జగన్ అవినీతి వల్లే రూ.1,29,000 కోట్ల విద్యుత్ భారం
విద్యుత్ ఛార్జీల పెంపు పాపం.. జగన్‌రెడ్డిదే
నువ్వే చార్జీలు పెంచి.. నువ్వే ధర్నాలు చేయడం.. ప్రజలను మోసం చేయడం కాదా..?
నెం జగన్ అవినీతి, అసమర్థతలతో జరిగిన నష్టం మొత్తం (రూ. కోట్లలో)
1. వినియోగదారులపై ఛార్జీల భారం 32,166
2. విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు 49,596
3. వీటీపీఎస్, కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో జాప్యంతో నష్టం 12,818
4. పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు జాప్యంతో నష్టం 4,737
5. స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో నష్టం 2,691
6. ఏడాదికి 7000 మెగావాట్ల సోలార్ పవర్ (సెకి) నష్టం 3,850
7. అప్పులపై వడ్డీ భారం 10,892
8. ఏపీ డిస్కంలు, ఏపీపీడీసీఎల్ నిర్వహణా వైఫల్యాలతో నష్టం 9,618
9. జెన్ కో ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం వల్ల నష్టం 3,135
మొత్తం రూ.1,29,503 కోట్లు
ఆధారం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శ్వేతపత్రం
బిడ్డ చచ్చినా పురిటి కంపు పోలేదన్న చందంగా నరహంతక జగన్ రెడ్డి పాలన అంతమైపోయినా దాని పర్యవసానాలు రాష్ట్ర ప్రజలను, ప్రభుత్వాన్నీ వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ సారథి సీఎం చంద్రబాబు విద్యుత్ కష్టాలను గట్టెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. అసలు రాష్ట్రంలో 20 వేల మెగా వాట్ల విద్యుత్ సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్లు చంద్రబాబు పాలనలో నిర్మించినవే. ఇందువల్లే రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వగలుగుతున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, కొన్ని బీసీ కులవృత్తిదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వగలుగుతున్నారు. ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ ఇవ్వగలుగుతున్నామంటే అది చంద్రబాబు నాయుడి విజన్ వల్లే సాధ్యమవుతోంది. 22.5 మిలియన్ యూనిట్ల లోటుతో 2014లో చంద్రబాబు పాలన ప్రారంభమయ్యింది. 2019లో టీడీపీ ప్రభుత్వం మిగులు విద్యుత్‌ను జగన్ రెడ్డి చేతిలో పెట్టారు. మిగులు విద్యుత్‌తో పాలన ప్రారంభించి ఇతర రాష్ట్రాలకన్నా ఎక్కువ వనరులున్న రాష్ట్రంలో నేడు విద్యుత్‌ను పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే స్థాయికి తీసుకువచ్చిన ఘనత ముమ్మాటికీ జగన్ రెడ్డి అవినీతి, కక్షసాధింపు విధానాలే కారణం. నక్కల కుతంత్రాల గురించి చందమామ కథల్లో చదివాం కానీ, కొంతమంది మనుషులు కూడా అలాంటి నక్కలకు ఏమాత్రం తీసిపోరని ఏపీ ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. గత వైసీపీ హయాంలో 9 సార్లు కరెంటు చార్జీలు పెంచారు. ప్రజల నుంచి ఐదేళ్ళలో రూ.32000 కోట్లు ముక్కు పిండి వసూలు చేశారు.
