అమరావతి(చైతన్యరథం): ఎన్నికల ముందు టీడీపీ అభ్యర్థులే లక్ష్యంగా సైకో జగన్ కుట్రలు పన్నుతున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను తీసుకెళ్లింది పోలీసులా? సైకో జగన్ తాడేపల్లి ముఠానా అని అనుమానం కలుగుతోందన్నారు. టెర్రరిస్టుని అరెస్టు చేసినట్టు ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు? శరత్‌కి ఏమైనా హాని తలపెట్టారా అనే అనుమానాలు కలుగుతు న్నాయి. ఈ అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఎన్నికల్లో ఓటమి తప్పదని, బలమైన టీడీపీ నేతలే లక్ష్యంగా సైకో జగన్ పన్నుతున్న కుతంత్రాలను తిప్పికొడతాం. శరత్‌ని తక్షణమే విడుదల చేయాలి. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులపై న్యాయ పోరా టం చేస్తాం. జగన్ దిగిపోయే ముందైనా ఇటువంటి సైకో చేష్టలు ఆపకపోతే, చాలా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని లోకేష్ హెచ్చరించారు.