- నెలాఖరులోగా డీపీఆర్ ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఏఐకి సూచన
- ఎంపీ కేశినేని శివనాథ్ వినతిపత్రంపై స్పందన
- త్వరితగతిన నిర్మాణం పూర్తికి సహకరిస్తామని వెల్లడి
ఢిల్లీ/విజయవాడ: విజయవాడ నగరంలోనే అతిపెద్ద 16వ నెంబర్ జాతీయ రహదారి పై మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు రైల్వే బ్రిడ్జ్ వరకు నిర్శించనున్న నాలుగులైన్ల ప్లై ఓవర్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ క ఎంపీ కేశినేని శివనాథ్ వినతిపత్రం సమర్పించారు. పార్లమెంటులోని నితిన్ గడ్కరీ చాంబర్‌లో గురువారం కేశినేని కలిసి మూడోసారి బాధ్యతలు చేపట్టిన ఆయనకు అభినంద నలు తెలియజేశారు. ఇదే సందర్భంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణానికి అనుమతులిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు రైల్వేబ్రిడ్జ్ వరకు నిర్శించే ప్లైఓవర్ ప్రాజెక్టుపై ఈ నెలాఖరు కల్లా డీపీఆర్ సమర్పించేలా ఎన్‌హెచ్‌ఏఐ(జాతీయ రహదారుల సంస్థ)ను ఆదేశించాలని అభ్యర్థించారు. 2024-2025 సంవత్సరంలో ప్రాజెక్ట్ పనులు ప్రారంభించి త్వరగా పను లు పూర్తయ్యేలా చూడాలని కోరారు. ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయితే విజయవాడలో ట్రాఫిక్ సమస్య చాలా తగ్గుముఖం పడుతుందని, గన్నవరం విమానాశ్రయానికి తక్కువ సమయంలో చేరుకోవచ్చని వివరించారు. అభ్యర్థనలపై గడ్కరీ సానుకూలంగా స్పందించా రు. అక్కడికక్కడే ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు డీపీఆర్‌పై ఆదేశాలు జారీచేశారు. మహానా డు జంక్షన్-నిడమానూరు రైల్వే బ్రిడ్జి వరకు ప్లై ఓవర్ నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు పూర్తి సహకారం అందిస్తామని వెల్లడిరచారు.