- అక్రమ పద్ధతుల్లో గ్రూప్ 1 ఉద్యోగాలు పొందారు
- కీలకమైన ఆర్‌డీఓ పదవుల్లో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు
- హై కోర్టు తీర్పు అమలు చేసేలా సీఎస్‌ను ఆదేశించండి
- సీఈఓకు అచ్చెన్నాయుడు లేఖ
అమరావతి: భారీ కుంభకోణం జరిగి న, 2018 గ్రూప్`1 నోటిఫికేషన్ ద్వారా అక్రమ పద్ధతుల్లో ఉద్యోగాలు పొందిన వారిని ఎన్నికల విధుల నుండి తొలగించా లని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి (సీఎస్)కి తగిన ఆదేశాలు జారీ చేయాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)కి గురువారం అచ్చెన్నాయుడు లేఖ రాశారు. 2018 గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా ఇప్పటికే ఉద్యోగాలు పొందిన పలువురు ఎన్నికల విధులకు సంబంధించి కీలకమైన పదవు ల్లో ఉన్నారని లేఖలో అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వారిని ఆ స్థానాల నుండి తప్పించాలి. 2018 గ్రూప్-1 నోటిఫికేషన్ పై హైకోర్టు ఆదేశాలను పాటించేలా చర్యలు తీసుకోండి. ఆ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొంది ఇప్పటికే కొంత మంది ఆర్‌డీఓలుగా ఎన్నికల విధులు నిర్వర్తిస్తు న్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం వారిని ఆ విధుల్లో కొనసాగించ డానికి వీలులేదు. కావున వారిని ఎలక్ష నేతర విధులకు బదిలీ చేయాలని అచ్చెన్నాయుడు కోరారు.
పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి
చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులి వర్తి నాని సతీమణి సుధారెడ్డి పట్ల దురుసు గా వ్యవహరించి, ఆమెను గాయపరిచిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవా లంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి అచ్చెన్నాయుడు మరో లేఖ రాశారు. తిరు పతి ఈస్ట్, రేణిగుంట ఎస్‌ఐలు సుధారెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించారని లేఖలో పేర్కొన్నారు. ఆ రోజు తెల్లవారుజామున 3 గం.లకు తుమ్మలగుంట గ్రామంలో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారని సుధారెడ్డికి సమాచారం వచ్చింది. సుధారెడ్డి, ఆమె భర్త పులివర్తి నాని అక్కడకు వెళ్లేందుకు బయట కు రాగా అప్పటికే పదుల సంఖ్యలో పోలీ సులు ఇంటిని చుట్టుముట్టి ఉన్నారు. వారి కి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా హౌస్ అరెస్టు చేశారు. ఎంతో కష్టంతో పేదల ఇళ్లు కూల్చేస్తున్న ప్రదేశం వద్దకు వెళ్లగా అక్కడ కూల్చివేతలను పర్యవేక్షిస్తున్న తిరుపతి తూర్పు పోలీసుస్టేషన్ ఎస్‌ఐ మహేశ్వరరెడ్డి, రేణిగుంట పోలీసుస్టేషన్ ఎస్‌ఐ మల్లిఖార్జునలు దురుసుగా ప్రవర్తిం చారు. మహిళ అని కూడా చూడకుండా సుధారెడ్డిని పోలీసు వ్యానులోకి బలవం తంగా నెట్టి ఆమె కుడి కాలుకు గాయ మయ్యేందుకు కారకులయ్యారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా పేదల ఇళ్ల ను ఎలా కూలుస్తారు? మహిళపై దురుసు గా ప్రవర్తించిన ఇద్దరు పోలీసు అధికారు లపై తగు చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు కోరారు.
ఫిర్యాదులపై చర్యలేవీ?
ఓటర్ల జాబితాలు, ఎన్నికల అవకతవక లకు సంబంధించి ఇప్పటి వరకు టీడీపీ తరఫున 49 ఫిర్యాదులు రాష్ట్ర ప్రధాన ఎన్ని కల అధికారికి పంపిచాము.వాటిపై ఇప్పటి వరకు ఎన్నికలసంఘం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ ఫిర్యాదులను పరిశీలించి వెంటనే తగుచర్యలు తీసుకోవాలని అచ్చె న్నాయుడు మరో లేఖలో విజ్ఞప్తి చేశారు.