- ముంపు ప్రాంతాల్లో మంత్రి సవితమ్మ పర్యటన
- బోటులో వెళ్లి బాధితులను ఒడ్డుకు చేర్చేలా చర్యలు
- నడుం లోతు నీటిలో బాధితులకు పరామర్శ
- అన్ని విధాలా ఆదుకుంటామంటూ భరోసా
- చంద్రబాబు స్ఫూర్తితో ముందుడి సహాయక చర్యలు
అమరావతి(చైతన్యరథం): ఊళ్లకు ఊళ్లు మింగేసిన కృష్ణమ్మ ఉగ్రరూపంతో ఉప్పొం గుతోంది. గజ ఈతగాళ్లు సైతం కడలిలా ఎగిసిపడుతున్న కష్ణమ్మను చూసి వణికిపోయా రు. ఇవేవీ ఆమెను భయపట్టలేకపోయాయి. సీఎం చంద్రబాబు అప్పగించిన బాధ్యత, వరద ఉధృతిలో చిక్కుకున్న బాధితులను రక్షించాలనే ఆమె కర్తవ్యం ముందు ఉగ్ర కృష్ణమ్మ చిన్న బోయింది. భవిష్యత్తు కొట్టుకుపోయిందని కన్నీటి సంద్రంలో కన్నీరుమున్నీరవుతున్న ముం పు బాధితుల్లో ఆమె మాటలు భరోసా నింపాయి. భయం లేదు… మేమున్నామన్నంటూ ఇచ్చిన ఓదార్పు కృష్ణమ్మ కడలిలో చిక్కుకున్న వారికి ఆపన్నహస్తమైంది. మహా మహు లు సైతం వరద ఉధృతిని చూసి బెంబేలెత్తినా ఆమె వెరవలేదు. మొక్కవోని ధైర్యంతో బోటు మీద వెళ్లి వరదలో చిక్కుకున్న వారిని కృష్ణమ్మ ఒడ్డుకు చేర్చారు. ఇవీ పామర్రు, పెనమ లూరులో కనిపించిన దృశ్యాలు. మంత్రి ఎస్.సవితమ్మ వరదలను లెక్కచేయకుండా సహా యక చర్యల్లో స్వయంగా పాల్గొనడం అక్కడి అధికారుల్లో స్ఫూర్తి నింపాయి. వరద బాధి తుల్లో భరోసా కల్పించాయి.
సీఎం చంద్రబాబు ఆదేశాలతో..
గతంలో ఎన్నడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి తో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో కొన్ని ప్రాంతాలను కృష్ణమ్మ ముంచేసింది. గంటల వ్యవధిలో విజయవాడ, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లు వర ద నీటిలో చిక్కుకున్నాయి. వేలాది మంది కృష్ణమ్మ వరద ఉధృతిలో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రేయింబవళ్లు రెండ్రోజులుగా విజయవాడ కలెక్టరేట్ నుంచి సమీక్షలు నిర్వహిస్తూ వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా దిశా నిర్దేశం చేస్తున్నారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులకు భోజనం, వసతి సౌకర్యం కల్పించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి సూచనల మేరకు రాష్ట్ర చేనేత జౌళి, బీసీ, ఈడ బ్ల్యూఎస్ సంక్షేమ మంత్రి ఎస్.సవిత పెనమలూరు, పామర్రు వరద ప్రాంతాల్లో పర్యటించా రు. రామలింగేశ్వ ర్‌నగర్, తాడిగడపలో మున్సిపాలిటీలో వడ్డేరు కాలనీ, హెచ్‌పీ గ్యాస్ గోడౌన్ కాలనీ, మాదు తిరుపతిరావునగర్ తదితర ప్రాంతాల్లో నడుం లోతుల్లో నీటిలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వరద బాధితులకు బిస్కట్లు, రొట్టెలు పంపిణీ చేశారు. వరద ఉధృతి పెరిగే ప్రమాద ముందని తక్షణమే ఇళ్లు ఖాళీ చేయాలని కోరారు. ప్రభుత్వం పునరావాస కేంద్రాల్లో భోజనం, వసతి సౌకర్యాలు కల్పించిందని, వరదలు తగ్గే వరకు అక్కడ ఉండాలని ధైర్యం చెప్పారు.
