- అక్టోబరు 1 నుంచి నూతన మద్యం విధానం
- అంతర్జాతీయ మద్యం బ్రాండ్లు అందుబాటులోకి తెస్తాం
- గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు
- ఎంఎన్‌సీ డిస్టిలరీస్ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో జగన్‌రెడ్డి తెచ్చిన కల్తీ మద్యం బ్రాండ్లు మొత్తా న్ని నిషేధించి మెరుగైన పాలసీతో ముందుకు వస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరు లు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సచివాలయంలోని తన చాంబర్‌లో గురువారం కాన్ఫెడరేషన్ ఇండియా ఆల్కహాలిక్ బెవరేజెస్ కంపెనీస్, గ్రెయిన్ బేస్డ్ డిస్టిలరీస్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మల్టీ నేషనల్ కంపెనీలు ఉత్పత్తి చేసే మద్యాన్ని అందుబాటులో ఉంచేలా చూడాలని కంపెనీ ప్రతినిధులు విన్నవించినట్లు మంత్రి తెలిపారు. అదే సమయంలో గ్రెయిన్ బేస్డ్ డిస్టిలరీలు ఉత్పత్తి చేసే మద్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం కల్పించాలని, ముడి సరుకు అందించడంలో కూడా ప్రభుత్వం నుంచి సహకారం కావాలని కోరారు. అక్టోబ రు 1 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తుందని, కల్తీ మద్యం, పిచ్చి బ్రాండ్ల నుంచి విముక్తి కల్పిస్తామని తెలిపారు. ప్రజలు కోరుకుంటున్న బ్రాండ్లు అందుబాటులోకి తెచ్చి ధరలు కూడా నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.