- చంద్రబాబే ముఖ్యమంత్రి అన్న రాష్ట్ర ప్రజలు
- కూటమికి 106 నుండి 161 శాసనసభ సీట్లు లభించే అవకాశాలు
- తెదేపాకు అసెంబ్లీలో స్పష్టమైన మెజార్టీ సంకేతాలు
- 13 ఉమ్మడి జిల్లాల్లో 11 జిల్లాల్లో కూటమి భారీ ఆధిక్యం
- 15 నుంచి మొత్తం 25 లోక్ సభ సీట్లలో గెలుపు సూచనలు
- రాష్ట్రంలో కూటమిదే విజయమన్న దాదాపు 20 సర్వేలు
రాష్ట్రంలో గత ఐదేళ్లుగా విలయతాండవం చేసిన జగన్ రెడ్డి పాలనకు తెరపడనున్నదని శనివారం సాయంత్రం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు స్పష్టం చేశాయి. జగన్ రెడ్డి విధ్వంసక, అరాచక, విద్వేష పూరిత, అసమర్థ, అవినీతి పాలనకు బలైన నవ్యాంధ్ర పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటూ తెదేపా-భాజపా-జనసేన కూటమికి ఈ ఎన్నికల్లో భారీగా మద్దతిచ్చినట్లు పలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడిరచాయి.
పలు సర్వే సంస్థలు వెల్లడిరచిన ఎగ్జిట్ పోల్స్ కూటమికి కనీసంగా 106 శాసనసభ స్థానాలు, గరిష్టంగా 161 లభించే అవకాశాలున్నాయని వెల్లడిరచాయి. ఇందులో.. తెదేపాకు 175 సీట్లతో కూడిన రాష్ట్ర శాసనసభలో స్పష్టమైన మెజార్టీ లభించే అవకాశం ఉన్నట్లు కూడా పలు సర్వేలు తెలిపాయి. 8 సర్వేలు కూటమికి కనీసంగా 120 స్థానాలు లభించనున్నట్లు వెల్లడిరచాయి.
శాసనసభ ఎన్నికలకు సంబంధించి దాదాపు 30 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించగా అందులో 20 కూటమి విజయం సాధించనున్నట్లు స్పష్టం చేశాయి. ఇందులో పీపుల్స్ పల్స్, పయనీర్ పోల్ స్ట్రాటజీస్, చాణక్య ఎక్స్, పల్స్ టుడే, అదాన్ మీడియా సర్వే, రిపబ్లిక్ మేట్రిజ్ వంటి ప్రముఖ సంస్థలు ఉండటం విశేషం.
వైసీపీ అనుకూల ఫలితాలను వెల్లడిరచిన సంస్థల్లో ఆరా, ఆత్మ సాక్షి మాత్రమే కొంతమేర గుర్తింపు కలిగి ఉన్నాయి. వైసీపీకి 94 నుండి 104 అసెంబ్లీ సీట్లు లభించే అవకాశం ఉందని ‘ఆరా’ వెల్లడిరచగా, అధికార పార్టీకి 98 నుంచి 116 సీట్లు దక్కే అవకాశం ఉన్నట్లు ‘ఆత్మసాక్షి’ సంకేతాలిచ్చింది.
రాయలసీమలో కూటమి ముందంజ
రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లోని 11 జిల్లాల్లో కూటమి భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించనుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి రాయలసీమలో కూటమి మంచి ప్రదర్శన కనబరచినట్లు వెల్లడైంది. గత ఎన్నికల్లో రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోని 52 శాసనసభ సీట్లల్లో తెదేపా కేవలం 3 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో సీను తిరగబడినట్లు స్పష్టమౌతోంది.
ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కూటమి భారీ విజయాలను నమోదు చేయనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. విజయనగరం, కడప జిల్లాల్లో కూటమి, అధికార వైసీపీ పార్టీలు దాదాపు చెరిసమానంగా శాసనసభ స్థానాలను గెలుచుకోనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ సూచించాయి.
