- ప్రజావినతుల కార్యక్రమంలో బాధితుడి ఫిర్యాదు
- నీరు నిలిచి పంట నష్టం జరిగిందని ఆవేదన
- అర్జీలు స్వీకరించిన విద్యుత్ మంత్రి గొట్టిపాటి
మంగళగిరి(చైతన్యరథం): వైసీపీ మూకల భూకబ్జాలు, ఆరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన భూమి ఆక్రమించాడని శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల కార్యక్రమంలో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వి.పూర్ణచంద్రరావు ఫిర్యాదు చేశాడు. భూమి ఆక్రమిం చడం వల్ల మిగిలిన వ్యవసాయ భూమిలో వర్షపు నీరు బయటకు వెళ్లే దారి లేక పంట నష్టం జరిగిందని వాపోయాడు. విచారించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి వినతులను స్వీకరించారు. అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఓ మహిళ తన కుమార్తె స్కూలుకు వెళ్లి రావడానికి దూరమవుతుందని మంత్రి దృష్టికి తీసుకు రావడంతో వెంటనే స్పందించి ఎన్‌ఆర్‌ఐ ఆధ్వర్యంలో సైకిల్ కొనుగోలు నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు.
` మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తన గ్రామ పర్యటనలో తన ఇంటిపై తెలుగుదేశం జెండా కట్టినందుకు ఆయన అనుచరులు తనపై రౌడీషీటర్ కేసు ఓపెన్ చేయించి గత ఐదేళ్లుగా తనను వేధింపులకు గురిచేశారని అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డి పల్లె మండలం పందిళ్లపల్లి గ్రామానికి చెందిన కొమ్మెర గంగాధర ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై ఉన్న రౌడీషీట్‌ను ఎత్తివేయాలని వినతిపత్రం ఇచ్చారు.
` తన తండ్రి నుంచి వచ్చిన భూమిని ఎ.హరిప్రసాద్, ఎ.నవీన్, ఎ.సతీష్, బి.కిరణ్, ఎ.అనిత, ఎం.ప్రసన్న అనే వ్యక్తు లు దౌర్జన్యంగా బదిరించి ఇంటిని కూలగొట్టి ఆక్రమించారు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన కూడా ప్రయోజనం లేకుండా పోయింది.. తన భూమిని ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా ఆర్.సి.పురం మండలం చిత్తట్టూరు గ్రామానికి చెందిన పి.భూపతి ఫిర్యాదు చేశారు.
` గర్నేటి సాంబశివరావు అనే వ్యక్తి తన వద్ద రూ.3 లక్షలు తీసుకుని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని అతని వద్ద నుంచి తనకు రావాల్సిన డబ్బులను ఇప్పించాలని గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం నెక్కల్లు గ్రామానికి చెందిన యర్రమాసు సీతారత్నం వినతిపత్రం అందజేశాడు.
` చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం అల్లాగుంట గ్రామస్తులు సమస్యను వివరిస్తూ గ్రామంలోని 8 సెంట్ల పోరంబోకు భూమిని వి.దానియేలు, వి.రవీంద్రకుమార్ అనే వ్యక్తులు ఆక్రమించారు. వారి నుంచి ఆ భూమిని విడిపించి పేదలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
` తనకు ఉన్న ఎకరా భూమిని కాకర గొంతెమ్మ అనే మహిళ బొల్లం శారదగా పేరు మార్చుకుని రెవెన్యూ అధికా రులతో కుమ్మక్కై ఆక్రమించారని అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం దొర్లపూడి గ్రామానికి చెందిన బొల్లం వరహా లమ్మ ఫిర్యాదు చేసింది.
` తమ గ్రామానికి 2017-18లో మంజూరైన సీసీ రోడ్డును వైసీపీ ప్రభుత్వంలో వేయకుండా ఆపివేశారు..గత ప్రభుత్వంలో నిలిచిపోయిన రోడ్లను తిరిగి పూర్తిచేయాలని నెల్లూరు జిల్లా ఉదయగిరి వరికుంటపాడు గ్రామానికి చెందిన కాకొల్లు రమణయ్య వినతిపత్రం అందజేశారు.
` వైసీపీ నాయకుల అండతో మైనం లలితకుమారి, మైనం ప్రవీణ్, మైనం సుమబిందు తన తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి అక్రమంగా భూమిని కబ్జా చేశారని పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన ఎం.రంగారావు ఫిర్యాదు చేశారు. వారిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.
` ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం తోకపల్లి గ్రామానికి చెందిన ఎం.తిరుమలయ్య యాదవ్ సమస్యను వివరిస్తూ తనకు ఉన్న 50 సెంట్ల భూమిని తహసీల్దార్ సహకారంతో అదే గ్రామానికి చెందిన నరాల కాశిరెడ్డి, చేతుల వెంకటేశ్వర్లు అనే వ్యక్తులు అక్రమంగా ఆన్‌లైన్‌లో వారి పేర్ల మీద ఎక్కించుకుని భూమిని కబ్జా చేశారు.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.