- ట్వీట్ పెడితేనే గజగజ వణుకుతున్నావ్
- కొందరు జగన్ రెడ్డి పోలీసు సర్వీస్ గా మారారు
- జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే విధ్వంసకాండ
- ఎవ్వరినీ వదలం.. అందరి లెక్కలు తేలుస్తాం
- వైఎస్ అభిమానులెవరూ జగన్ ని సమర్థించరు
- టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్
- కుప్పం పోరాట యోధులను జైలుల్లో పరామర్శించిన యువనేత
చిత్తూరు: ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అయితే ఎంత ప్రమాదమో కళ్లారా చూస్తున్నామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇటీవల కుప్పంలో పోలీసుల అక్రమ కేసులతో జైలు పాలైన టిడిపినేతలు, కార్యకర్తలను లోకేష్ మంగళవారం పరామర్శించారు. అనంతరం చిత్తూరు జైలువెలుపల లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంపై కనీస గౌరవం లేని వ్యక్తి మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారని దుయ్యబట్టారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు లో లేదు రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉంది. జగన్ రెడ్డి అంత పిరికివాడిని ఇప్పటి వరకూ చూడలేదన్నారు. టిడిపి కార్యకర్త ట్వీట్ పెడితేనే జగన్ రెడ్డి వణికి పోతున్నారని ఎద్దేవా చేశారు.
వైసిపి డ్రెస్ వేసుకున్న ఖాకీలు
ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది టిడిపి ముఖ్య నాయకుల పై అక్రమ కేసులు పెట్టారు. 5000 మంది కార్యకర్తల పై కేసులు పెట్టి వేధించారు. భయం మా బయోడేటా లేదు. ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో. కొంతమంది పోలీసులు ఖాకీ డ్రెస్ తీసేసి వైసిపి డ్రెస్ వేసుకున్నారు. టిడిపి నాయకుల ముందు మీసం మెలేయడం, టిడిపి కార్యకర్తల తలలు పగలగొట్టడం, సామాన్య ప్రజలను హింస పెట్టడం కొంత మంది పోలీసులకు ఫ్యాషన్‌గా మారింది. కొంతమంది పోలీసులు ఐపిసి (ఇండియన్ పీనల్ కోడ్) ఫాలో అవ్వడం లేదు, జేపిసి (జగన్ పీనల్ కోడ్) ఫాలో అవుతున్నారు. చట్టాన్ని ఉల్లంఘించే ప్రతి అధికారి మూల్యం చెల్లించుకోక తప్పదు.. వచ్చేది టిడిపి ప్రభుత్వమే.
దాడిచేసిన గూండాలను వదిలి టిడిపి వారిపై కేసులా?
జగన్ రెడ్డి ఒక దుర్మార్గుడు. సొంత తల్లి, చెల్లికి అన్నం పెట్టకుండా బయటకి గెంటేసాడు. ఇప్పుడు పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లపై పడ్డాడు. అధి కారంలోకి వచ్చిన వెంటనే పేదలకు అన్నం పెట్టే 201 క్యాంటీన్లు రద్దు చేసాడు. ఇప్పుడు తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తన్న అన్న క్యాంటీన్లు ధ్వంసం చేస్తున్నారు. మంగళగిరి లో నేను అన్న క్యాంటీన్ పెడితే ధ్వంసం చేసారు. కుప్పంలో అన్న క్యాంటీన్‌పై దాడి చేసారు. ప్రశాంతంగా ఉండే కుప్పంలో వైసిపి నాయకులు, పోలీసులు కలిసి హింసా రాజకీయం మొదలు పెట్టారు. చంద్రబాబునాయుడు పర్యటనకి భద్రతా ఏర్పా ట్లు ఎందుకు చెయ్యలేదు. రెచ్చగొట్టడం కోసం వైసిపి జెండాలు కడితే ఎందుకు వారించలేదు? పోలీసులపై రాళ్లు రువ్విన వైసిపి గూండాలను వదిలి టిడిపికి చెందిన 60 మందిపై కేసులు ఎలా పెడతారు? రెండో రోజు పోలీస్ స్టేషన్ పక్కనే అన్న క్యాంటీన్‌పై దాడి జరిగితే పోలీసులు ఎక్కడ ఉన్నారు?
