- జగన్ ప్రేరేపణతోనే అసత్య ప్రచారం
- బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలి
- లేకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవు
- బొత్సకు హెరిటేజ్ ఫుడ్స్ లీగల్ నోటీసులు
అమరావతి (చైతన్యరథం): మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు ప్రముఖ డెయిరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ భారీ షాక్ ఇచ్చింది. తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా నిరాధారమైన ఆరోపణలు చేశారం టూ హెరిటేజ్ ఫుడ్స్ తరపు న్యాయవాది జి.మల్లికార్జునరావు లీగల్ నోటీసు జారీ చేశారు. ఫిబ్రవరి 18, 2026 నాటి ‘సాక్షి’ పత్రిక లో ప్రచురితమైన కథనం, అంతకు ముందు బొత్స నిర్వహిం చిన ప్రెస్‌మీట్ ద్వారా హెరిటేజ్ సంస్థపై తప్పుడు ప్రచారం చేశారని సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందాపూర్ డెయిరీతో సంబంధంపై స్పష్టతనిచ్చింది. బొత్స చేసిన ఆరోపణలను ఖండించింది. మహారాష్ట్రకు చెందిన ఇందాపూర్ డెయిరీ హెరిటేజ్ సంస్థదేనని..దాని ద్వారానే గతంలో టీటీడీ నెయ్యి కాంట్రాక్టులు పొందారని బొత్స చేసిన ఆరోపణలను హెరి టేజ్ ఖండించింది. ఇందాపూర్ డైరీకి, హెరిటేజ్ ఫుడ్స్‌కు మధ్య కేవలం ఒప్పంద తయారీ (Contract Manu facturing) సంబంధం తప్ప యాజమాన్య పరంగా ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
హెరిటేజ్ సంస్థ 22 కంపెనీలతో కలిసి ‘సిండికేట’గా ఏర్పడిందన్న బొత్స వ్యాఖ్యలు అత్యంత అపవాదుతో కూడుకున్నవని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని నోటీసులో పేర్కొన్నారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రేరేపణతోనే, రాజకీయ లబ్ధి కోసమే ఈ తప్పుడు ఆరోపణలు చేశారని హెరిటేజ్ సంస్థ ఆరోపించింది. నాణ్యతకు మారుపేరుగా అనేక అంతర్జా తీయ అవార్డులు పొందిన తమ 33 ఏళ్ల చరిత్ర ఉన్న సంస్థ పరువు తీయడమే ధ్యేయంగా ఈ దుష్ప్రచారం సాగుతోందని పేర్కొంది. తప్పుడు ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగంగా బేషరతు క్షమాపణ చెప్పాలి. నోటీసు జారీ చేసినం దుకు గాను రూ.1,00,000 (అక్షరాలా లక్ష రూపాయలు) లీగల్ ఖర్చులు వెంటనే చెల్లించాలి. క్షమాపణ చెప్పని పక్షంలో బీఎనఎస్ చట్టంలోని సెక్షన్ 356 కింద పరువు నష్టం దావాతో పాటు సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నోటీసు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.