10వ సారి పెంచడానికి కూడా తానే అనుమతి తెచ్చుకున్న మాజీ సీఎం జగన్ రెడ్డి, ఇప్పుడు తానే ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉంది. మొన్న రైతుల కోసం తగుదునమ్మా అని నిరసన దిగాడు జగన్ రెడ్డి. దానికి అదరణ కరవయ్యింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. జగన్ రెడ్డి పాలనలోనే మైలవరం సోలార్ ప్లాంట్లపై దాడిచేసి ధ్వంసం చేశారు. చట్టవిరుద్ధంగా పీపీఏలను రద్దు చేయడం వల్ల 7 వేల మెగావాట్లు తక్కువ రేటుకు వచ్చే విద్యుత్ ఉత్పత్తి కోల్పోవాల్సి వచ్చింది. అలా కాకుండా వారిని ప్రోత్సహించి ఉంటే వారి అనుభవంతో మరో 10 వేల మెగావాట్ల ప్లాంట్లను ఈపాటికి ఉత్పత్తిలోకి తెచ్చి ఉండేవారు. దీని వల్ల రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో యువతకు ఉద్యోగాలు రావడమే కాకుండా రాష్ట్రం మిగులు విద్యుత్‌తో ఉండేది. ఇతర రాష్ట్రాలకు అమ్ముకొని లాభపడి ఉండేది మనరాష్ట్రం. పోలవరం జలవిద్యుత్ కేంద్రం 2021 నాటికి పూర్తి చేయకపోవడం వల్ల రూ.4,737 కోట్ల నష్టం జరిగింది. జెన్‌కో విద్యుత్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడానికి విజయసాయిరెడ్డి సరఫరా చేసిన నాసిరకం బొగ్గు కారణం, నాణ్యమైన బొగ్గు తగినంత నిల్వ పెట్టుకోనందుకు విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. విద్యుత్ సంస్థలపై రూ.49 వేల కోట్లకు పైగా అప్పు చేసినా ఒక కొత్త విద్యుత్ ప్లాంటును కూడా నిర్మించలేదు. నిర్మాణం పూర్తి అయి విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న కృష్ణపట్నం, వీటీపీఎస్‌లను సకాలంలో ప్రారంభించలేదు. దీని దీనిని సాకుగా చూపి కావాలని విద్యుత్ కొరతను సృష్టించారు. కమీషన్ల కోసం బహిరంగ మార్కెట్‌లో అధిక రేట్లకు విద్యుత్‌ను కొనుగోలు చేయడం వల్ల రూ.2700 కోట్లు నష్టం వచ్చింది. ట్రాన్స్‌ఫార్మర్లు, స్మార్ట్ మీటర్ల వంటి విద్యుత్ పరికరాలను కమీషన్లకు కక్కుర్తి పడి అధికరేట్లకు కొనుగోలు చేయడం వల్ల వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది.
కూకట్‌పల్లిలో హిందూజాలకు చెందిన చెందిన పది ఎకరాల భూమిని జగన్ బినామీలు కొట్టేశారు. అందుకు బదులుగా విద్యుత్ ఉత్పత్తి చేయకపోయినా, ఈఆర్సీ వద్దన్నా రూ. 1400 కోట్లు హిందూజాలకు ధారాదత్తం చేశారు. అధిక వడ్డీ రేట్ల వల్ల రూ.10,892 కోట్లు నష్టం వచ్చింది. సెకి ఒప్పందంలో జగన్ రూ. 1750 కోట్లు లంచాలు పుచ్చుకున్నారని అమెరికా కోర్టులో కేసు నమోదు అయ్యింది. ఈ సెకి ఒప్పందం వల్ల విద్యుత్ సంస్థలకు ఏడాదికి రూ. 3850 కోట్లు, మొత్తం 30 ఏళ్లకు లక్ష కోట్లు వినియోగదారులపై భారం పడుతోంది. ఇలా జగనే విద్యుత్ చార్జీలు పెంచి ఆయనే ధర్నాలు చేయడం ప్రజలను మోసగించడం కాదా?, జగన్ రెడ్డి పాలనలో కేవలం విద్యుత్ రంగానికే రూ.1,29,000 కోట్ల మేర నష్టం వాటిల్లింది. పాపాలన్నీ జగన్ అండ్ కో చేసి కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. ఇప్పుడు ఏమీ తెలియని నంగనాచిలా జగన్ రెడ్డి కొత్త నాటకాలు అడుతున్నారు. మళ్ళీ చెప్తున్నాం. ఈ పాపం నువ్వు చేసిందే. నువ్వు దోచుకోవటానికి విద్యుత్‌ను అధిక రేటుకి కొనుగోలు చేసి ఆ భారాన్ని ప్రజల మీద వేశావ్. ఇప్పుడు నువ్వే ఏమీ తెలియనట్టు నిరసనలు అంటూ మొసలి కన్నీరు కార్చడానికి సిద్ధమయ్యావు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం, విద్యుత్ చార్జీలు పెంచాలని కొత్తగా ఎక్కడా ప్రతిపాదిన చేయలేదు. అది ఆయనకున్న కమిట్మెంట్.