- సీనరేజీతో వచ్చే రూ.264 కోట్లను కూడా రద్దు చేశాం
- మద్యం షాపుల్లో నిబంధనలు ఉల్లంఘించకుండా చర్యలు
- రిటైర్డ్ జడ్జితో టెండరు కమిటీ వేసి ధరలను నిర్ణయిస్తాం
- త్వరలో గీత కార్మికులకు షాపులకు దరఖాస్తుల ఆహ్వానం
- ఐదేళ్లు ఇసుక, మద్యంలో దోపిడీ చేసి జగన్‌రెడ్డి నీతి కబుర్లా?
- అక్రమ తవ్వకాలతో ఇసుకలో వెయ్యి కోట్లు దోచుకున్నారు
- ఎన్‌జీటీ రూ.100 కోట్లు జరిమానా విధించింది నిజం కాదా?
- కల్తీ మద్యంతో దోచుకుని లక్షల మంది ప్రాణాలు తీయలేదా?
- గంజాయి, డ్రగ్స్ ఆదాయం కోసం బీరు రేట్లు పెంచి నీతికబుర్లా?
- మీ ప్యాలెస్‌కు ఆదాయమే తప్ప రాష్ట్రానికి ప్రయోజనం లేదు
- గనులు భూగర్భ వనరులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర
మంగళగిరి(చైతన్యరథం): కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పారదర్శ కంగా ఉచిత ఇసుక అమలు చేస్తున్నామని గనులు భూగర్భ వనరులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎద్దుల బండికి మాత్రమే ఉచిత ఇసుక రవాణా ఉండేది..మా ప్రభుత్వంలో ట్రాక్టర్‌కు అవకాశం ఇవ్వడం జరిగిందని వివ రించారు. ఇసుక, మద్యంలో దోపిడీ జరిగిందని జగన్‌రెడ్డి మొసలి కన్నీరు కారుస్తు న్నారని ధ్వజమెత్తారు. గత ఐదేళ్లు అక్రమ ఇసుక ద్వారా రూ.1000 కోట్లు జగన్‌రెడ్డి దోచుకున్నారని మండిపడ్డారు. నేడు కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ఉచిత ఇసుక ప్రజలకు అందిస్తున్నట్టు చెప్పారు. కావాలంటే జగన్‌రెడ్డి కూడా స్వయంగా ట్రాక్టర్ వేసుకుని ఉచిత ఇసుకను తాడేపల్లి ప్యాలెస్‌కు తీసుకెళ్లవచ్చని తెలిపారు. గత ఐదేళ్లు మైనింగ్ విధానాన్ని కూడా భ్రష్టు పట్టించిన మీరు భవన నిర్మాణ కార్మికులను సర్వ నాశనం చేశారు. వైసీపీ హయాంలో తాడేపల్లి ప్యాలెస్‌కు ఆదాయం వచ్చిందే తప్ప రాష్ట్రానికి ఆదాయం రాలేదని ధ్వజమెత్తారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు చేయడం వల్ల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వైసీపీ నాయకులకు రూ.100 కోట్లు జరిమానా విధిం చడం నిజం కాదా? అని ప్రశ్నించారు.
వైసీపీ తొత్తులుగా పనిచేసిన కలెక్టర్లను కోర్టు లకు వెళ్లేలా చేసి సంజాయిషీ చెప్పుకునేలా చేశారు. కంటెంట్ ఆఫ్ కోర్టు కింద నోటీసులు ఇచ్చింది వాస్తవం కాదా? ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్‌తో సెమీ మెకానిజం పెట్టి కోట్ల రూపాయల ఇసుకను దోపిడీ చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. వైసీపీ చేసిన అనైతిక విధానాల వల్ల 130 రీచ్‌లు సీజ్ చేశారు. దీంతో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడి వందల మంది ఆత్మహత్యలు చేసుకు న్నారన్నారు. వైసీపీ చేసిన అరాచకాల వల్ల ఎన్జీటీ కఠినతరమైన నిర్ణయాలు తీసుకుం దని ఆ కారణంగా అన్నీ రీచ్‌లను తెరవలేకపోతున్నామని వివరించారు. 80 లక్షల టన్నుల ఇసుక ఉందని వైసీపీ అసత్యాలు చెబుతోంది. కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చే నాటికి 35 లక్షల టన్నుల మాత్రమే ఇసుక అందుబాటులో ఉంది. ఆన్‌లైన్ పోర్టల్‌లో ఏపీ శాండ్ మేనేజ్‌మెంట్ సిస్టం పెట్టి గ్రామ సచివాలయాల ద్వారా కూడా ఇసుకను అందిస్తున్నట్టు చెప్పారు. ఎనిమిది జిల్లాల్లో డీసెటిటేషన్ పాయింట్లను ప్రారంభించామని, సామాన్యుడికి ఉచిత ఇసుక చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కొన్ని జిల్లాల్లో అసలు రీచ్‌లు లేవని, సీనరేజ్ ద్వారా వచ్చే రూ.264 కోట్ల ఆదాయా న్ని కూడా రద్దు చేసి కేవలం నిర్వహణ చార్జీలు మాత్రమే తీసుకుంటున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అంతా పారదర్శకంగా చేస్తుందని, జగన్‌రెడ్డికి తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటామని హితవుపలికారు. రాబోయే కాలంలో ఏపీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగుతా యి. ఇంకా అతి తక్కువ రేటుకే ఇసుకను అందిస్తాం. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం అవ్వడానికి కారణం జగన్ రెడ్డి కాదా? మీ ధనదాహానికి ప్రజల రక్తాన్ని పీల్చి డబ్బులు దోచుకుంది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
కల్తీ మద్యంతో దోచుకుని నీతి కబుర్లు చెబుతారా?