పక్కా ప్లాన్ తోనే అన్న క్యాంటీన్ పై దాడి
సిఎం జగన్ సూచనలతో జిల్లా మంత్రి పెద్దిరెడ్డి, జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ భరత్ రెడ్డి ప్రణాళికతో అన్న క్యాంటీన్‌పై దాడి చేయించారు. దాడి చేసింది వైసిపి గూండాలు, అమ్ముడుపోయిన పోలీసులు.. కేసులు, అరెస్టులు మాత్రం టిడిపి నేతలపైనా? అసలు టిడిపి నేతలు, కార్యకర్తలు చేసిన నేరం ఏంటి? వైసిపి గూండాల దాడి ని అడ్డుకుంటే హత్యాయత్నం కేసులా? ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసులా? జైలుకు పోయిన టిడిపి నాయకులు, కార్యకర్తలు నిజమైన వీరులు, హీరోలు. వారికి పార్టీ అండగా ఉంటుంది. జగన్‌లా లక్షల కోట్లు అక్రమాలు చేసి చిప్పకూడు తినలేదు. పార్టీ కోసం జైలుకు వెళ్లారు.
పులివెందులలో బస్టాండు కట్టలేనివాడు
కుప్పంను ఉద్దరిస్తాడా?
జగన్ రెడ్డి కుప్పంకి చేసింది ఏమి లేదు. కుప్పంకి రౌడీయిజం తెచ్చారు. కుప్పంలో వైసిపి నాయకుల అధ్వ ర్యంలో అక్రమమైనింగ్ జరుగుతుంది.మూడేళ్లలో కుప్పం లో ఒక్కపని చేశారా. 100కోట్లతో మొదలు పెట్టిన ఇళ్ల నిర్మాణం ఆపేశారు. హంద్రీనీవా పనులు 10శాతం ఉంటే వాటినీ పూర్తి చెయ్యలేదు.జగన్ మగతనం అభివృ ద్దిలో చూపించాలి. పులివెందులలో బస్‌స్టాండ్ కట్టలేని వాడు.. ఇక్కడికి వచ్చి కుప్పంను అభివృద్ది చేస్తాడా? కడపలో వరదలు వస్తే తిరిగి ఇళ్లు ఇవ్వలేని జగన్ ఇక్కడ ఏదో పొడుస్తానని చెపుతున్నాడు. మా ఓపిక పరీక్షించొద్దు. రాబోయేది టిడిపి ప్రభుత్వమే మేము ఇలానే చేస్తే జగన్ అడుగు బయట పెట్టగలడా? కుప్పంలో పెద్దిరెడ్డికి ఏం పని?వైసిపి ఇంచార్జ్ పనికిరానివాడుకాబట్టి పెద్దిరెడ్డి వేలు పెడుతున్నాడా? రాజనీతిలో లక్ష్మణరేఖ ఉంటుంది వైసిపి వాళ్ళుదానిని ఎప్పుడోదాటేసారు.ఏ ఒక్కరిని వదిలి పెట్ట ను. గడపగడపకి వెళ్లలేని వైసిపి నాయకులు కుప్పంలో గొప్పలు చెప్పడం హస్యాస్పదంగా ఉందని లోకేష్ పేర్కొన్నారు.
మృతిచెందిన కార్యకర్తలకు నివాళులు
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన చంద్రగిరికి చెందిన టిడిపి నేతలు భాను ప్రకాష్ రెడ్డి, భాస్కర్ చిత్రపటాలకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన పెరుమాలపల్లె గ్రామానికి చెందిన టిడిపి నేత సోమనాధ్ రెడ్డిని లోకేష్ పరామర్శించారు.
కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ
పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుని ప్రశ్నించా రన్న నెపంతో అక్రమ కేసులు బనాయించడంతో అరెస్టయిన వేపనపల్లి యువకుల కుటుంబసభ్యులను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించా రు. అనంతరం గ్రామంలో లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ ఎన్నికల ముందు ముద్దులు పెట్టాడు. ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నాడన్నారు. యువతకు ఉద్యోగాలు లేవు, అభివృద్ది లేదు. గడప గడపకి ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు నెర వేర్చమని ప్రజలు ప్రశ్నిస్తే తప్పేంటి? రోడ్లు, జాబులు గురించి ప్రశ్నిస్తే వేపనపల్లి యువకులపై ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ చేసారు.
పెన్షన్ ఇవ్వమని ప్రశ్నిస్తే కేసు పెట్టే దుర్మార్గపు ప్రభుత్వం ఇది. తండ్రికి ఇంతచెడ్డ పేరు తెచ్చిన కొడుకు జగన్‌ఒక్కడే.వైఎస్ అభిమానులు ఎవ్వరూ జగన్ రెడ్డితో లేరు. ఆఖరికి తల్లి, చెల్లి కూడా దూరమయ్యారు. విద్యా దీవెన ఎందుకు ఇవ్వలేదు అని అడిగినందుకు యువకు లపై కేసులు పెట్టడం దారుణం. నాడు చంద్రబాబు ఒక్క చిటిక వేసి ఉంటే జగన్‌రోడ్డు మీద నడవగలిగే వాడా? జగన్‌ని ప్యాకప్ చేసే వరకూ నా పోరాటం ఆగదని లోకేష్ స్పష్టంచేశారు.