లోక్‌సభ బరిలోనూ కూటమి జోరు
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి 20 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ చేపట్టగా అందులో 14 సర్వేఫలితాలు కూటమి ఘన విజయాన్ని సూచించాయి. ఆయా ఫలితాల సూచనల మేరకు కూటమికి కనిష్టంగా 15 నుంచి గరిష్టంగా 25 లోక్‌సభ సీట్లు లభించే అవకాశం ఉంది. 6 సర్వేలు మాత్రమే అధికార వైసీపీకి ఎక్కువ సీట్లు దక్కే అవకాశం ఉందని తెలిపాయి.
ప్రఖ్యాత జాతీయ స్థాయి సర్వే సంస్థలైన సీ ఓటర్, ఇండియా టీవీ, ఏబీపీ టీవీ, మనీ కంట్రోల్, సీఎన్‌ఎక్స్ వంటి సంస్థలు లోక్ సభ ఎన్నికల్లో కూటమి భారీ విజయాన్ని సాధిస్తుందని వెల్లడిరచాయి. శాసనసభ ఎన్నికల్లో అధికార వైసీపీకి విజయావకాశాలు ఉన్నాయని సూచించిన ఆత్మసాక్షి సంస్థ కూడా రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూటమి 16-17 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలపటం గమనార్హం.
లోక్‌సభ గెలుపు అంచనాల్లో వైసీపీకి అనుకూలంగా 4 సర్వే ఫలితాలు వెల్లడికాగా.. అందులో రెండు సర్వేలు టీవీ 9, ఎన్‌టీవీ నిర్వహించినవి. కొంచెం గుర్తింపు కలిగిన ఆరా సంస్థ వైసీపీ 13 నుంచి 15 లోక్ సభ సీట్లు గెలిచే అవకాశాలున్నాయని వెల్లడిరచింది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వివరాలు-కూటమి గెలుపు అంచనాలు
క్ర.సంఖ్య సర్వే సంస్థ పేరు కూటమి గెలుచుకునే సీట్లు వైసీపీ గెలుచుకునే సీట్లు
1 కేకే సర్వే 161 14
2 పయొనీర్ పోల్ స్ట్రాటజీ 144 31
3 ఎస్-జీఈడీ 139 36
4 ఆదాన్ మీడియా 131 44
5 పీపుల్స్ పల్స్ 111-135 45-60
6 రిపబ్లిక్ మేట్రిజ్ 118-133 43-48
7 పల్స్ టుడే 121-129 46-54
8 ఎస్‌ఏఎన్ 127 48
9 ఎన్‌ఎఫ్‌ఓపీఎల్ 104-110 65-71
10 హెచ్ ఎంఆర్ 120 50-60
11 రింగ్ 2 పోల్ 115 60
12 చాణక్య ఎస్ 114-125 39-49
13 జనగళం 113-122 44-57
14 సర్వే ఫ్యాక్టరి 111 64
15 ప్రిజమ్ 110 60
16 రైజ్ 108-124 48-66
17 బిగ్ టీవీ 106-119 56-69
రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో కూటమి గెలుచుకునే స్థానాల వివరాలు
క్ర.సంఖ్య సర్వే సంస్థ పేరు కూటమి గెలుచుకునే సీట్లు వైసీపీ గెలుచుకునే సీట్లు
1 సీ ఓటర్ 21-25 0-4
2 ఏబీపీ 21-25 0-4
3 టీవీ సర్వే 19-23 2-6
4 సీఎన్‌ఎక్స్ 17-23 2-8
5 పీపుల్స్ పల్స్ 17-21 3-5
6 ఇండియా టీవీ 20-22 3-5
7 ఏపీ కనెక్ట్ 20 5
8 పోల్ పల్స్ 20 5
9 మనీ కంట్రోల్ 19-20 5-6
10 పల్స్ టుడే 19-20 5-6
11 అదాన్ మీడియా సర్వే 18 7
12 నేషనల్ ఫ్యామిలీ 15-18 7-10
13 ఆత్మసాక్షి 16-17 8-9
14 న్యూస్ ఎక్స్ 15 10