– మేనిఫెస్టో బైబిల్ అన్నాడు.. మద్యనిషేధ హామీని తుంగలో తొక్కాడు
– నవరత్నాల్లో ఒక రత్నమని ప్రజల్ని నమ్మించి, దోపిడీ
– ఫుడ్ డెలివరీ తరహాలో మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు
– దోపిడీ కోసమే జగన్ మద్యం ధరలు పెంచుతున్నాడు
– నాసిరకం మద్యంతో నాలుగేళ్లలో 35వేల మంది పేదల ప్రాణాలు తీశాడు
అమరావతి: జగన్మోహన్‌రెడ్డి నోరు పెద్ద అబద్ధాల పుట్ట.. ఆయన నోటినుంచి అబద్ధం తప్ప మరోటి రాదు.. ప్రజల్ని మాయ మాటలతో మోసగించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని టీడీపీ రాష్ట్ర అధ్య క్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. గతం లో ప్రతిపక్షనేతగా టీడీపీ ప్రభుత్వంపై, చంద్రబాబు పాలనపై విషప్రచారంచేసి, లెక్కకు మిక్కిలి హామీలిచ్చి న జగన్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కి, తన చేతగానితనం.. అసమర్థతను కప్పిపుచ్చేం దుకు టీడీపీపై, చంద్రబాబుపై నీతిమాలిన ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ జాతీ య కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాటాడుతూ 2019 ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి మద్యాన్ని నిషేధిస్తానని ప్రచారం చేశాడు.. చంద్రబాబు ప్రభుత్వం మద్యాన్ని ఏరులై పారిస్తోందని.. విచ్చలవిడి గా బెల్టు షాపులు నిర్వహిస్తోందని.. టీడీపీ ప్రభుత్వమే దోసిళ్లతో మద్యం తాగిస్తోందని ఊరువాడా తిరిగి విష ప్రచారం చేశాడన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కూడా తన మేనిఫెస్టో పత్రం పట్టుకొని అది తనకు బైబిల్.. ఖురాన్ అని దాన్ని తూచా తప్ప కుండా అమలుచేస్తానని ప్రగల్భాలు పలికాడు. జగన్ బాటలోనే అతని పార్టీ నేతలు..మంత్రులు కూడా వైసీపీ మేనిఫెస్టోపై ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. చంద్ర బాబు బెల్టుషాపులతో మద్యం విక్రయిస్తున్నాడన్న పెద్ద మనిషి.. తాను ముఖ్యమంత్రి అయ్యాక ఏకంగా మద్యా న్ని తన పార్టీ వారితో డోర్ డెలివరీ చేయిస్తున్నాడని అచ్చెన్నాయడు దుయ్యబట్టారు.
జగన్ తన మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో ప్రధాన మైనది దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తానని చెప్పడం. కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతోందని.. మానవ సం బంధాలు మద్యం మహమ్మారితో ధ్వంసం అవుతున్నా యని.. దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తానని..కేవలం స్టార్ హోటళ్లలో తప్ప ఎక్కడా మద్యం లేకుండా చేస్తా నని గొంతు చించుకొని మరీ ఊదరగొట్టాడు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక మద్య నిషేధం ఊసే ఎత్తకుం డా నకిలీ మద్యాన్ని అధికధరకు అమ్మిస్తూ పేదల జీవి తాలు రోడ్డున పడేశాడు. బుద్ధి ఉన్నవాడు ఎవడూ చంద్రబాబులాగా మద్యాన్ని అమ్మడని ప్రతిపక్షనేతగా చెప్పిన జగన్‌రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక ఏ బుద్ధిలేని తనంతో రాష్ట్ర వ్యాప్తంగా కల్తీమద్యం అమ్మకాలు సాగి స్తున్నాడు? (ప్రతిపక్షనేతగా జగన్‌రెడ్డి టీడీపీ ప్రభుత్వం పై నిందలేస్తూ మద్యంపై మాట్లాడిన వీడియోలను ఈ సందర్భంలో అచ్చెన్నాయుడు విలేకరులకు చూపించా రు) తెలుగుదేశం ప్రభుత్వంలో బెల్టు షాపులు ఉన్నా యన్న పెద్దమనిషి.. తన పాలనలో ఏకంగా మద్యాన్ని డోర్ డెలివరీ చేసే స్థాయికి మద్యం విక్రయాలు పెంచా డు. సినిమా హాళ్ల వద్ద బ్లాక్ టిక్కెట్స్ అమ్మే దానికంటే దారుణంగా జగన్‌రెడ్డి ఇంటింటికీ తన పార్టీ వాలంటీర్ల తో నాసిరకం మద్యం సరఫరా చేయిస్తున్నాడు. రాష్ట్రం లో జరుగుతున్న నాసిరకం మద్యం వ్యాపారానికి కర్త.. కర్మ… క్రియా జగన్‌రెడ్డే. కల్తీ మద్యం తయారు చేయిం చేది జగన్‌రెడ్డే.. దాన్ని తిరిగి విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ అమ్మిస్తున్నది తానే.వైసీపీ ప్రభుత్వం అమ్ముతున్న నాసి రకం మద్యం వల్ల రాష్ట్రంలోని పేదలు కాలేయ, హృద్రోగ, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో ఆసు పత్రులపాలై బతుకుజీవుగా అని రోదిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
