- ఎంప్యానల్ సంస్థల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
- న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలోని మైనార్టీల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణబద్ధంగా చర్యలు తీసుకుంటుందని న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్ తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో డీఎస్సీ-2024ను కూటమి ప్రభుత్వం నిర్వహించబోతుందని తెలిపారు. ఇందులో భాగంగా డీఎస్సీకి హాజరయ్యే మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మైనారిటీ విద్యార్థులైన ముస్లింలు, క్రైస్తవులు (బీసీ-సీ), సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు తదితరులకు ఉచిత కోచింగ్‌ను అందించడానికి అర్హులైన సంస్థలు, అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు మంత్రి తెలిపారు.
మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా ప్రఖ్యాత ప్రైవేట్ సంస్థలతో ఎంప్యానెల్ చేయడం ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడిరచారు. ఇందుకోసం రాష్ట్రంలోని ఆసక్తిగల సంస్థలు, అభ్యర్థులు వెబ్సైట్: షషష.aజూషవసఎఎషస.శీతీస్త్ర పోర్టల్ ద్వారా లేదా డైరెక్టర్ కార్యా లయం, మైనారిటీల విద్యాభివృద్ధి కేంద్రం, స్వాతి థియేటర్ ఎదురు, భవానీపురం, విజయవాడ-520012కు డిసెంబరు 10వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచిం చారు. ఇతర వివరాలకు 0866-2970567, ఈ-మెయిల్ ఐడీ: షవసఎaజూ2017ఏ స్త్రఎaఱశ్రీ.షశీఎ సంప్రదించవచ్చని తెలిపారు. రాష్ట్రంలో మైనార్టీల అభివృద్ధికి, సంక్షే మానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.