- కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ మంత్రి అన్నపూర్ణాదేవి
- రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి వినతిపై స్పందన
- పోషకాహార తయారీకి ఫుడ్ ఫ్యాక్టరీపై సానుకూలం
అమరావతి(చైతన్యరథం): కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ అన్నపూర్ణాదేవిని గురువారం రాష్ట్ర స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఢల్లీిలో ఆమె కార్యాలయంలో కలిశారు. సాక్ష్యం అంగన్‌వాడీ సెంటర్ల అభివృద్ధి కోసం నిధులు కోరగా కేంద్రం రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం కూడా రూ.20 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. జన్‌మన్ అంగన్‌వాడీలకు గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి కోసం రూ.20 కోట్లు కేంద్రం నిధులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. డబుల్ పోర్టల్‌లో ఫేషియల్ రికగ్నిషన్ ప్రోగ్రామ్‌ను ఒక పోర్టల్ ద్వారా చేస్తే ఉద్యోగులకు పని భారం తగ్గు తుందని సూచించగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. బాలామృతం కోసం తెలంగాణకు ప్రతి సంవత్సరం రూ.240 కోట్లు చెల్లిస్తున్నామని, ఈ ఏడాది నుంచి ఏపీలోనే ఫుడ్ ఫ్యాక్టరీ పెట్టి సొంతగా తయారీకి రూ.80 కోట్ల అంచనాతో ప్రణాళిక ఉందని కోరగా సానుకూలంగా స్పందించారు. అరకు కాఫీని ఇవ్వగా కేంద్ర మంత్రి ముచ్చట పడి తీసుకు న్నారు. వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇవ్వగా తిరుపతి రావాలనుకుంటున్నట్టు చెప్పారు. ఎంతో అభిమానంతో మాట్లాడి నిధులు మంజూరు చేసిన కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలి పారు. మంత్రి వెంట స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి ఉన్నారు.