ఏ రాష్ట్రంలో లేని విధంగా మద్యం నూతన పాలసీని పారదర్శకంగా అమలు చేస్తున్నాం. మీ స్వార్థం కోసం ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేసి సెబ్ పేరుతో అక్రమ మద్యం వ్యాపారానికి అడ్డులేకుండా చేసుకోవడం నిజం కాదా? మద్యం తయారీ నుం చి రిటైల్ అమ్మకాల వరకు అన్ని వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని ప్రభుత్వ షాపుల పేరుతో దోచుకున్నది నిజం కాదా? జగన్‌రెడ్డి విషపూరిత మద్యం వల్ల రాష్ట్రంలో లక్షల మందిపైగా ప్రాణాలు కోల్పోయారు. 40 లక్షల మంది అనారోగ్యం పాల య్యారు. ప్రభుత్వ షాపుల్లోనే ఎమ్మార్పీ ఉల్లంఘనలు 930 కేసులు నమోదు అయిన మాట వాస్తవం కాదా? 856 కల్తీ మద్యం కేసులు వైసీపీ హయాంలో నమో దు అయిన మాట వాస్తవం కాదా? ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నాన్ డ్యూటీ పెయిడ్ 20 కేసులు, మద్యం షాపుల్లో ఆర్థిక అవకతవకలపై 45 కేసులు.. రూ.2.63 కోట్ల అవినీతి జరిగిన మాట వాస్తవం కాదా? 2019-23 మధ్య 321 శాతం అక్రమ రవా ణా కేసులు నమోదు అయ్యాయి. గతంలో తెలంగాణకు రూ.4 వేల కోట్లు వ్యత్యాసం ఉంటే వైసీపీ పాలనలో 43 వేల కోట్లు వ్యత్యాసం ఉంది. గంజాయి, డ్రగ్స్ ఆదాయం పెంచుకోవడానికి బీర్లు రేట్లు పెంచిన..మీరు నీతి కబుర్లు చెబుతున్నారా?
త్వరలో గీత కార్మికులకు మద్యం షాపులకు దరఖాస్తులు
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఈఎన్‌ఏ పరీక్షలు ఆరు దశల నుంచి 13 దశలకు పెంచాం. పొరుగు రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా ఉన్న మద్యాన్ని ఏపీలో అందుబాటులో ఉంచేలా నూతన పాలసీ తీసుకొచ్చాం. రూ.99కే క్వార్టర్ మద్యం అందించే ప్రయత్నం చేస్తున్నాం. రిటైర్డ్ జడ్జితో టెండర్ కమిటీ వేసి ధరలను నిర్ణయించబోతున్నాం. కల్లు గీత కార్మికులకు కేటాయించిన 340 షాపులకు త్వరలోనే దరఖాస్తులు పిలుస్తాం. గతంలో మద్యం ధరలు ఇష్టం వచ్చినట్లు పెంచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో మద్యంలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేశాం. మద్యం ద్వారా జగన్మోహన్ రెడ్డి రూ. 1900 కోట్లు దోచుకున్నారు. అక్టోబరు 1 నుంచి 3,396 ప్రైవేట్ మద్యం షాపులకు టెండర్లు పిలవడం జరిగింది. 80,882 దరఖాస్తుల రూపంలో ప్రభుత్వానికి రూ. 1,797 కోట్లు అదాయం వచ్చింది. 16వ తేదీ నుంచి పార్టీలకతీతంగా ఈ ప్రక్రియ చేపట్టాం. టెండర్ కమిటీ విధానం వచ్చిన తరువాత రేట్లు రీస్ట్రక్చర్ చేయడానికి చర్య లు తీసుకుంటాం. నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుం డా చర్యలు తీసుకుంటున్నాం. బడులకు, దేవాలయాలకు 100 మీటర్ల లోపు మద్యం షాపులు ఉండకుండా చూసుకుంటాం. ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌ను కూడా బలోపేతం చేస్తాం. డీ ఎడిక్షన్ సెంటర్లు, రిహ్యాబిటేషన్ ద్వారా అవగాహన కల్పిస్తాం. లాటరీల్లో ఎక్కడా తప్పు జరగలేదు. వైసీపీ నాయకులకు కూడా షాపులు వచ్చాయి. చాలా పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టాం. జగన్ ఆదాయం పోయింది కాబట్టి ఇష్టాను సారంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై బురదజల్లితే మీరే నష్టపోతారని హితవుపలికారు.