- బహిరంగ మార్కెట్లో ధరల బాదుడు
- రేషన్ షాపుల్లో పప్పు, పంచదార దూరం
అమరావతి: పండుగనాడు పిండి వంటలు, కొత్తబట్టలతో కళకళలాడాల్సిన గ్రామాలు జగనాసురుడి దుర్మార్గాలతో నిస్తేజంగా తయారయ్యాయని టీడీపీ నాయకురాలు, మాజీమంత్రి పరిటాల సునీత విమర్శించారు. పేదల్ని పస్తులుంచి ప్యాలెస్‌లో జగన్‌రెడ్డి సరదాలు చేస్తున్నారన్నారు. పెరిగిన ధరలతో పేద లు పండగ చేసుకోవాలంటే బెంబేలెత్తే పరిస్థితి నెలకొందని సోమవారం ఒక ప్రకటనలో సునీత పేర్కొన్నారు. కూరగా యల ధరలు మండిపోతున్నాయి. నిత్యా వసర వస్తువుల ధరలు వణికిస్తున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణపై గానీ, పేదలకు సబ్సిడీపై అందించే విషయంపై గానీ కనీసం దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. చివరికి రేషన్ షాపుల్లో బియ్యం తప్ప ఇంకేమీ ఇవ్వకుండా కోత పెట్టారు. పప్పు, పంచధార, గోధుమలు, గోధుమ పిండి, వంటనూనె లాంటి అన్ని సరుకులకూ కోత పెట్టారు. గతంలో రేషన్ షాపుల్లో 8రకాల సరుకులిచ్చి పేదల కు అండగా నిలిచాం. నేడు నిత్యావసరా లపై నియంత్రణ లేదు. రేషన్ షాపుల్లో ఏకంగా సరుకులే లేవు. ఒకవైపు ఉపాధి దూరం చేసి, మరోవైపు నిత్యావసరాల ధరల మోత మోగిస్తూ పేదల్ని దగా చేశా రు. కడుపు నింపుకోవాలంటే ప్రజలు వలసలు వెళ్లాల్సిన దుస్థితి కల్పించారు. ధరలు దిగిరావాలంటే.. జగన్‌రెడ్డి దిగి పోవాలని రాష్ట్రమంతా నినదిస్తోందని సునీత అన్నారు.