- జాగర్లమూడిలో ఆలయ భూమి లాక్కున్నారు
- గత ప్రభుత్వ నిర్వాకంపై ప్రజావినతుల్లో ఫిర్యాదు
- అధికారులు, వైసీపీ నేతలపై చర్యలకు వినతిపత్రం
- అర్జీలు స్వీకరించిన మంత్రి నిమ్మల, పట్టాభిరామ్
మంగళగిరి(చైతన్యరథం): గత వైసీపీ ప్రభుత్వంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పేరుతో తెనాలి మండలం సంగం జాగర్లమూడిలో దేవస్థానం భూములను నిబంధన లకు విరుద్ధంగా తీసుకుని దేవస్థానానికి చెందాల్సిన రూ.3.50 కోట్లు కొట్టేశారని బీజేపీ నాయకుడు వై.కామేశ్వరరావు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ప్రజావినతు ల కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. దీని వెనుక ఉన్న దోపిడీదారులు, వారికి కొమ్ము కాస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని దేవాలయ భూములను కాపాడాలని వినతి పత్రం ఇచ్చారు. మంత్రి నిమ్మల రామానాయుడు, ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అర్జీలు స్వీకరించారు.
` తమ గ్రామంలోని చెరువు ఆనకట్ట, తూములు పూర్తిగా పాడయ్యాయని, ప్రధాన కాలువ పూడిపోవడంతో చెరువులోకి రావాల్సిన నీరు రావడం లేదని ప్రకాశం జిల్లా సీపీపల్లె మండలం కమ్మవారిపల్లె గ్రామానికి చెందిన వేమూరి సుబ్బారావు సమస్యను వివరించాడు. ఇరిగేషన్ అధికారులు తమ చెరువుపై దృష్టి పెట్టి బాగు చేయాలని విజ్ఞప్తి చేశారు.
` తన భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడు తున్నారని పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలానికి చెందిన డి.సూర్యప్రకాశ్ ఫిర్యాదు చేశాడు. దయచేసి తన భూ సమస్యను పరిష్కరించాలని వేడుకున్నాడు.
` 92 ఏళ్ల తన తల్లికి గత ప్రభుత్వంలో కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని పింఛన్ కట్ చేశారని, పింఛన్ తిరిగి మంజూరు చేసి ఆదుకోవాలని విజయవా పాయకాపురానికి చెందిన ఎన్.సుబ్బలక్ష్మి విజ్ఞప్తి చేశారు.
` ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో తాము సీఎల్‌ఆర్‌పీలుగా పనిచేస్తూ తమ ఉద్యోగాలు రెన్యువల్ కోసం ఇటీవల టీడీపీ కేంద్ర కార్యాలయంలో అర్జీ పెట్టుకోగా తమ సమస్య పరిషారం అయిందని పద్మతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు. తమ అర్జీకి స్పందించి మేలు చేసిన ప్రభుత్వానికి రుణపడి ఉంటామని కృతజ్ఞత లు తెలిపారు. అలాగే వెంటనే స్పందించి తమ పనిని వేగంగా పూర్తి చేసిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
` నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం గ్రామానికి చెందిన గొడు గులూరి మాలకొండరాముడు సమస్యను వివరిస్తూ మండలంలో మెట్ట ప్రాంత ప్రజలకు సాగు, తాగునీటికి ఆధారంగా ఉన్న నక్కలగండి రిజర్వాయర్‌కు నీరు వచ్చేలా కాలువ పూడిక తీత, లైనింగ్ పనులకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
` రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌ఎచ్‌ఎంలో 4వ తరగతి కాంట్రాక్టు ఉద్యోగులుగా వివిధ రకాల క్యాడర్లలో అనేక సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న తమను రెగ్యులర్ చేస్తామ ని గత ప్రభుత్వం మోసం చేసిందని కాంట్రాక్టు ఉద్యోగులు తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
` కృష్ణా జిల్లా కానూరుకు చెందిన బల్దా చెన్నకేశవరావు సమస్యను వివరిస్తూ తిరు వూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో తన తాత…తల్లికి రాసి ఇచ్చిన భూమిని అక్ర మంగా తన పిన్ని కూతురు, తన మేనమామ కొట్టేయాలని చూస్తున్నారని ఫిర్యాదు చేశా రు. దీనిపై కోర్టులో తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా అధికారులు తనకు సహకరిం చడం లేదని వాపోయాడు.