- డెంగ్యూ, మలేరియా, గున్యాతో ఎవరి ప్రాణాలు పోకూడదు
- వైద్య, మున్సిపల్, పీఆర్ అధికారుల సమన్వయం అవసరం
- జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు కీలకపాత్ర పోషించాలి
- కలెక్టర్లు వారానికోసారి వ్యాధులపై సమీక్షించాలి
- వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశం
అమరావతి(చైతన్యరథం): సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు ప్రబలకుండా వ్యాధుల నియ త్రణకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. వెలగపూడిలోని ఏపీ సచివాలయం ఐదో బ్లాక్ కాన్ఫన్స్ హాలులో మంగళవారం సీజనల్ వ్యాధులపై మంత్రి లోతుగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డెంగ్యూ, గున్యా, మలేరియాతో రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదన్నారు. జిల్లా కలెక్టర్లు వారానికోసారి జ్వరాలు, సీజనల్ వ్యాధులపై సమీక్షించాలని సూచించారు. మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. కేసులను గుర్తించడం, రిఫర్ చేయ డం, చికిత్స అందించడం, తరచూ విజిట్ చేయడం, అన్లైన్ రిపోర్టింగ్ చేయడం వంటి పనులను నిపుణుల కమిటీ చేపడుతుందన్నారు.
ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి.హరి కిరణ్ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో పంచాయతీరాజ్ కమిషనర్, మున్సిపల్ శాఖ కమిషనర్, ఐటీడీఏ పాడేరు పీఓ, మైక్రోబయాలజిస్ట్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్ ఎక్స్పర్ట్, మరో ఇద్దరు వైద్యనిపుణులు సభ్యులుగా, ప్రజారోగ్య కుటుం బ సంక్షేమ శాఖ డైరెక్టర్ పద్మావతి మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారనని తెలిపారు. విష జ్వరాలు, సీజనల్ వ్యాధులపై సమర్ధవంతమైన పర్యవేక్షణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని, వ్యాధులు ప్రబలిన వెంటనే అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాలు ప్రారంభమైన నాటి నుంచి సీజనల్ వ్యాధులు ప్రబలే రెండు మూడు నెలల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల తాను పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించినప్పుడు వార్డుల్లో జ్వర పీడితులుండడం గమనించినట్టు తెలిపారు.
విషజ్వరాలను కట్టడి చేయాలని, కేసులు వచ్చిన వెంటనే వైద్యఆరోగ్య శాఖాధికారులు జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. గుర్తించలేని జ్వరాలొస్తున్నట్లు మీడియా ద్వారా తెలుస్తోందని, ఏం చేయగలిగితే వీటిని నియంత్రించగలమన్న దానిపై దృష్టి సారించాలని సూచించారు. అన్ని సబ్ సంటర్లు, పీహెచ్‌సీలు, యూపీహెచ్సీల పరిధిలో జ్వరాలను ప్రతిరోజూ రిపోర్టు చేయాలని ఆదే శించారు. కిందిస్థాయి సిబ్బంది కేసులను గుర్తించిన వెంటనే పరీక్ష చేసి ల్యాబ్‌లకు పంపిం చాలని సూచించారు. పారిశుధ్యం, ఇళ్లల్లో ఫాగింగ్ వంటి విషయాల్లో స్థానిక ప్రజాప్రతి నిధుల సహాయాన్ని తీసుకుంటే ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రస్తుత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాదికి మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. పలు మార్లు సమీక్షించినా పెద్దగా పురోగతి కనిపించలేదని మంత్రి ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేశారుశీ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎం.టి.కృష్ణబాబు, సెక్రటరీ మంజుల, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి.హరికిరణ్, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పద్మావతి, డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం అడిషనల్ డైరెక్టర్ బి.సుబ్రహ్మణ్యేశ్వరి పాల్గొన్నారు.