ఎమ్మిగనూరు నియోజకవర్గం గాజులదిన్నెకు చెందిన మత్స్యకారులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
గతంలో మాకు సబ్సిడీపై వలలు, ఫైబర్ తెప్పలు, బోట్లు ఇచ్చేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో అవేమీ ఇవ్వడం లేదు.
వర్షాలు వచ్చినపుడు గాజులదిన్నె చెరువులో చేపలు కొట్టుకుపోతున్నాయి. ఎటువంటి నష్టపరిహారం ఇవ్వడం లేదు.
సముద్రాలు, నదుల్లో చేపలు పట్టే మత్స్యకారులకు మాదిరిగానే మాకు కూడా భరోసా కల్పించాలి.
ప్రమాదవశాత్తు చనిపోతే బీమా సౌకర్యం కల్పించాలి.
యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ…
సాంప్రదాయంగా చేపలవేటపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల పొట్టగొట్టే విధంగా జగన్ ప్రభుత్వం 217 జిఓ తీసుకువచ్చింది.
ఈ జిఓ ద్వారా మత్స్యకారుల చేపలచెరవులను వైసిపి నేతలు స్వాధీనం చేసుకుంటున్నారు.
టిడిపి అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకు గతంలో మాదిరి సబ్సిడీపై వలలు, బోట్లు, ఫైబర్ తెప్పలు అందజేస్తాం.
సముద్రం, నదుల్లో మత్స్యకారులకు మాదిరిగానే చేపలవేటపై ఆధారపడిన మత్స్యకారులందరికీ పథకాలను వర్తింపజేస్తాం. ప్రమాదబీమా సౌకర్యం కల్పిస్తాం.