అమరావతి(చైతన్యరథం): హజ్ యాత్రకు దరఖాస్తు నమోదు గడువును ఈనెల 23వ తేదీ వరకు పెంచినట్లు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్ మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర హజ్ కమిటీ మొదట ఆగస్టు 13 నుంచి సెప్టెం బరు 9 వరకు దరఖాస్తుల గడువు నిర్ణయించగా ప్రస్తుతం దానిని పొడిగించినట్లు చెప్పా రు. ప్రతి యాత్రికుడి తన మెషిన్ రీడబుల్ ఇండియన్ ఇంటర్నేషనల్ పాస్‌పోర్ట్ వ్యాలిడిటీ హజ్ దరఖాస్తు ముగింపు తేదీకి ముందే జారీ చేయబడి ఉండాలని, 15-01-2026 వర కు చెల్లుబాటు అయ్యేలా ఉండాలని సూచించారు. వయో పరిమితి లేదని, అయితే శిశువుల ప్రయాణం ఉచితం కాదన్నారు. పూర్తి విమాన చార్జీలో 10 శాతం వసూలు చేయ బడుతుం దని పేర్కొన్నారు. రెండేళ్ల కంటే ఎక్కువ వయసున్న దరఖాస్తుదారుకు వయోజన యాత్రికు డిగా చార్జీ విధించడం జరుగుతుందన్నారు. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా హజ్‌కు అర్హత జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఉంటుందని తెలిపారు. మొహర్రం లేకుండా కేటగిరీలో 45 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు గల స్త్రీలు 4 లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళల సమూహాలలో ప్రయాణించడానికి నిబంధనల ప్రకారం అనుమతించబడతారని తెలిపారు. హజ్-2025కు ఎంపికైన హజ్ యాత్రికులు మెడికల్ స్క్రీనింగ్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని సూచించారు. యాత్రి కులు ఎంబార్కేషన్ పాయింట్‌కు రెండు ప్రాధాన్యతలు ఇవ్వాలని, యాత్రికుల బస వ్యవధి 40-45 రోజుల వరకు ఉండవచ్చునని వివరించారు. హజ్ యాత్ర -2025లో ఒక యూనిట్‌కు కనీసం ఒకరు, గరిష్ఠంగా ఐదుగురు పెద్దలు, ఇద్దరు శిశువులు ఉండవ చ్చని సూచించారు. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా హజ్-2024 నుంచి ప్రత్యేక ‘హజ్ సువిధ’ యాప్‌ను ప్రారం భించిందని తెలిపారు. హజ్ కమిటీ సైట్ డబ్ల్యూడ బ్ల్యూడబ్ల్యూ. హజ్‌కమిటీ. జీవోవీ.ఇన్‌లో ఆన్‌లైన్ దరఖాస్తులు, రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా వ్యక్తిగతంగా లేదా టోల్‌ఫ్రీ నెం.1800-4257873, 0866-2471786 లేదా మెయిల్: ఏపీహజ్ కమిటీ.జిమెయిల్ లో వివరాలు పొందవచ్చునని తెలిపారు.