బడుగు, బలహీనవర్గాల వారినే ఎక్కువగా బలిచేస్తున్నాడు
ఈ ముఖ్యమంత్రి నోరుతెరిస్తే నాఎస్సీలు.. నా ఎస్టీ లు.. నా బీసీలు.. నా మైనారిటీలు అంటాడు. లోలో పలేమో తన దోపిడీ..దుర్మార్గాలతో అదే వర్గాలను బలి తీసుకుంటున్నాడు. జగన్‌రెడ్డి కల్తీ మద్యానికి ఎక్కు వగా బలైపోతున్న వారిలో దళితులే ముందువరుసలో ఉన్నారు. తరువాతి స్థానాల్లో బీసీలు, మైనారిటీలు ఉన్నారు. నిత్యం రెక్కల కష్టం చేయడం.. వచ్చిన అర కొర సొమ్ములో తమ కష్టం తాలూకా బాధను మర్చి పోవడానికి మద్యం సేవించడం అనేదిఅందరూ చేసేదే. అలా రెక్కాడితే గానీ డొక్కాడని 35వేల మంది బడుగు జీవులను తన నాలుగేళ్ల పాలనలో జగన్‌రెడ్డి కల్తీ మద్యంతో బలితీసుకున్నాడు. జగన్ రాష్ట్రంలో అమ్ము తున్న మద్యం విషం కంటే ప్రమాదకరమైందని ఇప్పటి కే తేలింది. టీడీపీ నేతలు గతంలో పరిశోధనశాలల్లో పరీక్షించి మరీ జేబ్రాండ్ మద్యంలోని హానికారక రసా యనాల గుట్టుమట్లను ప్రజల ముందు ఉంచారు. అలాంటి మద్యం అమ్ముతూ.. పేదల జీవితాలను తన ధనదాహానికి బలిచేస్తూ.. జగన్‌రెడ్డి తన ఖజానా నింపు కుంటున్నాడని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
మద్యం అమ్మకాల్లో జగన్ రెడ్డి లక్ష కోట్లు కొల్లగొట్టాడు
టీడీపీ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలపై రాష్ట్ర ఖజానాకు ఐదేళ్లలో రూ.50వేల కోట్ల ఆదాయం వస్తే, జగన్‌రెడ్డి నాలుగేళ్ల పాలనలో నాసిరకం మద్యం అధిక ధరకు అమ్మి పేదలనుంచి రూ.1,10,000 కోట్లు కొల్ల గొట్టాడు.మరో లక్ష కోట్లు లెక్కల్లో చూపకుండా, ప్రభు త్వంతో సంబంధం లేకుండా తన తాడేపల్లి ఖజానాకు చేరవేశాడు. నాసి రకం మద్యం తయారీ.. సరఫరా.. అమ్మకాలు.. అన్నీ జగన్‌రెడ్డి కనుసన్నల్లో ఆయన పార్టీ వారే చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో రూ.60కి అమ్మి న క్వార్టర్ మద్యాన్ని జగన్‌రెడ్డి రూ.200 నుంచి రూ.250కు విక్రయిస్తున్నాడు. అది కూడా దారుణమైన కల్తీ మద్యం. ధరలు ఎందుకు పెంచావయ్యా అంటే ప్రజ లు మద్యం తాగకూడదనే పెంచానని తన దిక్కు మాలిన చర్యల్ని సమర్థించు కున్నాడు. ధరలు పెంచి నందువల్ల రాష్ట్రంలో ఎంతశాతం మద్యం విక్రయాలు తగ్గాయో ముఖ్యమంత్రి చెప్పాలి. ధరలు పెంచడం తన దోపిడీ కోసం చేశాడుతప్ప…నిజంగా పేదలతో మద్యం మాన్పించడానికి కాదు.2020-21తో పోలిస్తే ఈ ఏడా ది మద్యం అమ్మకాలు 23శాతం పెరిగాయి. ఈ లెక్క లన్నీ ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయి. అధిక ధరకు నాసి రకం మద్యం అమ్మడంతో పాటు.. దేశంలో ఏ ముఖ్య మంత్రీ చేయని విధంగా సిగ్గు,శరం వదిలేసి బేవ రేజేస్ కార్పొరేషన్ ద్వారా మద్యంపై వచ్చే ఆదాయాన్ని 25 ఏళ్లకు తాకట్టుపెట్టి రూ.30వేలకోట్ల అప్పులు తెచ్చాడు. ఏ ప్రభుత్వం వచ్చినా మద్యం ధరలు తగ్గించే వీలులే కుండా మద్యం అమ్మకాలను తన అప్పుల చట్రంలో ఇరికించాడని అచ్చెన్నాయుడు విమర్శించారు.
జగన్‌రెడ్డికి పేదల ప్రాణాల కన్నా డబ్బే ముఖ్యం..
మద్యం ధరలు పెంచి.. కల్తీ మద్యం ఎందుకు అమ్ముతున్నావని ప్రశ్నిస్తే టీడీపీ ప్రభుత్వంలో పెట్టిన మద్యం కంపెనీలే తప్ప కొత్తగా తన హయాంలో ఎక్కడా మద్యం కంపెనీలకు అనుమతులు ఇవ్వలేదని జగన్ రెడ్డి అడ్డగోలుగా బుకాయిస్తున్నాడు. రాష్ట్రంలో నడుసున్న మద్యం కంపెనీలన్నీ జగన్‌రెడ్డి కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. అవన్నీ ఆయన నాయకత్వంలో పుట్టు కొచ్చినవే. కాదని నిరూపించే ధైర్యం జగన్‌రెడ్డికి ఉంటే.. బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేస్తున్నా. కల్తీమద్యాన్ని అధిక ధరకు అమ్మిస్తూ.. పేదల ప్రాణాల్ని తన ధనదాహానికి బలిచేస్తున్న జగన్ రెడ్డి దోపిడీపై ప్రజలంతా ఆలోచించాలి. జగన్ రెడ్డికి డబ్బే ముఖ్యం కానీ.. ప్రజల ప్రాణాలు.. రాష్ట్ర ప్రయోజనాలతో జగన్ కు పనిలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు.