- మూడు పార్టీల పొత్తుతో వణుకుతున్న తాడేపల్లి పిల్లి
- గ్రాఫిక్స్ జనంతో ‘సిద్ధం’ మాయాజాలం
- డ్రోన్‌ను చూసినా భయమేనా?
- ప్రిజనరీ జగన్‌కు, విజనరీ చంద్రబాబుకి తేడా గమనించాలి
- పేటీఎం బ్యాచ్ కుట్రలపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి
- అనంతపురం శంఖారావం సభలో లోకేష్
అనంతపురం(చైతన్యరథం): వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయం జగన్‌రెడ్డిలో కనిపిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మేదరమెట్ల సిద్ధం సభలో జగన్ మాటల్లో ఆ విషయం తెలిసిపోయిందన్నారు. ఆ సభకు జనం రాకపోయినా గ్రాఫిక్స్ మాయాజాలంతో కనికట్టు చేశారని విమర్శిం చారు. ఎవరైనా పులినో, సింహాన్నో చూసి భయపడతా రు.. సిద్ధం సభలో డ్రోన్ చూసి జగన్ భయ పడ్డాడని ఎద్దేవా చేశారు. అనంతపురం సమీపంలోని రుద్రం పేటలో సోమవారం జరిగిన శంఖారావం సభలో లోకేష్ మాట్లాడుతూ మనకో బిల్డప్ బాబాయి జగన్ ఉన్నాడు.. సిద్ధం సభకు జనం రారని తెలిసి గ్రాఫిక్స్ కోసం గ్రీన్ మ్యాట్ వేశాడన్నారు. జగన్ ముఖంలో భయం, టెన్షన్ కనిపించింది. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తును చూసి జగన్ భయపడిపోతున్నాడు.
ఒక డ్రోన్ ఎగిరితేవిపరీతంగా భయపడిపోయి అరగంట అంబటి, బెట్టింగ్ స్టార్ అనిల్ నన్ను బండబూతులు తిట్టారు.. ఎందుకు డ్రోన్ చూసి పిల్లుల్లా భయపడుతున్నారు. ఖాళీ కుర్చీలను డ్రోన్‌తో వీడియో తీస్తున్నారని వారే చెప్పారు. అంటే సిద్ధం సభకు ప్రజలు వచ్చేందుకు సిద్ధంగా లేరని ఇద్దరు దొంగలువారి నోటితోనే చెప్పా రు. బాహుబలి చూపిస్తానని చెప్పి చివరికి పులకేశి సినిమా చూపించారు. దొంగ ఛానెల్ సాక్షి విజువల్ లో కూడా ఖాళీగా కనిపించింది.ఎవరన్నా లైవ్ చూశారా… సీఎంకు బాగా చెమటపట్టింది. భయం,టెన్షన్ పుట్టింది. దానికి కారణం టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు పెట్టుకు కోవడమే. జగన్ ఎక్కడికి వెళ్లినా భయపడేది ఈ పొత్తు వల్లనే అని లోకేష్ అన్నారు.
క్రిమినల్ రికార్డులున్నంత వరకు సైకో పేరు ఉంటుంది
జగన్ పని అయిపోయింది. చరిత్ర ఉన్నంతవరకు జగన్ ఉంటాడంటా. క్రిమినల్ రికార్డులు ఉన్నంత వరకు సైకో పేరు ఉండటం ఖాయంం. చంచల్‌గూడ జైలులో కూడా జగన్ పేరు ఉండటం ఖాయం. ఉమ్మడి అనంతపూర్ యూత్ పవర్ అదిరింది. వీరభద్ర ఆల యం, ప్రశాంతి ఆలయం, చెన్నకేశవస్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ అనంతపురం జిల్లా. దేశంలో ఎక్కడ కియా కారు కనిపించినా మేడ్ ఇన్ అని ఉండేది ఈ అనంతపురం జిల్లానే. ఈ నేల చాలా పవర్ పుల్. ఇక్కడి ప్రజలకు మంచి చేస్తే గుండెల్లో పెట్టుకుంటారు, అన్యాయం చేస్తే తోలుతీసే శక్తి కూడా అనంత ప్రజలకు ఉంది. మీరు మహా మొండివారు. అనుకున్నది సాధించేవరకు నిద్రపోరు. అన్న ఎన్టీఆర్‌ని గెలిపించి ముఖ్యమంత్రిని చేసిన జిల్లా అనంతపురం. ఇలాంటి పవిత్ర నేలపై రెండో సారి మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నానని లోకేష్ చెప్పారు.
సైకో ప్రచారపిచ్చి
సైకో జగన్ ప్రచార పిచ్చితో పరీక్ష పేపర్లలో కూడా తన గురించే ప్రశ్నలు వేసుకున్నాడు. గ్రూప్-2 పరీక్ష పేపర్‌లో కూడా జగన్ గొప్పలు చెప్పుకున్నాడు. ఆడుదాం ఆంధ్రా, జీవక్రాంతి, చేదోడు గురించి ప్రశ్నలు అడిగారు. మీరు అడగాల్సింది బాబా యిని లేపేసింది ఎవరు, వారంలో సీపీఎస్ రద్దు అన్నది ఎవరు, మహిళల పేరుపై 30లక్షల ఇళ్లు కట్టి రిజిస్ట్రే షన్ చేస్తాననిచెప్పి మాటతప్పింది ఎవరో అడిగితే సరైన సమాధానం చెప్పేవారు. జగన్ ఇటీవల ఏపీకి ఐపీఎల్ టీం పెడతానని చెబుతున్నారు. దానికి ఏం పేరు పెడ తారు? కోడికత్తి వారియర్స్ అని పెడతారా? విశాఖలో సచివాలయం పేరుతో ఒక గ్రాఫిక్ డిజైన్‌ను జగన్ విడుదల చేశాడు. రెండు కోడికత్తులను నిలబెట్టినట్లుగా కోడికత్తి టవర్స్ పెట్టారు.
కోడికత్తి వారియర్స్‌లో సీనియ ర్ బ్యాట్స్‌మెన్ అవినాష్‌రెడ్డి. బాబాయిని గట్టిగాకొట్టారు కదా. బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబటి, గంట స్టార్ అవంతి, ఆల్ రౌండర్ గోరంట్ల మాధవ్ ని పెట్టాలి. మాధవ్ జిల్లా పరువే కాదు…దేశం మొత్తం పరువు తీశారు. పార్లమెంట్‌లో ఆవరణలో రీల్స్ చేసుకునే య్యూటూబ్ స్టార్ భరత్, బూతుల స్టార్, సన్నబియ్యం సన్నాసి కొడాలి నాని, పింఛ్ హిట్టర్ బియ్యపు మధుసూదన్ రెడ్డిని ఆటగాళ్లుగా పెట్టాలి. అయ్యో పాపం బొత్స…ఆయన చెప్పేది ఆయనకే అర్థం కాదు. ఎక్కువ మంది చదవుకోవడం వల్ల ఉద్యోగాలు రావడం లేదంట…మరి నీకు మంత్రి పదవి ఎందుకు తప్పుకుని ఇంటికెళ్లు అని లోకేష్ అన్నారు.
100 సంక్షేమ పథకాలు కట్
జగన్‌ను చూస్తే కటింగ్, ఫిటింగ్ మాస్టర్ గుర్తుకు వస్తాడు. బల్లపైన బులుగు బటన్ నొక్కి ప్రజల అకౌం ట్‌లో రూ. 10వేస్తాడు. బల్లకింద రెడ్ బటన్‌తో రూ. 100లాగేస్తాడు. కరెంట్‌ఛార్జీలు 9సార్లు పెంచి బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాదుడే బాదుడు. ఇంటి పన్ను, చెత్తపన్ను పెంచి బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు పెంచి, క్వార్టర్ బాటిల్, ఇంటి పన్ను, చెత్తపన్ను పెంచి, నిత్యావసర ధరలు పెంచి బాదుడే బాదుడు. జగన్ కటింగ్ మాస్టర్ కూడా.. అనంతలో ఉండే అన్న క్యాంటీన్ కట్, పెళ్లికానుకలు కట్, పండుగ కానుకలు, చంద్రన్న బీమా కట్, స్కూల్ ఫీజురీయింబర్స్‌మెంట్, 6 లక్షల మంది వృద్ధులకు పెన్షన్ కట్. పండుగ కానుకలు కట్, రంజాన్ వస్తే మసీదులకు చంద్రబాబు ఇచ్చే డబ్బులు కట్.ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలోనే 100సంక్షేమ పథకాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ అని లోకేష్ దుయ్యబట్టారు.
జనం కష్టాలు తీర్చేందుకే సూపర్`6
నేను 3132 కి.మీ పాదయాత్ర చేశా. ప్రజలు పడు తున్న కష్టాలు చూశా. అందుకే పవనన్న, చంద్రబాబు కలిసి బాబు సూపర్-6 హామీలు ప్రకటించారు. టీడీపీ -జనసేన ప్రభుత్వం ఏర్పడిన ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల రూ.3వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తాం. స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ఏడాదికి రూ.15వేలు వేస్తాం. ఇద్దరుంటే 30వేలు, ముగ్గురుంటే రూ.45వేలు ఇస్తాం. రైతుకు ప్రతి ఏడాది కి రూ.20వేలు ఆర్థిక సాయం చేసి ఆదుకుంటాం. ప్రతి ఇంటింకి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఇక 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు ప్రతి నెల రూ.1500 చొప్పున, ఏడాదికి రూ.18వేలు, ఐదేళ్లలో రూ.90 వేలు మీకు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కూడా మన ప్రభుత్వం కల్పిస్తుందని లోకేష్ తెలిపారు.
అనంతపై ఎంతో ప్రేమ
అనంతపురంఅంటే మాకుటుంబానికి చాలా ప్రేమ. ఎన్టీఆర్‌ని ఎమ్మెల్యే చేసి ముఖ్యమంత్రిగా పం పించారు. మా మామయ్య హరికృష్ణని, ఇంకో మామయ్య, మీ అందరి బాలయ్య, నాకు ముద్దుల మామయ్య బాలకృష్ణ ను కూడా రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన గడ్డ ఈ ఉమ్మడి అనంతపురం జిల్లా. 2014-19 మధ్య రెట్టిం పు ప్రేమతో జిల్లాను అభివృద్ధి చేశాం. కరవు జిల్లాకు కార్లు పండే కియాను తీసుకువచ్చి 50వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. లక్షా 30వేల మంది రైతులకు 90శాతం సబ్సీడీతో డ్రిప్‌ఇరిగేషన్ పరికరాలు ఇచ్చాం. అనంతను హార్టికల్చర్ హబ్‌గా చేశాం. వర్షాలు పడక పోతే ఒకే ఏడాది రూ.2వేల కోట్లు ఇన్‌పుట్ సబ్సీడీ చెల్లించి రైతులను ఆదుకున్నామని లోకేష్ చెప్పారు.
తేడా గమనించాలి
ప్రిజనరీ జగన్‌కు, విజనరీ చంద్రబాబుకు ఉన్న తేడా ప్రజలు గమనించాలి. చంద్రబాబు 600 ఎకరా లు భూసేకరణ చేసి రెండేళ్లలో కియా తీసుకువచ్చారు. జగన్‌రెడ్డి తన తండ్రిని అడ్డుపెట్టుకుని లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో 8,844 ఎకరాలు భూసేకరణ చేశారు. సైన్స్ సిటీ పేరుతో 8వేల ఎకరాలు భూసేకరణ చేశా రు. అంటే దాదాపు 17వేల ఎకరాలు భూసేకరణ చేశా రు. అవన్నీ ఈరోజు వాళ్ల సొంతమిత్రుల కంపెనీ చేతు ల్లో ఉన్నాయి. ఒక్క పరిశ్రమ రాలేదు, కంపెనీ రాలేదు, ఒక్కరికి ఉద్యోగం రాలేదు. నేను హామీ ఇస్తున్నా.. మన ప్రభుత్వంలో ఆ భూములు వెనక్కి తీసుకుని స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తామని లోకేష్ స్పష్టం చేశారు.
టీడీపీ హయాంలోనే అభివృద్ధి
అనంతపురం పట్టణానికివస్తే..విద్యావంతులు పుట్టి న నేల ఇది. పట్టణానికి రాజకీయ చైతన్యం ఎక్కు వ. ప్రభాకర్‌చౌదరి నాయకత్వంలో రూ.1500కోట్లు ఖర్చు పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, బ్రిడ్జిలు, పంచాయతీ, అంగన్‌వాడీ భవనా లు, తాగునీటి పథకాలు అందజేశాం. 6వేల టిడ్కో ఇళ్ల పనులు కూడా మొదలుపెట్టాం.టిడ్కో ఇళ్లలో మిగిలిన పదిశాతం పనులు పూర్తిచేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈసైకో ప్రభుత్వం. అనంతపురం పట్టణాని కి ఏకంగా రూ.91కోట్లతో పైప్ లైన్లు ఏర్పాటుచేశాం, 11 రిజర్వా యర్లు ఏర్పాటుచేశాం. తాగునీటికి శాశ్వత పరిష్కారం అందజేశాం.మేం కట్టిన రిజర్వాయర్లు, పైప్ లైన్లను వినియోగించుకోలేక పాడుబెట్టిన చేతగాని ప్రభుత్వమి ది. స్టేడియాన్ని అభివృద్ధి చేశాం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాం.కనీసం డాకర్లను కూడా ఇవ్వలే ని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని లోకేష్ విమర్శించారు.
అవినీతి ఎమ్మెల్యే
ఇక్కడి శాసనసభ్యుడు అనంత వెంకట్రామిరెడ్డి పెద్ద అవినీతి పరుడు. చేతగాని, కమీషన్ ఎమ్మెల్యే. 9 నెంబ ర్ సింబల్ అని మీరందరూ చెప్పారు. ఎవరైనా పని కోసం వెళితే హడావుడిగా ఫోన్ కొడతాడు. 9 నెంబర్లు కొట్టి బిల్డప్ ఇస్తాడు. ఏ ఒక్క పనీ జరగదు. మా చిత్తూరు జిల్లాకు చెందిన పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడు. చిత్తూరు జిల్లాను అడ్డగోలుగా దోచేశాడు.ఎక్కడ పేదోళ్ల భూములు కనపడితే దొంగ పత్రాలు సృష్టించి కాజేస్తా డు. మీ తరపున పోరాడితే రౌడీషీట్లు ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు అనంతను దోచుకునేందుకు ఇక్కడకువచ్చాడు. ఆపాపాల పెద్దిరెడ్డి వస్తే తరిమి తరిమికొట్టాలి. ఆనాడు ఎన్టీఆర్‌ను బర్తరఫ్ చేస్తే ఉద్యమం ప్రారంభమైన జిల్లా అనంతపురం. దానిని స్ఫూర్తిగా తీసుకుని పాపాల పెద్ది రెడ్డి కాళ్లు విరగ్గొట్టాలి. టీడీపీ-జనసేన అభ్యర్థిని గెలి పిస్తే అవుటర్ రింగ్ రోడ్డు పూర్తిచేస్తాం, పట్టణంలో భూగర్భ డ్రైనేజీ పూర్తిచేస్తాం. వంద రోజుల్లో టిడ్కో ఇళ్ల పనులు పూర్తిచేసి అందజేస్తాం. డంపింగ్ యార్డ్‌ను కూడా తరలించి మోడల్ డంపింగ్ యార్డ్ తీసుకువస్తా మని లోకేష్ చెప్పారు.
కార్యకర్తలే బలం
టీడీపీకి కార్యకర్తలే బలం. నాయకులు పార్టీని వీడినా కార్యకర్తలు అండగా ఉన్నారు. అన్న ఎన్టీఆర్ ఏ మూహూర్తాన పార్టీని స్థాపించారో కానీ.. ఆ పసుపు జెండాను చూస్తేనే ఉత్సాహం. వైకాపా వాళ్లు కదలా లంటే బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ కావాలి. మనకు మాత్రం చంద్రబాబు ఒక్క పిలుపు రా.. కదలి రా.. అంటే చాలు. ఎక్కడా లేని ఊపు వస్తుంది. నాకు అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లు లేరు. కానీ ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది కార్యకర్తలను ఇచ్చారు. కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటామని లోకేష్ అన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
టీడీపీ-జనసేన కలిసికట్టుగా పోరాడాలి. మన మధ్య చిచ్చుపెట్టేందుకు వైకాపా పేటియం బ్యాచ్ కుట్ర లు చేస్తోంది. అప్రమత్తంగా ఉండాలి. ఒకే నినాదంతో అందరం ఉండాలి. సైకో పోవాలి-సైకిల్ రావాలి. బాబు సూపర్-6 హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బాగా పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తాం. బాబు ష్యూరిటీ-భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమంలో బాగా పనిచేసిన వారికి ఉత్తమ కార్యకర్త అవార్డులు ఇస్తున్నాను. సీనియర్లు, జూనియర్లను సమానంగా గౌర విస్తా. పనిచేసేవారినే ప్రోత్సహిస్తా, పదవులు ఇస్తాం.
కాగా పార్టీ క్యాడర్‌తో లోకేష్ ప్రత్యేకంగా సమావే శమై రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడం,బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దిశా నిర్దేశం చేశారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ అమలులో మెరుగైన పనితీరు కనబర్చిన కార్యకర్తలకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
తగ్గేదే లేదు
నాపై 22 కేసులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు, హత్యాయత్నం కేసులు పెట్టారు. ఆనాడే చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదని. చంద్రబాబుని అక్రమంగా 53 రోజులు నిర్బంధించారు. రాజమండ్రి జైలును కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబునాయుడు. మొదటిసారి ఆయనను చూసేందుకు వెళ్లినప్పుడు ఆ శిలాఫలకం చూసి చాలా బాధపడ్డా. చేయని నేరానికి జైలుకు పంపారు. మొదల రూ. 3వేల కోట్ల అవినీతి అన్నారు, తర్వాత 270 కోట్లని అన్నారు. ఇప్పుడు 27 కోట్లు అని అంటున్నారు. అది కూడా పార్టీ అకౌంట్ లోకి వచ్చిందని చెబుతున్నారు. ప్రజల తరపున పోరాడుతున్న టీడీపీ కార్యకర్తలపై, జనసైనికులపై దొంగ కేసులు పెడుతున్నారు. చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవనన్న. ధైర్యంగా ఉండాలని, అండగా నిలబడతానని చెప్పారు. ఆనాడు పవనన్న ప్రత్యేక విమానంలో రావాలంటే పర్మిషన్ ఇవ్వలేదు. రోడ్డు మార్గంలో వస్తుంటే బోర్డర్ లో 3 గంటలు ఆపేశారు. అలాంటి వారికే రక్షణ లేకపోతే ఇక మన పరిస్థితి ఏమిటి?
స్టాన్‌ఫోర్డ్ వర్శిటీలోనూ..
వైట్ కాలర్ నేరస్థుడు జగన్. స్టాన్‌ఫోర్డ్ యూని వర్సిటీలో కూడా జగన్ కేసులపై కేసు స్టడీ ఉంది. ఇలాంటివారిని ఎలా ఎన్ను కుంటున్నారో అనే చర్చలు కూడా విదేశాల్లో నడుస్తున్నాయి. మాట ఇస్తే నిలబెట్టు కుంటానంటున్నాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం,వారంలో సీపీఎస్ రద్దు,2.30 లక్షల ఉద్యోగాల భర్తీ, ఏడాదికి 6500కానిస్టేబుల్ పోస్టుల భర్తీఏమైంది? 45ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ హామీ ఏమైంది? ముఖ్యమంత్రి అయిన ఆరునెలల కు హామీలు అమలుచేస్తే చిత్తశుద్ధి అన్నారు, చివరి ఆరు నెలల్లో చేస్తే మోసం అన్నారు. ఇప్పుడు ఎన్నికల ముందు గ్రూప్ – 2 నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిని ఏమంటారు? లక్షలు వెచ్చించి నిరుపేదలు తమ పిల్లలను చదివించారు. కేవలం 897 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. వాటికోసం 5లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో చూడండి. టీడీపీ-జనసేన ప్రభుత్వంలో ప్రతి ఏడాది డీఎస్సీ వేస్తాం, క్రమం తప్ప కుండి ఉద్యోగాలు భర్తీచేస్తామని లోకేష్ హామీఇచ్చారు.