అమరావతి: వైసీపీ అరాచక పాలనను తరిమికొట్టి రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించాలన్న లక్ష్యంతో టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజల మద్దతుతో విజయవంతమైందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ నెల 20న విజయనగరం జిల్లా పోలిపల్లిలో యువగళం ముగింపు సభ నిర్వహిస్తున్నాం. ఈ సభకు హాజరయ్యేందుకు ప్రజలు, కార్యకర్తలు, అభిమానుల కోసం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 5 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశాం. ఈ రైళ్లు మ్గళవారం (19 తేదీన) ఆయా ప్రాంతాల నుంచి ప్రారంభమవుతాయి. ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని పెద్ద ఎత్తున సభకు హాజరై విజయవంతం చేయాలని అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో కోరారు.
రైళ్ల వివరాలు:
- చిత్తూరు నుంచి బయలుదేరే రైలు ఉదయం 11.00 కి స్టార్ట్ అవుతుంది. ట్రైన్ నెంబర్-00700/00701
ఉదయం 11.30 కి పాకాల లో ఆగుతుంది.
మధ్యాహ్నం 1.45 కి రేణిగుంట లో ఆగుతుంది.
- తిరుపతి నుంచి బయలుదేరే రైలు మధ్యాహ్నం 2.00 కి స్టార్ట్ అవుతుంది. ట్రైన్ నెంబర్-00702/00703
మధ్యాహ్నం 3.00 కి శ్రీకాళహస్తిలో ఆగుతుంది.
మధ్యాహ్నం 3.30 కి వెంకటగిరిలో ఆగుతుంది.
సాయంత్రం 4.00 కి గూడూరులో ఆగుతుంది.
- రైల్వే కోడూరు నుంచి బయలుదేరే రైలు ఉదయం 7.00కి స్టార్ట్ అవుతుంది. ట్రైన్ నెంబర్ 00704/00705
రాజంపేటలో ఉదయం 7.30 కి ఆగుతుంది.
కడప లో ఉదయం 8.15కి ఆగుతుంది.
ప్రొద్దుటూరు లో ఉదయం 9.10 కి ఆగుతుంది.
జమ్మలమడుగు లో ఉదయం 9.40కి ఆగుతుంది.
- ధర్మవరం నుంచి బయలుదేరే రైలు ఉదయం 7.00 కి స్టార్ట్ అవుతుంది. ట్రైన్ నెంబర్ 00706/00707
అనంతపురం లో ఉదయం 7.45 కి ఆగుతుంది.
గుత్తి లో ఉదయం 9.15 కి ఆగుతుంది.
- నెల్లూరు నుంచి బయలుదేరే ట్రైన్ రాత్రి 8.00 కి స్టార్ట్ అవుతుంది. ట్రైన్ నెంబర్-00712/00713
కావలి లో 8.30 కి ఆగుతుంది
ఒంగోలు లో 9.30కి ఆగుతుంది.