ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ విరాళం అందజేశారు. ఇరు రాష్ట్రాలకు రూ. 10 లక్షల చొప్పున విరాళం ఇచ్చారు. ఈ విరాళాల తాలూకు చెక్కులను ఆయన బుధవారం ఢల్లీిలో ఏపీ, తెలంగాణ భవన్ల రెసిడెంట్ కమిషనర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమకు తోచిన సహాయం చేస్తే బాగుంటుందన్నారు. సమాజం కోసం అందరూ ముందుకు వచ్చి ఆదుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా తెలుగు రాష్ట్రాలను ఉదారంగా ఆదుకోవాలని ఎన్వీ రమణ కోరారు.