బోటులో వరద బాధితులకు ఒడ్డుకు చేర్చి…
కేవలం పర్యటనలు, ఓదార్పు మాటలతో సరిపెట్టకుండా మంత్రి సవిత రంగంలోకి దిగారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వరదలో చిక్కుకున్న బాధితులను రక్షించడానికి స్వయం గా బోటులో వెళ్లి ఒడ్డుకు చేర్చారు. తాడిగడపలో పర్యటన అనంతరం అక్కడి నుంచి పెన మలూరులోని వరద ప్రాంతాల్లో పర్యటించారు. మంత్రిని చూసిన గణపతినగర్, శ్రీనగర్ కాలనీలోని ప్రజలు రక్షించాలంటూ కేకలు వేశారు. తొలుత శ్రీనగర్ కాలనీలో కాలనీ వాసు లతో పాటు బాలింత, రెండు నెలల పసికందు కూడా వరద నీటిలో చిక్కుకున్నట్లు తెలిసిన మంత్రి సవిత ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో మాట్లాడారు. వారు ఏర్పాటు చేసిన బోటులో స్వయంగా శ్రీనగర్ కాలనీలో పర్యటించారు. బోటులోనే ఇంటింటికీ వెళ్లి పాల ప్యాకెట్లు అందజేశారు. చిన్నారులను, మహిళలను తాను ఎక్కిన బోటులోనే ఒడ్డుకు చేర్చారు. అక్కడి నుంచి గణపతినగర్ చేరుకుని బోటులో వరద బాధితులకు ఒడ్డుకు చేర్చారు. తిరుగు పయనంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కలిసి పెనమలూరులోని వరద ప్రాంతాల్లో భారీ పడ వలో పర్యటించి వరద బాధితులను పెద్ద సంఖ్యలో ఒడ్డుకు చేర్చారు.
చంద్రబాబు ఉన్నారు భయమొద్దు…
వరద బాధితులను ఆదుకోడానికి సీఎం చంద్రబాబు రేయింబవళ్లు కృషి చేస్తున్నారని మంత్రి ధైర్యం చెప్పారు. పామర్రులోని వల్లూరుపాలెం, తొట్లవల్లూరు జెడ్పీ హైస్కూళ్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే వర్ల కుమారరాజాతో కలిసి మంత్రి సం దర్శించారు. కన్నీటి పర్యంతమైన బాధితులను మంత్రి ఓదార్చారు. ‘భయపడాల్సిన అవస రం లేదు. సీఎం చంద్రబాబు అందరినీ ఆదుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ప్రాణనష్టం కలగకుండా చర్యలు తీసుకున్నాం. రాబోయే రోజుల్లో ఆస్తి నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం కూడా చెల్లిస్తాం’ అని తెలిపారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటా మని భరోసా ఇచ్చారు. పునరావాస కేంద్రాల్లో రెండ్రోజులు సేద తీరాలని, సొంత గ్రామాల కు తప్పనిసరిగా తరలిస్తామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే కుమార రాజా మాట్లాడుతూ మంత్ర సవితను చంద్రబాబు పంపారని, భయపడాల్సిన పనిలేదని అన్నారు. తాను కూడా 24 గంటలూ మీతోనే ఉంటానని, ఏ కష్టమొచ్చినా ఆదుకోడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ధైర్యం చెప్పారు.
బాధితుల కోసం 24 గంటలూ పనిచేద్దాం…
పామర్రులోని వల్లూరుపాలెం, తొట్లవల్లూరు జెడ్పీ హైస్కూళ్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించిన మంత్రి సవిత…అక్కడున్న వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్య కర్తలతో మాట్లాడారు. బాధితులకు అండగా ఉండాల్సిన సమయం వచ్చింది. సీఎం చంద్రబాబు రెండురోజుల నుంచి నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారు. మనం కూడా చంద్రబాబు బాటలో నడుస్తూ వరద బాధితులకు మెరుగైన సేవలు అందిద్దామని పిలుపునిచ్చారు. మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ…బాధితుల్లో మనో ధైర్యాన్ని కల్పిం చాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. వైద్యశిబిరాల్లో అందుబాటులో ఉంచిన మందులను పరిశీలించారు.
వరదలు తగ్గిన వెంటనే పంట, ఆస్తి నష్టం లెక్కింపు
తొట్లవల్లూరులో తనను కలిసిన విలేకరులతో మంత్రి సవిత మాట్లాడారు. వరద బాధితుల కోసం రేయింబవళ్లు కృషి చేస్తున్నామని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో భోజనంతో పాటు వసతి సౌకర్యాలు, వైద్యశిబిరాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వరదలు తగ్గగానే పంట నష్టాలతో పాటు ఆస్తి నష్టం లెక్కిస్తామని తెలిపారు. బాధితులందరికీ న్యాయం చేయాలనే దృక్పథంతో సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారని వివరించారు. రైతులకు న్యా యం జరిగేలా పంట నష్టం వివరాలు అంచనా వేస్తామని చెప్పారు. మంత్రి వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఉన్నారు.