎన్నికల్లో వైసీసీపికి ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి అనుకూలంగా పనిచేసేందుకే పరమేశ్వర్‌రెడ్డిని ప్రకాశం జిల్లా ఎస్పీగా బదిలీ చేశారని, ఆయన్ను ఆ స్థానం నుంచి మార్చాలని అచ్చెన్నాయుడు కోరారు.